OTT Movie : హారర్ జానర్ లో వచ్చే సినిమాలకు ఆదరణ ఎక్కువగానే ఉంటుంది. ఈ మధ్య ఈ జానర్ సినిమాలు ట్రెండింగ్ లో ఉంటున్నాయి. డిఫరెంట్ స్టోరీలను ప్రేక్షకులు రీసెంట్ గా థియేటర్లలో ఒక తమిళ హారర్ సినిమా నవ్వులు పూయించింది. నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ కథలో ఒకే ఇంట్లో రెండు కుటుంబాలు ఉంటాయి. కానీ వేర్వేరు టైమ్‌లైన్‌లలో స్టోరీ తిరుగుతుంటుంది. ఇది హారర్, కామెడీ, సై-ఫై మిక్స్‌తో ఒక ఫన్ రైడ్ ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘హౌస్ మేట్స్’ (House Mates) 2025లో విడుదలైన తమిళ ఫాంటసీ-హారర్-కామెడీ చిత్రం. రాజవేల్ దర్శకత్వంలో, సివకార్తికేయన్ SK ప్రొడక్షన్స్ బ్యానర్‌తో పాటు ప్లేస్మిత్ స్టూడియోస్, సౌత్ స్టూడియోస్ దీనిని నిర్మించాయి. ఇందులో దర్శన్ (కార్తీక్), ఆర్షా చాందిని బైజు (అను), కాలి వెంకట్ (రమేష్), వినోదిని వైద్యనాథన్ (విజి) ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 9 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, IMDbలో 9.3/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2025 ఆగస్టు 1న థియేటర్లలో విడుదలై, సెప్టెంబర్ 19 నుండి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది.
చెన్నైలో కార్తీక్ అనే కుర్రాడు, ఒక పాత అపార్ట్‌మెంట్ ని కొంటాడు. తన గర్ల్‌ఫ్రెండ్ అనుని పెళ్లి చేసుకుని, అందులో కొత్త జీవితం స్టార్ట్ చేస్తాడు. కానీ వాళ్లు ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుండే వింత వింత సంఘటనలు జరగడం మొదలవుతాయి. లైట్లు ఆటోమాటిగ్గా ఆన్-ఆఫ్ అవడం, టీవీ సడన్‌గా చానెల్స్ మారడం, వంటి విషయాలు టెన్షన్ పెట్టిస్తాయి. మొదట్లో అను ఈ విషయాల్ని కార్తీక్‌తో చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ అతను సీరియస్‌గా తీసుకోడు. ఇంతలో వేరే టైమ్‌లైన్‌లో (2012లో) అదే ఇంట్లో రమేష్, విజి, వాళ్ల కొడుకు హెన్రిక్ కూడా ఇలాంటి వింత అనుభవాలు ఫేస్ చేస్తుంటారు. ఈ రెండు ఫ్యామిలీలు తమ ఇంట్లో జరిగే ఈ పారానార్మల్ యాక్టివిటీస్ వెనుక ఉన్న నిజాన్ని కనిపెట్టడానికి ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా గోడల మీద రాసే మెసేజ్‌ల ద్వారా!
ఈ కథలో హారర్, కామెడీ, ఫాంటసీ మిక్స్ అయి, ఒక కొత్త రకం ఎమోషనల్ టచ్ ఇస్తుంది.సెకండ్ హాఫ్‌లో, ఈ రెండు ఫ్యామిలీలు తమ ఇళ్లలో జరిగే విచిత్రాల వెనుక ఒక షాకింగ్ ట్విస్ట్‌ని కనుగొంటాయి. ఆ ట్విస్ట్ ఏమిటంటే వీళ్లు అదే ఇంట్లో ఉంటున్నారు. కానీ పదేళ్ల గ్యాప్‌తో (2012 vs 2022)! ఈ టైమ్‌లైన్ కనెక్షన్ ఎలా జరిగింది ? ఎందుకు జరిగింది ? అనే సస్పెన్స్‌ని రివీల్ చేస్తూ కథ ముందుకు సాగుతుంది. కార్తీక్, అను, రమేష్, విజి కలిసి ఈ టైమ్-లూప్ మిస్టరీని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. క్లైమాక్స్‌లో ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఎమోషనల్ బాండ్ ఒక కీలక పాత్ర పోషిస్తుంది. టైమ్‌లైన్ ప్రాబ్లమ్‌ని ఫిక్స్ చేసే ఒక హార్ట్‌వార్మింగ్ సొల్యూషన్‌తో కథ ముగుస్తుంది.
Read Also : మరో అమ్మాయితో భర్త ప్రైవేట్ వీడియో లీక్… డర్టీ పొలిటికల్ గేమ్ లో ఫ్యామిలీ బలి… ఇంటెన్స్ కోర్టు రూమ్ డ్రామా