Salman Khan:బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కండల వీరుడుగా పేరు సొంతం చేసుకున్న సల్మాన్ ఖాన్ (Salman Khan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరొకవైపు బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలకు హోస్ట్గా వ్యవహరిస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం హిందీలో 19వ సీజన్ కొనసాగుతూ ఉండగా.. తన అద్భుతమైన హోస్టింగుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు సల్మాన్ ఖాన్. ఇదిలా ఉండగా తాజాగా ఈయన నటించిన ఒక సినిమా ఇప్పుడు అరుదైన అవార్డును అందుకుంది. మరి అది ఏదో ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మూవీకి ఇప్పుడు అరుదైన గౌరవం లభించింది. వాషింగ్టన్ డీసీలో ఇంటర్నేషనల్ స్పై మ్యూజియంలో బెస్ట్ మూవీగా సల్మాన్ ఖాన్ నటించిన ‘ఏక్ థా టైగర్’ మూవీ పోస్టర్ ప్రదర్శించబడింది. ముఖ్యంగా భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి ఈ గౌరవం దక్కించుకున్న ఏకైక సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. థియేటర్లలో విడుదలైన 13 సంవత్సరాల తర్వాత ఈ ప్రత్యేకమైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకోవడం నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు.
అక్కడ ప్రదర్శించిన సినిమా పోస్టర్లు ఇవే..
ఇకపోతే మిషన్:ఇంపాజిబుల్, మెన్ ఇన్ బ్లాక్ , జేమ్స్ బాండ్ వంటి ఐకానిక్ గ్లోబల్ ఫ్రాంచైజీల సరసన ఏక్ థా టైగర్ మూవీ కూడా నిలిచింది. సాధారణంగా ఇంటర్నేషనల్ స్పై మ్యూజియంలో ఐకానిక్ స్పై సినిమాలు, టెలివిజన్ సిరీస్ లకు ఒక ప్రత్యేకమైన విభాగం ఉంటుంది. ఇందులో దాదాపు 25 ప్రసిద్ధ అంతర్జాతీయ టైటిల్స్ పోస్టర్లు ప్రదర్శించబడతాయి. అందులో భాగంగానే ఈసారి క్యాసినో రాయల్, స్పై గేమ్, టింకర్ టైలర్ సోల్జర్ స్పై, మిషన్ ఇంపాజిబుల్, 17 మూమెంట్స్ ఆఫ్ స్ప్రింగ్, ఓఎస్ఎస్ 117, G మెన్, ది ఇమిటేషన్ గేమ్, మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్, హోమ్ ల్యాండ్, అలియాస్, ది సీజ్, మెన్ ఇన్ బ్లాక్ ఇలా ఎన్నో చిత్రాల పోస్టర్లు ఇక్కడ ప్రదర్శించారు.
also read:Film industry: షాక్.. హీరోపై ఎద్దు దాడి.. హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు!
హర్షం వ్యక్తం చేస్తున్న డైరెక్టర్..
ఈ అరుదైన గౌరవం పై దర్శకుడు కబీర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేస్తూ ఈ విధంగా పోస్ట్ పెట్టారు.” సినిమా విజయాన్ని బాక్సాఫీస్ కలెక్షన్లు మాత్రమే నిర్ణయించలేవు.. ప్రేక్షకులకు ఎంతకాలం గుర్తున్నది అనేది కూడా ముఖ్యమే. ఇప్పటికీ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఉండడం మరింత ఆనందంగా ఉంది” అంటూ తెలిపారు.
అప్పట్లోనే సంచలనం సృష్టించిన ఏక్ థా టైగర్..
ఇకపోతే ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో రూపొందించిన తొలి చిత్రం ఏక్ థా టైగర్. 2012 ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమాలో రా ఏజెంట్గా సల్మాన్ ఖాన్ నటించగా, ఐఏఎస్ ఏజెంట్ గా కత్రినా కైఫ్ నటించారు. రూ.75 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే రూ.330 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ అరుదైన గౌరవాన్ని అందుకోవడంతో చిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తున్నారు.