Samantha:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది సమంత (Samantha). ‘ఏ మాయ చేసావే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. అదే సినిమాలో తనకు జోడిగా నటించిన నాగచైతన్య (Naga Chaitanya) తో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న నాగచైతన్య, సమంత పెద్దల సమక్షంలో 2017లో పెళ్లి పేరిట ఒకటయ్యారు. వివాహం తర్వాత ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట.. అనూహ్యంగా 2021 లో విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. ఇకపోతే విడాకుల తర్వాత ఈ విషయంపై నాగచైతన్య ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ సమంత పలుమార్లు చైతూ పేరు ఎత్తకుండానే ఆయనను టార్గెట్ చేస్తూ వచ్చింది.
చైతూ ను మళ్ళీ కెలికిన సమంత..
అయితే ఇప్పుడు మరొకసారి నాగచైతన్యను కెలికే ప్రయత్నం చేసింది సమంత. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. నాగచైతన్య – సమంత మొదట నటించిన చిత్రం ఏ మాయ చేసావే. ఈ సినిమా గుర్తుగా YMC అనే టాటూ ని ఆమె మెడ పైన వేయించుకుంది. ఇక తర్వాత ఇద్దరి చేతి మణికట్టులపైన ఒకే అర్థం వచ్చేలా టాటూ వేయించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ టాటూ ని ఈమె పాక్షికంగా తొలగించింది. కానీ YMC అనే టాటూ ని తొలగించలేదు. ఇప్పుడు ఈ టాటూ ని హైలెట్ చేస్తూ మరోసారి ఫోటోలు పంచుకుంది సమంత.
ఆ టాటూ హైలెట్ అయ్యేలా ఫోజులు..
తాజాగా సమంత ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేయగా.. అందులో డీప్ నెక్ ఉన్న బ్లౌజ్ ధరించింది. బ్యాక్ నుండి ఫోటోలు షేర్ చేస్తూ ఆ టాటూ స్పష్టంగా కనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇకపోతే ఈ టాటూ ని హైలెట్ చేసేలా సమంత ఫోటోలు షేర్ చేయడంతో.. సమంతకి ఇంకా నాగచైతన్య పైన ప్రేమ తగ్గలేదు అని అందరూ అనుకునేలా.. తనపై సింపతి పెంచుకునేలా చేస్తోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది సమంతకి తన భర్త పై ప్రేమ ఉంది. కానీ చైతూకే సమంత పై ప్రేమ లేదు అంటూ ఇండైరెక్టుగా చైతూ పై కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఒక్క టాటూతో మళ్ళీ నాగచైతన్య పై నెగెటివిటీ పెరిగేలా చేసింది సమంత అంటూ నాగచైతన్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సమంత సినిమా కెరియర్..
సమంత విషయానికి వస్తే.. సిటాడెల్ – హనీ బన్నీ వెబ్ సిరీస్ లో యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది ఈ ముద్దుగుమ్మ . అలాగే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి శుభం అనే సినిమాను నిర్మించింది. ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇలా వరుస ఫోటోలతో అభిమానులకు చేరువలో ఉంటుంది. అంతేకాదు బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj nidimoru)తో కూడా ఈమె ప్రేమలో ఉందని, త్వరలోనే వెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై సమంత క్లారిటీ ఇవ్వలేదు.
also read:Telangana: 15 ఏళ్లకే సత్తా చాటిన అమోగ్ రెడ్డి.. ఈ సారి ఫారెస్ట్ థీమ్ తో ఫ్యాషన్ షో!