Telangana: ఏదైనా ఒక రంగంపై ఆసక్తి ఉంది అంటే.. దానికి వయసుతో సంబంధం లేకుండా సత్తాచాటుతూ దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రముఖ యంగ్ ఫ్యాషన్ డిజైనర్ అమోగ్ రెడ్డి (Amogh Reddy). దేశంలోనే అతి చిన్న వయసున్న ఫ్యాషన్ డిజైనర్ గా తన ప్రశస్తిని చాటుకున్నారు. ఇప్పుడు మరొకసారి తన వినూత్న కలెక్షన్ “వనమ్”(ఫారెస్ట్ థీమ్ ) తో మన ముందుకు వచ్చేశారు. హైటెక్స్ లోని నోవోటెల్ HICC వేదికగా ఆదివారం నిర్వహించిన 12వ సీజన్.. “ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్” లో వనమ్ కలెక్షన్ ను ఆవిష్కరించారు. సరి కొత్తగా రూపొందించిన ఈ కలెక్షన్ ఫ్యాషన్ పరిశ్రమలోని అత్యుత్తమ యువ ప్రతిభను ప్రదర్శించడం జరిగింది.
యంగెస్ట్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ గా గుర్తింపు..
ఇకపోతే అమోగ్ రెడ్డికి ఫ్యాషన్ డిజైనింగ్ లో ఉన్న ప్రతిభ ఫ్యాషన్ ఔత్సాహికులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. 15 ఏళ్ల వయసులోనే ఫ్యాషన్ డిజైనింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అమోగ్ రెడ్డి.. రెండేళ్లలోనే డిజైనింగ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.అంతేకాదు “యంగెస్ట్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్” అనే బిరుదును కూడా సొంతం చేసుకున్నారు. సాంప్రదాయ భారతీయ, వివాహ కోచర్ లో తన నైపుణ్యానికి పేరుగాంచిన అమోగ్.. వారసత్వాన్ని ఆధునిక ఫ్యాషన్ హక్కులతో విలీనం చేస్తూ.. అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్ క్లైంట్ ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇక చిన్న వయసులోనే ఈ తరం ఫ్యాషన్ ఫార్ములాను అవలీలగా వంట పట్టించుకున్న ఈయన.. సరికొత్త ఫ్యాషన్ డిజైనింగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు..
ప్రకృతి నుండే ఫ్యాషన్ పుట్టుకొచ్చింది..
ఇకపోతే నూతనంగా ఆవిష్కరించిన ఈ వనమ్ కలెక్షన్ ప్రకృతి సౌందర్యాన్ని, అరణ్యం అందం నుంచి ప్రేరణ పొందిన అల్లికలు, ఆకారం, రంగు ఇలా ప్రతి సున్నిత అంశంలో డిజైనింగ్ సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తోంది. ముఖ్యంగా మన ఊహకు కూడా అందని కొత్త ఫ్యాషన్ ఫార్ములా. అందమైన అడవిలో కలిసిపోయి ఉంటుంది. అంతేకాదు ఒక్కొక్క లేయర్ ఇలా ఆకర్షణీయంగా.. నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది అంటూ అమోగ్ తన ఆలోచనలను పంచుకున్నారు. ఇక దీనిపై ఆయన మాట్లాడుతూ.. “అడవి సౌందర్యం లోనే ఆ సహజ సేంద్రియ శక్తిని నా కలెక్షన్ లోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను” అంటూ తెలిపారు.
ఫ్యాషన్ అంటే వృత్తికి మించిన బాధ్యత..
ఆ ప్రకృతిలోని బెరడు అల్లికలు, ఆకుపచ్చ తరంగాలు, తీగల నాజూకుతనం ఈ అంశాలన్నీ నన్ను సజీవంగా కనిపించే ఈ డిజైన్లను రూపొందించడానికి ప్రేరేపించాయి. ఫ్యాషన్ అంటే వృత్తికి మించిన బాధ్యత, వ్యక్తిత్వం, సంస్కృతి వ్యక్తీకరణ. ఈ ఫ్యాషన్ భవిష్యత్తు అనేది వ్యక్తిగతమైనది. ఇందులో రాణించడం అద్భుతమైన అనుభవాలకు వేదికగా మారింది అంటూ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు భారతదేశంతో పాటు ప్రపంచ నలమూలల తన డిజైన్స్ ను విస్తరింప చేయాలని ముందుకు సాగుతున్నాను అంటూ కూడా తెలిపారు.
ప్రతి డిజైనింగ్ ఒక కథను చెబుతుంది..
ఇకపోతే ఈ కలెక్షన్ లోని ప్రతి డిజైనింగ్ ఒక కథను చెబుతుందని, ప్రకృతితో తిరిగి అనుసంధానం కావాల్సిన అవసరాన్ని, అందులోని మాధుర్యాన్ని హైలైట్ చేస్తుందని అమోగ్ తెలిపారు. ఈ డిజైన్లు మట్టి మాధుర్యాన్ని, వినూత్న పద్ధతుల విశిష్టతను, ఆధునిక ఫ్యాషన్ సున్నితత్వాలతో సాంప్రదాయ హస్త కలను సమన్వయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇక మొత్తానికి అయితే ఈ వనమ్ ఫ్యాషన్ డిజైన్స్ ఫ్యాషన్ ఔత్సాహికులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.
also read:Gabbar Singh: గబ్బర్ సింగ్ నటుడికి హత్యా బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు!