Katrina Kaif: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి కత్రినా కైఫ్ (Katrina Kaif)ఒకరు. ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే తల్లి కాబోతోంది అంటూ గత కొద్దిరోజులతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై కత్రినా లేదా విక్కీ కౌశల్(Vicky Kaushal) ఎక్కడా అధికారికంగా స్పందించకపోవడంతో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు.
ఇకపోతే ఇటీవల కత్రినా బేబీ బంప్(Baby Bump) తో ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో లీక్ అవడంతో కచ్చితంగా కత్రినా తల్లి కాబోతున్నారని అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది అంటూ అభిమానులు భావించారు. అయితే తాజాగా కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ దంపతులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రేగ్నెన్సీని అధికారకంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే కత్రినా కైఫ్ బేబీ బంప్ తో ఉన్న ఫోటోని ఈ జంట సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా బేబీ బంప్ ఫోటోను షేర్ చేస్తూ..”సంతోషం కృతజ్ఞతతో.. మా జీవితంలోని ఉత్తమ అధ్యాయాన్ని ప్రారంభించే మార్గంలో అంటూ” ఈ జంట తమ ప్రేగ్నెన్సీ విషయాన్ని అధికారకంగా ప్రకటించారు.
ప్రేమ వివాహం చేసుకున్న జంట..
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈమె బేబీ బంప్ చూస్తుంటే మాత్రం మరికొద్ది రోజులలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని స్పష్టమవుతుంది. ఇలా త్వరలోనే తల్లి కాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ జంట గత నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న కత్రినా విక్కీ కౌశల్ పెద్దల సమక్షంలో రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ లో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం జరుపుకున్నారు.
ఇక పెళ్లి తర్వాత కూడా కత్రినా సినిమా పనులలో బిజీగా ఉంటూ వరుస సినిమాలలో నటించారు. ఇక ఈమె చివరిగా కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతితో కలిసి మేరీ క్రిస్మస్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత కత్రినా ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు. ఇక విక్కీ కౌశల్ ప్రస్తుతం పలు సినిమాల పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన రష్మికతో కలిసి నటించిన ఛావా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత విక్కీ కౌశల్ తదుపరి లవ్ అండ్ వార్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక కత్రినా కైఫ్ తెలుగులో కూడా పలు సినిమాలలో నటించారు. వెంకటేష్ హీరోగా నటించిన మల్లీశ్వరి సినిమాలో నటించే సందడి చేశారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. అలాగే బాలయ్యతో కలిసి అల్లరి పిడుగు సినిమాలో సందడి చేశారు. ఈ సినిమాల తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
Also Read: Pawan Kalyan: చిరంజీవి 47 ఏళ్ల సినీ ప్రయాణం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన పవన్..పెద్దన్నయ్య అంటూ!