BigTV English
Advertisement

Samantha : దీనికి వారసత్వంతో పని లేదు… సమంత కొత్త ఛాలెంజ్

Samantha : దీనికి వారసత్వంతో పని లేదు… సమంత కొత్త ఛాలెంజ్

Samantha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్  హీరోయిన్ గా దశాబ్దన్నర కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో సమంత(Samantha) ఒకరు. సమంత సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఫిట్నెస్ కోసం కూడా అంతే కష్టపడతారని చెప్పాలి. సినిమా షూటింగ్ లేకుండా ఉంటే తనకు ఏమాత్రం విరామం దొరికిన సమంత ఎక్కువగా జిమ్ లోనే దర్శనమిస్తారు. పెద్ద ఎత్తున వర్క్ అవుట్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. ఇలా సమంత వర్కౌట్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. తాజాగా సమంత డెడ్ హ్యాంగ్ చాలెంజ్(Deadhang challenge) అంటూ ఒక వీడియోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్..

ఇలా డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్ లో భాగంగా.. 90 సెకండ్ల పాటు ఈమె ఈ వ్యాయామం చేశారు. ఇందులో భాగంగా  మీ చేతులు పూర్తిగా చాచి, పాదాలను 90 సెకన్ల పాటు వేలాడదీసి పుల్-అప్ బార్ చేశానని అందులో సక్సెస్ అయ్యానని తెలిపారు. ఇక ఈ వీడియో గురించి ఈ చాలెంజ్ గురించి వివరిస్తూ..”మీరు ఎలా కనిపిస్తున్నారు అనేది ఇక్కడ విషయం కాదు.. మీ వారసత్వం ఏంటి అనేది కూడా ముఖ్యం కాదు ,సెల్ఫీలు పంచుకోవడం ముఖ్యం కాదని ఎవరు చూడనప్పుడు మీరు ఎంత బలంగా ఉన్నారనేది ముఖ్యమని ఇదే బలం అంటే” అంటూ సమంత ఈ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


ఫిట్నెస్ కు ప్రాధాన్యత..

సమంత ఎంతో కఠినమైన వ్యాయామాలు చేస్తూ కనిపిస్తున్న నేపథ్యంలో అభిమానులు ఈమె ఫిట్నెస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో కూడా ఇలా పెద్ద ఎత్తున వెయిట్ లిఫ్ట్ చేస్తూ సమంత అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ పోస్టులో సమంత మీ వారసత్వం కూడా ముఖ్యం కాదంటూ చెప్పుకు రావడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

?igsh=b3c4b2pyN2JzbjVm

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఈమె గత కొంతకాలంగా తెలుగులో సినిమాలకు పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తుంది. సమంత చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి నటించడం ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత సమంత ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వకపోయినా ప్రస్తుతం పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ వాటి షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. త్వరలోనే ది ఫ్యామిలీ మెన్3 ద్వారా రాబోతున్నారు ప్రస్తుతం ఈమె రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్ షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్నారు. అయితే త్వరలోనే నందిని రెడ్డి (Nandini Reddy)దర్శకత్వంలో సమంత ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా పనులలో బిజీ కాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ ఈ సినిమా సమంత నిర్మాణ సంస్థలోనే తెరకెక్కబోతుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది అంటూ ఇదివరకు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: Venu Yeldandi : అల్లు అర్జున్ తో సినిమా ఛాన్స్ .. చెయ్యలేనంటూ దండం పెట్టిన వేణు!

Related News

Fauzi: ఫౌజీ కోసం తెగ కష్టపడుతున్న ఘట్టమనేని వారసుడు..  పెద్ద టాస్కే ఇదీ!

Jatadhara trailer : ఇంకెన్ని రోజులు అవే దయ్యాలు కథలు? ఈ దర్శక నిర్మాతలు మారరా?

Sree vishnu: సితార ఎంటర్టైన్మెంట్ లో శ్రీ విష్ణు.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా విష్ణు కొత్త సినిమా!

Chinmayi: తాళి వేసుకోవడంపై ట్రోల్స్.. కౌంటర్ ఇచ్చిన చిన్మయి!

Allu Aravind: సరైనోడు 2 అప్డేట్ ఇచ్చిన అల్లు అరవింద్.. ఎప్పుడొచ్చినా సరే అంటూ!

Dulquer Salman: పెళ్లిలో ఫుడ్ పాయిజన్..  దుల్కర్ సల్మాన్ కు నోటీసులు?

Dheeraj Mogilineni: ఇద్దరు ఆడపిల్లలతో రాహుల్ కష్టాలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన నిర్మాత

Mithra Mandali: ఓటీటీకి వస్తున్న మిత్రమండలి.. ఎక్కడ చూడొచ్చు అంటే

Big Stories

×