BigTV English

Venu Yeldandi : అల్లు అర్జున్ తో సినిమా ఛాన్స్ .. చెయ్యలేనంటూ దండం పెట్టిన వేణు!

Venu Yeldandi : అల్లు అర్జున్ తో సినిమా ఛాన్స్ .. చెయ్యలేనంటూ దండం పెట్టిన వేణు!

Venu Yeldandi: వేణు ఎల్దండి(Venu Yeladandi) పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో సినిమాలలో కమెడియన్ పాత్రలలో నటించి తన అద్భుతమైన కామెడీ ద్వారా ప్రేక్షకులను మెప్పించిన ఈయన జబర్దస్త్(Jabardasth) కార్యక్రమంలో కమెడియన్ గా మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. జబర్దస్త్ కార్యక్రమం మొదలైన కొత్తలో కమెడియన్ గా తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వేణు  దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. వేణు దర్శకత్వంలో బలగం (Balagam)అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఊహించని విధంగా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.


ఎల్లమ్మ అంటూ రాబోతున్న వేణు..

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు చూపించడమే కాకుండా తోబుట్టువుల మధ్య ఉన్న బంధుత్వాన్ని కూడా వేణు చాలా సహజసిద్ధంగా చూపించారు. ఇలా వేణు బలగం సినిమాతో దర్శకుడుగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న అవార్డులన్నీ దాదాపు ఈ సినిమాకు వచ్చాయనే చెప్పాలి. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తిరిగి ఈయన ఎల్లమ్మ (Yellamma)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నితిన్ హీరోగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఆ సినిమాలో ఛాన్స్ వస్తే చాలు…

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా డైరెక్టర్ వేణు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వేణు తన సినీ జర్నీ గురించి అభిమానులతో ఎన్నో విషయాలను పంచుతున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన జై లవకుశ సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాల గురించి తాను సలహాలు ఇచ్చానని అల్లు అర్జున్ గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన రుద్రమదేవి సినిమాలో కూడా కొన్ని డైలాగులు నేనే రాసానని ఈ సందర్భంగా తెలిపారు. ఇలా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అల్లు అర్జున్(Allu Arjun) ఎన్టీఆర్ గురించి ప్రస్తావనకు వచ్చింది.

నాకు ఆ స్థాయి లేదు…

అల్లు అర్జున్, ఎన్టీఆర్ (NTR)లను డైరెక్ట్ చేసే అవకాశం వస్తే మీరు సినిమా చేస్తారా? అనే ప్రశ్న ఈ సందర్భంగా వేణుకి ఎదురయింది. ఈ ప్రశ్నకు వేణు సమాధానం చెబుతూ వారి సినిమాలలో ఒక చిన్న పాత్రలో నాకు నటించే అవకాశం వస్తే చాలు వారిని డైరెక్ట్ చేసే అంత స్థాయిలో నేను లేనని తెలిపారు. వారికి అనుగుణంగా ఏదైనా కథ రాయవచ్చు కానీ  వారిని డైరెక్ట్ చేసే అంత స్థాయి నాకు ఇంకా రాలేదని నేను భావిస్తాను. ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారందరూ ఒక బ్రాండ్ అని అలాంటి వారితో సినిమాలు తాను ఇప్పుడప్పుడే చేయలేను అంటూ వేణు ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ ఎన్టీఆర్ వంటి వారందరూ కూడా పాన్ ఇండియా స్థాయిలో హీరోలుగా మంచి గుర్తింపు సంపాదించుకొని సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా వారితో ఆస్థాయి సినిమా చేసే రేంజ్ నాది కాదంటూ ఈయన చెప్పకనే చెప్పేశారు.

Also Read: Kingdom pre Release: మీరు దేవుడు ఇచ్చిన వరం.. ఎమోషనల్ అయిన విజయ్!

Related News

OG Film: ఓజీ కోసం పవన్ రెమ్యూనరేషన్..ఎవరికి ఎంతంటే?

OG premiers: నైజాం అంటే పవన్ అడ్డా… అన్ని రికార్డులు బద్దలు కొట్టిన ఓజీ

OG Sujeeth : సుజీత్ సినిమాటికి యూనివర్స్, చివరగా ఫ్యాన్స్ కు మరో హై

 Mass Jathara: మాస్ జాతర రిలీజ్ డేట్..కీలక అప్డేట్ ఇచ్చిన నాగ వంశీ!

Arjun Das : అర్జున్ దాస్ ఎమోషనల్ పోస్ట్, పవన్ కళ్యాణ్ ఏ మత్తు మందు పెట్టాడో?

OG Movie: ఓజీ సినిమా ప్రమోషన్స్..చిక్కుల్లో పడ్డ జగతి ఆంటీ..మరి ఇంత దారుణమా!

Samantha: సమంత పెట్టుకున్న లగ్జరీ వాచ్ చూశారా.. ఖరీదు ఎంతో తెలుసా?

Tamannaah : తమన్నా ఐటెం సాంగ్స్ వెనుక ఆ బడా హీరో… మొత్తం ఆయనే చేశాడు

Big Stories

×