Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలో ఒక ప్రాజెక్టు అయిన నిర్మించిందా?.. ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో ఉంటే ఆ వివరాలు బయట పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మూడేళ్లలో నీళ్లు ఇవ్వలేదు ప్రాజెక్టుల అనుమతు తేలేదు.. డి పి ఆర్ వాపస్ వచ్చింది అని మండిపడ్డారు. అంబేద్కర్, కాలేశ్వరం మూడో డీఎసీ, సమ్మక్క సాగర్ డి పి ఆర్ లు వాపస్ వచ్చాయని.. కొత్త ఆయకట్టు తేలేదని కొత్త ప్రాజెక్టు నిర్మించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జి ఆర్ ఎం బి మీటింగ్‌లో ఏపీ తెలంగాణకు ఇచ్చిన ఏడు ప్రాజెక్టులను రద్దు చేయండి అని రాసిందని.. మేము అనుమతులు తెస్తే ఏపీ అనుమతులు రద్దు చేయాలని కోరుతున్నది.. 2018 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు నిర్మించాము అని తెలిపారు.
కాంగ్రెస్ బురద రాజకీయం తప్ప ఏం చేసిందని నిలదీశారు. కెసిఆర్ నిర్మించిన లిఫ్టు కూడా ఆన్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదుల, సీతారామ, కల్వకుర్తి ప్రాజెక్టు నుంచి ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఎత్తిపోశావో వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్ధత వల్లనే చంద్రబాబు 700 కిలోమీటర్లు నీళ్లు పోయాడన్నారు. ఏపీలో క్రాప్ హాలిడే లేదు తెలంగాణలో మాత్రం క్రాఫ్ హాలిడే అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లోనే తాగునీటి పంపిణీలో తెలంగాణ రోడ్లు మోడల్ దేశానికి అని స్పష్టం చేసిందన్నారు. మిషన్ భగీరథ పథకం దేశానికి హర్ ఘర్ జల్ అయిందని.. ఫ్లోరైడ్ రెక్కసికి కారణం కాంగ్రెస్.. తాగునీళ్లు ఇవ్వలేదు సాగునీరు ఇవ్వలేదు అని అన్నారు.
పల్నాడు విషయంలో కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు చెప్పిందని.. టిఆర్ఎస్ ప్రశ్నిస్తే పాత డేట్ తో ఉత్తరాలు రాసి తప్పించుకోవాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు స్కీంకు 2025 జనవరిలో టెండర్లు పిలిచిందని.. మరి అప్పుడు ఏం చేశారని నిలదీశారు. గోదావరి ఏడు ప్రాజెక్టులు రద్దు చేయాలన్న ఆలోచన విరమించుకోవాలని టిఆర్ఎస్ కొట్లాడితే కాంగ్రెస్ పాత డేట్లు వేసి లేఖలు రాశారని.. బనకచర్ల విషయంలోనూ అంతేనని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత 458 జీవోలో క్లియర్ గా నాగార్జున సాగర్ నుంచి 1.865 టిఎంసి నాగార్జునసాగర్ నుంచి తీసుకుంటామని స్పష్టంగా ఉందన్నారు. 2022 జీవోలో ఎక్కడైనా ఉందా అని నిలదీశారు. పల్నాడు ను అడ్డుకుంటామని ప్రభుత్వం ఎక్కడ అనలేదని, కె ఆర్ ఎం బి మీటింగ్ లోను అన్నాడు గురించి ఒక్క మాట తెలంగాణ ఇంజనీర్లు మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: నెట్‌ఫ్లిక్స్‌లోకి మెగాస్టార్ ఎంట్రీ.. ‘ఇది నా అడ్డా’ అంటూ చిరంజీవి రచ్చ!
299.512 విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ కారణమన్నారు. విభజన బిల్లులో పెట్టింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. తమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తామని మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ కోసం మూడేళ్ల సమయం పట్టిందని అన్నారు. నిజంగా శాశ్వతంగా ఒప్పుకుంటే ఎందుకు కేసీఆర్ ట్రిబ్యునల్ సాధించారన్నారు. నీటి వినియోగంపై కాంగ్రెస్ అవే పచ్చి అబద్ధాలు.. 2024 -25 లో ఏపీ 718, తెలంగాణ 286 టీఎంసీలు వాడిందని.. అందులో పర్సంటేజ్ 28 మాత్రమే అన్నారు. 2025- 26 లో ఏపీ 771, తెలంగాణ 267 టీఎంసీలు.. పర్సంటేజ్ 25%.. చరిత్రలో ఇదే అత్యల్పమన్నారు. 2026-27 ఈ ఏడాదిలో110 టిఎంసిలు వాడినం అంటున్నారని.. అవసరం ఉన్నచోట పర్సంటేజీ చెబుతారు..అవసరం లేని చోట టీఎంసీ అని చెబుతారు.. అతి తక్కువ నీటి వినియోగం చేసిన దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై పదేపదే కాంగ్రెస్ అబద్ధాలు చెబుతుందని మండిపడ్డారు. పోతురేడిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అవే పచ్చి అబద్దాలని.. ఆ ప్రాజెక్టు పై అసెంబ్లీలో పోరాటం చేశామని 42 రోజులు అసెంబ్లీని స్తంభింప చేశామన్నారు. కానీ ఆ రోజు ఇదే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తంకుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దామోదర రాజనర్సింహ చిన్నారెడ్డి నోరు మూసుకొని.. ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నది కాంగ్రెస్ నాయకులని మండిపడ్డారు. నీళ్లు ఎత్తమంటే ఆరోజు అన్నారం సుందిళ్ల కూలితే భద్రాచలం కొట్టుకుపోతుందని అన్నారని ఇప్పుడేమో మేడిగడ్డ దగ్గర నీళ్లు ఎత్తుకుంటే దేవాదుల సీతమ్మ సాగర్ ఉంది అంటున్నారని గ్రావిటీ ద్వారా కమిటి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు రావని ప్రభుత్వం చావు కబురు చల్లగా చెప్పింది అన్నారు.
గ్రావిటీ ద్వారా నీళ్లు తెస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మాట మార్చింది అన్నారు. గ్రావిటీ అని చెప్పినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అర్థమై కుట్రలు చేస్తున్నారని. కాంగ్రెస్ నేతలకు నిద్రలో కూడా కేసీఆర్ నే కలవరిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ గెలుపు ఖాయం అయిందని అన్నారు. అందుకే ఫ్రస్టేషన్లో బురద రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం టిఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వలనే తెలంగాణ ప్రజల వలసలకు కారణమని దుయ్యబట్టారు.
Also read: హైదరాబాద్‌లో ఒంటరి ప్రయాణాలు వద్దు: సీపీ ఎం. రమేష్!