Film industry:సినీ సెలబ్రిటీల విడాకులు రోజురోజుకీ పెరిగి పోతున్నాయి. ఒకరి విడాకుల వార్తల నుండి బయటపడక ముందే మరొకరి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఇండస్ట్రీ మొత్తం వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ప్రముఖ కన్నడ నటుడు కూడా విడాకులు తీసుకోబోతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే.. కన్నడలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ రావు (Ajay Rao)తన భార్య స్వప్నకి విడాకులు ఇవ్వబోతున్నట్టు కన్నడ మీడియా మొత్తం కోడై కూస్తోంది. ఇక ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆ హీరో మీద భార్య గృహహింస చట్టం కింద కేసు కూడా నమోదు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అసలు విషయం ఏమిటంటే.. ?
కన్నడ ప్రముఖ నటుడు అజయ్ రావు, స్వప్నవివాహం 2014లో జరిగింది.వీరికి చరిష్మా అనే కూతురు కూడా ఉంది. అయితే ఇన్నేళ్లు వీరి బంధం ఎంతో సక్సెస్ఫుల్గా కొనసాగినప్పటికీ.. ఈ మధ్యకాలంలో వీరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, కలతలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే స్వప్న తన భర్తపై గృహ హింస చట్టం కింద కేసు కూడా నమోదు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు విడాకులు కూడా తీసుకోబోతున్నారనే రూమర్లు వినిపించడంతో ఈ విషయం గురించి అటు అజయ్ రావు, ఇటు స్వప్న ఇద్దరు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి స్పందించారు.
విడాకుల రూమర్స్ పై అజయ్ రావు క్లారిటీ..
ఇక విడాకుల గురించి అజయ్ రావు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టారు. “ఇలాంటి సమయంలో మీరు మా కుటుంబ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలి. మాకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను బయట పబ్లిసిటీ లాగా మార్చకండి. కుటుంబం అన్నాక ప్రతి ఒక్కరి ఇంట్లో గొడవలు ఉంటాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మా కుటుంబ గోప్యతకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే నా భార్య కోర్టుకు వెళ్లిందో ఏమో నాకు తెలియదు.. ఈ విషయం గురించి నా భార్య నుండి పూర్తి సమాచారం తెలుసుకుంటాను” అంటూ ఓ పోస్ట్ పెట్టారు.
గోప్యతకు భంగం కలిగించకండి అంటున్న స్వప్న..
అయితే అజయ్ రావు ఈ విధంగా పోస్ట్ పెడితే.. స్వప్న మరోలా పోస్ట్ పెట్టింది. అందులో ఏముందంటే.. “ఒక తల్లిగా నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నా కూతురికే.. ఆమె భవిష్యత్తు ఏంటి అనే దాని గురించే నేను ముందుగా ఆలోచిస్తాను. గత కొద్ది రోజుల నుండి ఇబ్బందులు పెడుతున్న వారిని ధైర్యంగా ఎదుర్కొంటూ వస్తున్నాను. ప్రియమైన సోదర సోదరీమణులారా ఇప్పుడిప్పుడే నా కూతురు, నేను మా జీవితాలను తిరిగి నిర్మించుకుంటున్నాము.. అయితే ఈ విషయం పూర్తిగా మా కుటుంబానికి సంబంధించింది. మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేలా చేయకండి.మా వ్యక్తిగత విషయాల గురించి పబ్లిసిటీ చేయకండి. దయచేసి మా సమస్యను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టింది”. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే..ఈ పోస్ట్ తర్వాత స్వప్న తన పేరును మాత్రమే పెట్టుకోకుండా తన పేరు చివర స్వప్న అజయ్ రావు అని పెట్టుకోవడంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.
ఎందుకంటే స్వప్న తన భర్తకు విడాకులు ఇవ్వాలని అనుకుంటే తన పేరు చివర భర్త పేరును ఎందుకు యాడ్ చేస్తుంది. అలా చేయదు కదా.. తన భర్త మీద తనకు ఇంకా గౌరవం, ప్రేమ ఉన్నాయి. అందుకే విడాకులు తీసుకోకుండానే ఈ విషయాన్ని సర్దుమనిగిపోయేలా చేయాలని చూస్తుంది కావచ్చు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి అజయ్ రావు స్వప్న లు పెట్టిన ఈ సోషల్ మీడియా పోస్టులు మాత్రం వైరల్ గా మారాయి.
అజయ్ రావు సినీ కెరియర్..
నటుడు అజయ్ రావు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.ఆయన భార్య ఐటీ ఉద్యోగి. అంతేకాకుండా ఆమెకి ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. అలాగే భర్తకు ఇండస్ట్రీతో సంబంధం ఉన్నప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎలాంటి ఈవెంట్లలో, ఫంక్షన్లలో కూడా స్వప్న హాజరు కాదు. అలాంటిది స్వప్న తన భర్త మీద గృహహింస చట్టం కింద కేసు పెట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై నిజానిజాలు ఇంకా బయటకు రాలేదని చెప్పవచ్చు.
also read:AA22xA6 Update : అల్లు అర్జున్ ఎంట్రీ సీన్‌కు అట్లీ మాస్టర్ ప్లాన్.. వందల మందితో..