E-Paper
Advertisement

CM Chandrababu: 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

CM Chandrababu: 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Advertisement

CM Chandrababu: ఏపీలో 3 లక్షల ఇళ్ల కృహప్రవేశాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాయచోటి ప్రజల అపారమైన అభిమానం, ఉత్సాహాన్ని చూసి ఆనందం కలిగిందని తెలిపారు. ప్రజల ఆశల్ని నెరవేర్చడమే తాను చేస్తున్న ప్రతి నిర్ణయానికి మూలం అని ఆయన పేర్కొన్నారు.

కనిగిరి నుంచి 98 పరిశ్రమలకు ఫౌండేషన్ వేశాం. ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులు ఏర్పాటు చేస్తాం. ప్రతి యువకుడు పారిశ్రామికవేత్తగా ఎదగడానికి ప్రభుత్వం అవసరమైన మద్దతు అందిస్తుంది అన్నారు సీఎం. పరిశ్రమలు మాత్రమే ఉపాధిని పెంచవని, గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని చంద్రబాబు వివరించారు.

Advertisement

తెలుగు ప్రజల కృషి, ప్రతిభ ప్రపంచంలో ఎక్కడైనా వెలుగొందుతుందని, చదువుంటే ప్రపంచాన్ని శాసించే శక్తి వస్తుంది అంటూ యువతను ఉద్దేశించి పిలుపునిచ్చారు. సాంకేతికత, విద్య, పరిశ్రమలు ఈ మూడింటినీ కలిపి అభివృద్ధి సాధ్యమని తెలిపారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ రోజు ఒకేసారి 3 లక్షల ఇళ్ళకు గృహ ప్రవేశాలు జరగడం రాష్ట్ర చరిత్రలో గొప్ప ఘట్టమని పేర్కొన్నారు. ఇల్లు అంటే కేవలం గోడలు కాదు, అది కుటుంబ భవిష్యత్తుకు నాంది అన్నారు.

Advertisement

అన్నమయ్య జిల్లాలో 60 వేల ఇళ్ళు మంజూరు చేసి, వాటిలో 10 వేల ఇళ్ళు పూర్తి చేశామని, త్వరలో మిగిలినవన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం పేదవారి ఇళ్లను రద్దు చేసింది, కానీ మేము వాటిని పునరుద్ధరించాం. నిధులు కొరత ఉన్నా, ప్రజా ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని తెలిపారు.

గత ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. కూటమి ఏర్పడి 17 నెలల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ మనం దిశ తెలుసుకున్నాం. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో మనకు స్పష్టమైన అవగాహన ఉంది. ఇప్పుడే ఆర్థిక పునరుద్ధరణ పథంలో అడుగులు వేస్తున్నాం అన్నారు.

డ్వాక్రా సంఘాల వద్ద ప్రస్తుతం రూ.25 వేల కోట్ల నిధులు ఉన్నాయని తెలిపారు. ఆ నిధులను మహిళా సాధికారత, గ్రామాభివృద్ధి కోసం ఉపయోగిస్తామని చెప్పారు. మహిళలే ఆర్థిక పురోగతికి అస్త్రాలు. వారిని ప్రోత్సహించడం అంటే సమాజాన్ని బలపరచడం అని చెప్పారు.

రాయచోటి లాంటి వెనుకబడిన ప్రాంతంలో కూడా నేడు డ్రిప్ సిస్టం వ్యవసాయం.. అందుబాటులోకి రావడం అభివృద్ధికి నిదర్శనమని చంద్రబాబు చెప్పారు.

Also Read: సాగర తీరానికి క్యూ కడుతున్న ఐటీ కంపెనీలు, మరో కంపెనీ రాక, ఏకంగా 2000 మందికి ఉపాధి

1986లో ఎన్టీఆర్ ప్రారంభించిన ‘కూడు, గూడు, గుడ్డ’ నినాదాన్ని గుర్తుచేసి, “ఆ భావజాలమే తెలుగుదేశం పార్టీకి పునాది. పేదవాడి గూటి కల నిజం చేయడమే మా ధ్యేయం అని అన్నారు.

సొంత ఇళ్లు మీ భవిష్యత్తుకు నాంది. మీ గౌరవానికి గుర్తు అని చెబుతూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురానున్నామని తెలిపారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×