Sandhya Theater Stampede: గత ఏడాది డిసెంబర్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఆ ఘటన సంధ్యా థియేటర్ తొక్కిసలాట.. టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగింది.. అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రావడంతో ఒక్కసారిగా అభిమానులు గుంపుగా వచ్చేసారు. దాంతో అక్కడ తొక్కేసలాట జరిగింది.. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలను పోగొట్టుకుంది. ఆమె కొడుకు జీవచ్చవంలా ప్రాణులతో ఇప్పటికీ పోరాడుతున్నాడు.. మీరు ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగు పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. తాజాగా ఈ శ్రీ తేజ్ కు తెలంగాణ సర్కార్ వారి సాయాన్ని చేసేందుకు ముందుకొచ్చింది..
శ్రీతేజ్ కు రేవంత్ సర్కార్ భారీ సాయం..
శ్రీతేజ్ కు ప్రమాదం జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు హాస్పిటల్ ఖర్చులు అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం పెడుతుంది.. అతని హాస్పిటల్ ఖర్చులతో పాటుగా కుటుంబానికి కూడా భారీ సాయం చేసింది తెలంగాణ సర్కార్.. తాజాగా మరో గుడ్ న్యూస్ ని చెప్పింది. బాలుడు శ్రీతేజ్ చెల్లెలికి 18 ఏళ్లు వచ్చే వరకూ నెలకు రూ.4 వేలు అందించాలని నిర్ణయించింది. ఛైల్డ్ రైట్స్ కమిషన్ చొరవతో ‘మిషన్ వాత్సల్య’ పథకాన్ని ఆ కుటుంబానికి వర్తించేలా చేసింది. అలాగే అతని చెల్లెలి చదువుకు ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. దీంతో బాధిత కుటుంబం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది..
Also Read : ‘ఇంటింటి రామాయణం ‘ అక్షయ్ గురించి ఎవరికి తెలియని నిజాలు..!
ఆరోజు ఏం జరిగింది..?
పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా గతఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఆరోజుకు ఒక్కరోజు ముందుగా ప్రీమియర్ షోలు పడ్డాయి. పుష్ప మూవీతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ దానికి సీక్వెల్ గా పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు. ఇక హైదరాబాదు నడిబొడ్డున ఉన్న సంధ్య థియేటర్ వద్దకి అల్లు అర్జున్ ముందస్తు అనౌన్స్మెంట్ లేకుండానే రావడంతో ఒక్కసారిగా అభిమానులు తోసుకుంటూ ముందుకు వచ్చారు. అల్లు అర్జున్ తో సెల్ఫీలు దిగెందుకు ముందుకు వచ్చారు. దాంతో ఒక్కసారిగా జనాలందరూ గుంపుగా రావడంతో జనాలు మధ్య తొక్కేసలాట, తోపులాటలు జరిగాయి. శ్రీతేజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క్రమంగా కోలుకున్నాడు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మూవీ టీం, హీరో బన్నీ బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షలు, అల్లు అరవింద్ రూ.2 కోట్లు, డైరెక్టర్ సుకుమార్ రూ.50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి కోమటి రెడ్డి రూ.25 లక్షలు అందజేశారు.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ లు చెప్పింది.. శ్రీతేజ్ ఆరోగ్యం మెల్లగా కోలుకుంటుందని వైద్యులు చెప్తున్నారు. ఎప్పుడు కోల్కుంటారు తెలియదని చెప్తున్నారు.