BigTV English

OTT Movie : డిజిటల్ యుగంలో జరిగే క్రైమ్స్ అన్నీ ఈ ఒక్క మలయాళ మూవీలోనే… కేసు కేసుకో ఇంటెన్స్ క్రైమ్ కథ

OTT Movie : డిజిటల్ యుగంలో జరిగే క్రైమ్స్ అన్నీ ఈ ఒక్క మలయాళ మూవీలోనే… కేసు కేసుకో ఇంటెన్స్ క్రైమ్ కథ

OTT Movie : మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సినిమాలు సరికొత్త కంటెంట్ తో ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. థియేటర్లలో ఈ సినిమాలు చూడని వాళ్ళు, ఆశగా ఎప్పుడొస్తాయా అని ఓటీటీ వైపు చూస్తున్నారు. అలాంటి వైబ్ ను ఈ ఇండస్ట్రీ సృష్టించుకుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళ క్రైమ్ థ్రిల్లర్ టాప్ రేటింగ్ తో దూసుకుపోయింది. ఇద్దరు నిరుద్యోగ బీటెక్ విద్యార్థుల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ చిత్రం సైబర్ నేరాలు, నిరుద్యోగం అనే రెండు ప్రధాన థీమ్‌ లతో ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


కథలోకి వెళ్తే

ఈ కథ ఆంటోనీ, వినయ్ అనే ఇద్దరు బి.టెక్ గ్రాడ్యుయేట్లతో ప్రారంభమవుతుంది. వీళ్ళు నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగం కోసం కష్టపడుతుంటారు. ఆంటోనీ ఒక డెలివరీ బాయ్‌గా పనిచేస్తుండగా, వినయ్ తన కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటాడు. ఒక రోజు వీళ్ళు కొచ్చి సైబర్ సెల్ పోలీస్ స్టేషన్‌లో ఒక సినిమా పైరసీ గురించి పోలీసులకు చెప్తారు. వీళ్ళ తెలివితేటలు, టెక్నాలజీ గుర్తించిన సైబర్ సెల్ అధికారులు, వీరిని తాత్కాలిక ఉద్యోగులుగా నియమిస్తారు. సైబర్ సెల్ టీమ్‌లో బిను పప్పు, ఇర్షాద్, ఇతర అధికారులతో కలిసి పని చేస్తారు. ఆంటోనీ, వినయ్ వివిధ సైబర్ నేరాలను ఛేదించడం ప్రారంభిస్తారు. ఈ కేసులలో సినిమా పైరసీ, ఆన్‌లైన్ జాబ్ మోసాలు, ఒక మర్డర్ కేసు కూడా ఉంటుంది. సినిమా ఎపిసోడిక్ ఫార్మాట్‌లో ఈ కేసులను చూపిస్తుంది. ప్రతి కేసు ఛాలెంజ్ చేసినట్లు గా ఉంటుంది.


ఆంటోనీ, వినయ్ తమ సాంకేతిక నైపుణ్యాలను ఉపయోగించి, సోషల్ మీడియా, డిజిటల్ ట్రాకింగ్, ఇతర సాంకేతిక పద్ధతుల ద్వారా కేసులను పరిష్కరిస్తారు. మొదటి కేసు సినిమా పైరసీ గురించి ఉంటుంది. ఇది ఒక పెద్ద ఆన్‌లైన్ నెట్‌వర్క్‌కు దారితీస్తుంది. ఈ కేసు దర్యాప్తు ద్వారా ఆంటోనీ, వినయ్ తమ టాలెంట్ ను నిరూపించుకుంటారు. కానీ వీళ్ళు తాత్కాలిక ఉద్యోగులుగా ఉండటం వల్ల వారి పనికి గుర్తింపు లభించదు. ఈ టీమ్ మరిన్ని క్రిటికల్ కేసులను ఎదుర్కొంటుంది. ఒక ఆన్‌లైన్ జాబ్ మోసం కేసు వారిని తమిళనాడుకు తీసుకెళ్తుంది. ఇక్కడ ఒక నేరస్థుడిని ఛేజ్‌ చేసి పట్టుకుంటారు. ఈ ఛేజ్ సన్నివేశాలు సినిమాకు ఒక డైనమిక్ టోన్‌ను అందిస్తాయి.

అదే సమయంలో, ఆంటోనీ వినయ్ వ్యక్తిగత జీవితాలు కథలో ఎమోషనల్ టర్న్ తీసుకుంటాయి. ఆంటోనీ తన ప్రేమలో సమస్యలను ఎదుర్కొంటాడు. ఆమె అతని నిరుద్యోగ స్థితి కారణంగా, అతన్ని విడిచిపెట్టే ఆలోచనలో ఉంటుంది. వినయ్ తన కుటుంబ బాధ్యతలతో పోరాడుతూ, దీనమైన పరిస్థితిలో ఉంటాడు. ఇక మూడవ ప్రధాన కేసు ఒక హత్యకు సంబంధించినది. ఈ కేసు సినిమాలో అత్యంత ఉత్కంఠభరితంగా నడుస్తుంది. ఇది టీమ్‌ను ఒక పెద్ద క్రిమినల్ నెట్‌వర్క్ వైపు నడిపిస్తుంది. ఈ కేసు దర్యాప్తు సమయంలో ఆంటోనీ, వినయ్ తమ టాలెంట్ తో ఫోన్ ట్రాకింగ్, డిజిటల్ ఫోరెన్సిక్స్ ద్వారా నేరస్థులను గుర్తిస్తారు. ఇక సినిమా క్లైమాక్స్‌లో ఆంటోనీ, వినయ్ ఒక పెద్ద సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌ను ఛేదిస్తారు. ఇది ఒక ఉత్కంఠమైన  ఛేజ్‌తో ముగుస్తుంది. ఈ ఛేజ్‌లో నేరస్థులను పట్టుకోవడానికి, ఈ టీమ్ తమ ప్రాణాలను పణంగా పెడతారు. ఇంత చేసినా వీళ్ళకి పర్మినెంట్ ఉద్యోగం దొరుకుతుందా ? వీళ్ళ జీవితాలు మారుతాయా ? పోలీసులు వాడుకుని వదిలేస్తారా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

ఎందులో ఉందంటే

‘ఆపరేషన్ జావా’ (Operation Java) మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. తరుణ్ మూర్తి దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో బాలు వర్గీస్, లుక్మాన్ అవరన్, బిను పప్పు, ఇర్షాద్, షైన్ టామ్ చాకో, వినాయకన్, మమిత బైజు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2021 ఫిబ్రవరి 12న విడుదలైంది. 2 గంటల 26 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 8.0/10 రేటింగ్ ను పొందింది. ZEE5 లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Read Also : పోలీస్ స్టేషన్ ముందే తల లేని శవం… ఐఎమ్‌డీబీలో 8.6 రేటింగ్… కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

Related News

OTT Movie : ఈ కాలేజ్ లో పిల్లలంతా ఆ ఆట ఆడాల్సిందే… గ్యాప్ లేకుండా పాడు సీన్లు… దిమాక్ కరాబ్ చేసే డార్క్ కామెడీ

OTT Movie : అమ్మాయిలు కన్పిస్తే చాలు అల్లాడిపోయే ఆటగాడు… కోడల్ని కూడా వదలకుండా… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : బ్రిడ్జి కింద మనుషుల ఎముకలు… 40 ఏళ్ల మిస్టరీ… మతిపోగొట్టే ట్విస్టులున్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

OTT Movie : బాక్స్ లో పడుకున్న దెయ్యాన్ని గెలికి మరీ తన్నించుకునే కపుల్… గుండె ధైర్యం ఉన్నవాళ్ళే చూడాల్సిన హార్రర్ మూవీ

OTT Movie : ఆకాశంలో తేలే ఈ ఓడలో ఒళ్ళు తెలియకుండా ఆ పనులు… మస్త్ మసాలా స్టఫ్… ఈ మూవీని చూస్తే నిద్ర పట్టడం కష్టమే

Big Stories

×