Intinti Ramayanam Akshay : బుల్లితెరపై ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్స్ లలో ఇంటింటి రామాయణం ఒకటి.. ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమవుతుంది. తనకు అన్యాయం చేశారని కచ్చితంగా ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసే ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేయాలని ఆ ఇంటి కోడలు ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే ఇంటికి పెద్ద కోడలుగా ఉన్న అవని తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తుంది.. తన కుటుంబం బాగుండాలని కోరుకునే అవనికే అన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి.. కానీ తన కుటుంబాన్ని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టదు. ఇలాంటి గొప్ప వ్యక్తికి భర్తగా అక్షయ్ నటించారు. అక్షయ్ రియల్ లైఫ్ గురించి అది కొద్ది కొద్ది మందికి మాత్రమే తెలుసు.. అక్షయ్ అసలు పేరేంటి? తన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.. వంటి విషయాలను తెలుసుకుందాం..
అక్షయ్ రియల్ లైఫ్..
ఇంటింటి రామాయణంలో నటిస్తున్న అక్షయ్ అసలు పేరు చక్రవర్తి రెడ్డి.. ఈయన తమిళనాడుకు చెందిన వ్యక్తి.. గతంలో తమిళంలో సినిమాలు సీరియల్స్ చేసి బిజీగా మారాడు.. తమిళ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. తెలుగులో ఇంటింటి రామాయణం సీరియల్ ద్వారా పరిచయమయ్యాడు. ఈ సీరియల్లో తల్లి మాటకు విలువిచ్చే కొడుకు పాత్రలో అక్షయ్ నటిస్తున్నాడు. మీ చక్రవర్తి సీరియల్స్ ఏ కాదు సినిమాలు కూడా చేసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. తనకు రియల్ఈ లైఫ్ లో పెళ్లి అయ్యింది. అంతే కాదు ఇటీవల ఆయన ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు.. ఇకపోతే ఈ మధ్య సీరియల్స్ తో పాటుగా కొన్ని యాడ్లను కూడా చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ఇంటింటి రామాయణం లో మాత్రమే నటిస్తున్నారు.
Also Read: మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి…
రెమ్యూనరేషన్ ఎంతంటే..?
ఈమధ్య సినిమాల కన్నా ఎక్కువగా ప్రసారమవుతున్న సీరియల్స్ ద్వారా ఎంతో మంది ఫేమస్ అవుతున్నారు. అందులో కొంతమంది అనుకున్న దానికన్నా ఎక్కువగానే రెమ్యూనరేషన్ని అందుకుంటున్నారు. ఇక ఇంటింటి రామాయణం సీరియల్ నటుడు అక్షయ్ అలియాస్ చక్రవర్తి ఒక రోజుకి 35 వేల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. సీరియల్ షూటింగు నెలలో 25 రోజులు ఉంటుందని తెలుస్తుంది.. ఈ లెక్కన ఈయన లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలకన్నా సీరియల్స్ ద్వారా ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకుంటున్నారు. అంతే కాదండోయ్ అటు కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ కూడా సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు స్టార్స్ కన్నా తమిళ స్టార్స్ కి మన తెలుగులో మంచి క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మన అక్షయ్ కూడా తమిళ్ ఇండస్ట్రీ నుంచి తెలుగుకు వచ్చి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ తో పాటుగా తమిళనాడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు..