Sanjay Dutt : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ దర్శకులలో లోకేష్ కనగరాజ్ ఒకరు. మా నగరం సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్ మొదటి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో చూపించుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత కార్తీ హీరోగా చేసిన ఖైదీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కేవలం ఒక రాత్రి ప్రయాణాన్ని ఎంతో ఆసక్తికరంగా చూపించి ఆడియన్స్ ను సప్రైజ్ చేశాడు.
ఆ సినిమా తర్వాత లోకేష్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటేనే అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. విజయ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో మాస్టర్ అనే సినిమాను తెరకెక్కించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది.
బాలీవుడ్ నటుడు సంచలనం వ్యాఖ్యలు
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గురించి ప్రత్యేకమైన పరిచయాల అవసరం లేదు. ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకులు కూడా పరిచయం. భాషతో సంబంధం లేకుండా సంజయ్ దత్ చేసిన సినిమాలు తెలుగు ప్రేక్షకులు కూడా చూశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా ఒరిజినల్ గా మున్నాభాయ్ ఎంబిబిఎస్ పేరుతో సంజయ్ దత్ నటించారు. ఇక సంజయ్ దత్ మీద వచ్చిన బయోపిక్ సంజు చూసిన తర్వాత చాలామందికి సంజయ్ దత్ గురించి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది.
సంజయ్ దత్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఇక ప్రస్తుతం బాలీవుడ్ కి పరిమితం కాకుండా సౌత్ సినిమాస్ లో కూడా సంజయ్ దత్ నటిస్తున్నారు. లోకేష్ దర్శకత్వంలో వచ్చిన లియో సినిమాలో సంజయ్ దత్ నటించిన విషయం తెలిసిందే. విజయ్ పనిచేయడానికి నేను చాలా ఇష్టపడ్డాను. కానీ నాకు లోకేష్ మీద కోపంగా ఉంది. నా పాత్ర చాలా తక్కువగా ఆ సినిమాలో ఉంటుంది. నన్ను సరిగ్గా వాడుకోలేదు, లోకేష్ నన్ను వేస్ట్ చేసుకున్నాడు అంటూ నవ్వుతూ మాట్లాడారు బాబా.
అంచనాలన్నీ కూలి సినిమా మీద
ఒక లోకేష్ కనకరాజ్ విషయానికి వస్తే కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత వచ్చిన లియో సినిమా మీద విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలు స్థాయిని అందుకోకపోయినా కూడా ఆ సినిమా బానే ఆడింది. ఇక ప్రస్తుతం కూలి అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు లోకేష్. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు సినిమా నిర్మాతలు దీని డిస్ట్రిబ్యూషన్ కోసం పోటీపడ్డారు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదలకు సిద్ధంగా ఉంది.
Also Read: Dulquer Salmaan : పోయి పోయి ఆ హీరోయిన్‌తో ఏంటి సామి… ఇక నీ కెరీర్ ఎండ్ అయినట్టేనా ?