BigTV English

Dulquer Salmaan : పోయి పోయి ఆ హీరోయిన్‌తో ఏంటి సామి… ఇక నీ కెరీర్ ఎండ్ అయినట్టేనా ?

Dulquer Salmaan : పోయి పోయి ఆ హీరోయిన్‌తో ఏంటి సామి… ఇక నీ కెరీర్ ఎండ్ అయినట్టేనా ?

Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ గురించి కొత్తగా పరిశీలన అవసరం లేదు. తెలుగులో నటుడుగా ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే అతని వర్క్ ని ఫాలో అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దుల్కర్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. దానిని దృష్టిలో పెట్టుకొని మహానటి సినిమా కోసం నాగ్ అశ్విన్ దుల్కర్ ని సెలెక్ట్ చేసుకున్నాడని కూడా చెప్పొచ్చు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఎంతటి హిట్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.


హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆ సినిమాలో రామ్ పాత్రలో కనిపించిన దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసాడు. వరుస రెండు సినిమాలు సక్సెస్ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే సినిమాను చేసి హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నాడు.

ఈ తరుణంలో ఆమెతో అవసరమా 


దుల్కర్ వరుసగా సక్సెస్ సినిమాలు చేస్తున్న సంగతి ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. తెలుగు దర్శకులు ఒకరిని మించి ఒకరు దుల్కర్ కు సక్సెస్ అందించారు. దుల్కర్ తర్వాత చేయబోయే సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త వచ్చిన వెంటనే ఐరన్ లెగ్ అంటూ పూజ మీద కామెంట్స్ వినిపిస్తున్నాయి. వరుసగా సక్సెస్ కొడుతున్న తరుణంలో పూజ హెగ్డే తో కలిసి నటిస్తే సక్సెస్ కి బ్రేక్ పడుతుందని చాలామంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే దీనిని దుల్కర్ ఎంతవరకు పట్టించుకుంటాడు అనేది వేచి చూడాలి. గతంలో కూడా చాలామంది హీరోయిన్ల విషయంలో ఇది ఎదురైంది. కొంతమంది ముందుగా ముందడుగు వేసి మంచి సక్సెస్ అందుకున్న వాళ్లు కూడా ఉన్నారు.

వరుస డిజాస్టర్ సినిమాలు 

పూజా హెగ్డే పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ, అలవైకుంఠపురంలో సినిమాలు పూజ కెరియర్ కు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారాయి. పూజ అక్కడితోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే ప్రస్తుతం పూజ చేసిన సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సక్సెస్ సాధించటం లేదు. రీసెంట్ గా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన రెట్రో సినిమా కూడా పూజ కోరుకున్న సక్సెస్ అందించలేకపోయింది. ప్రస్తుతం లోకేష్ దర్శకత్వంలో వస్తున్న కూలి సినిమాలో ఒక కీలకపాత్రలో కనిపిస్తుంది. కనీసం ఈ సినిమా అయినా కూడా పూజకు ప్లస్ అవుతుందేమో ఎదురు చూడాలి. పూజకి కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

Also Read : ఇండస్ట్రీలో మళ్లీ డూయల్ రోల్స్ హవా… ఎంత మంది హీరోలు చేస్తున్నారంటే ?

Related News

Soubin Shahir: కూలీ నటుడికి హై కోర్టు బిగ్ షాక్… విదేశాలకు వెళ్లడానికి నో పర్మిషన్..

Pookie: ఛీఛీ.. ఇదెక్కడి దిక్కుమాలిన టైటిల్ రా.. కొంచెం కూడా సిగ్గు లేదా.. విజయ్ ఆంటోనీ

SSMB 29 Update : ఫ్రాంఛైజీగా జక్కన్న మూవీ… ఎన్ని వందల కోట్లు పెడుతున్నారో తెలుసా ?

Actor Vasista : 50 రూపాయల కోసం ఆ పని.. కన్నీళ్లు తెప్పిస్తున్న యాక్టర్ వశిష్ఠ రియల్ లైఫ్..

Sonakshi Sinha: ఆ వెబ్ సైట్ లకు లీగల్ నోటీసులు.. తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఫైర్!

SSMB 29: రాజమౌళి మూవీపై కెన్యా మంత్రి బిగ్ అప్డేట్… ఈ ట్విస్ట్ మామూలుగా లేదుగా?

Big Stories

×