BigTV English

Sanjeev Movie: ‘సంజీవ్’ పోస్టర్ రిలీజ్.. ఈ మూవీ ప్రత్యేకత ఇదే

Sanjeev Movie: ‘సంజీవ్’ పోస్టర్ రిలీజ్.. ఈ మూవీ ప్రత్యేకత ఇదే

Sanjeev Movie: సినిమాలపై ఆసక్తితో ఎంతోమంది కొత్తవారు తమలో ఉన్న టాలెంట్ బయట పెడుతూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా సరికొత్త, విభిన్నమైన కథలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే త్వరలో “సంజీవ్”(Sanjeev) అనే మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత-దర్శకులు శ్రీ మధుర శ్రీధర్(Madura Sreedhar),తెలుగు చలన చిత్ర దర్శకుడు సంజీవ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పోస్టర్‌ను ఆవిష్కరించారు.


ఆకట్టుకున్న ఫస్ట్ లుక్ పోస్టర్..

ఈ చిత్రానికి అనిల్ నక్క(Anil Nakka) దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో టీజర్, ట్రైలర్ , పాటలను మధుర ఆడియో ద్వారా విడుదల చేయనున్నారని దర్శకుడు అనిల్ నక్క తెలిపారు. ఇక ఈ సినిమాకు దర్శకుడు మాత్రమే కాకుండా రచయిత స్క్రీన్ ప్లే డైరెక్టర్, హీరో కూడా అనిల్ నక్క కావటం విశేషం. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ జాన్ కె జోసెఫ్, నటులు వీర మనోహర్, అచ్యుత్, హరీష్ పాలకుర్తి, శివ శంకర్ చింతకింది తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా బావోద్వేగాలకు ప్రాధాన్యత చాలా రూపొందించబడిందని తెలుస్తుంది. ఈ సినిమా కథ ఎంతో అద్భుతంగా ఉండబోతుందని కచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ఆశా భావం వ్యక్తం చేశారు.


మారుమూల పల్లె నుంచి సినిమాలలోకి…

సినిమా రంగంలో కొనసాగుతూ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకోవాలని ఎంతో తపన పడుతూ ఉంటారు. ఇలాంటి ఒక కలతో ఎంతోమంది ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అందుకోగా మరికొందరు అనుకున్న స్థాయిని చేరుకోలేక ఇండస్ట్రీని వదిలి వెళ్తున్న వారు ఉన్నారు. అయితే ఈ సినిమా కథ కూడా ఇదే తరహాలోనే ఉండబోతుందని తెలుస్తుంది. ఒక మారుమూల పల్లె నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే లక్ష్యంగా పనిచేసే ఒక ఆర్టిస్ట్ కథనే ఈ సంజీవ్ సినిమా అని తెలుస్తుంది.

ఇండస్ట్రీలో గుర్తింపు…

మరి సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అనిల్ నక్క తన సినిమాతో ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారు, ఇండస్ట్రీలో సక్సెస్ కావాలనే తన ఈ కోరిక నెరవేరుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Also Read: పావలాకు 10 పైసలు నటన.. ఆ కమెడియన్‌ను అవమానించిన ఎక్స్ ప్రెస్ హరి!

Related News

Boney Kapoor: ‘శివగామి‘ పాత్ర వివాదం.. శ్రీదేవిని అవమానపరిచారు.. పెదవి విప్పిన బోనీ కపూర్

OG: ఓజీపై తమన్ బిగ్ అప్డేట్.. గూస్ బంప్స్ గ్యారెంటీ అంటూ!

Rudramadevi: గోన గన్నారెడ్డిపై ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్, మహేష్.. మరి బన్నీతో ఎలా?

Lokesh Kanagaraju : లోకేష్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… కూలీనే కూనీ చూసింది ?

Little hearts: రిలీజ్ అయిన ఒక్క రోజులోనే… రికార్డు క్రియేట్ చేసిన లిటిల్ హార్ట్స్!

Spirit: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే 70 శాతం పూర్తి అంటున్న డైరెక్టర్!

Big Stories

×