Express Hari: ఎక్స్ ప్రెస్ హరి(Express Hari) పరిచయం అవసరం లేని పేరు. పటాస్ కార్యక్రమంతో కమెడియన్ ఇండస్ట్రీకి పరిచయమైన హరి తన నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వారిని కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరియర్ మొదట్లో స్టాండప్ కమెడియన్ గా చేసిన హరి అనంతరం తన స్నేహితుల సహాయంతో పటాస్ (Patas)కార్యక్రమంలో అవకాశమందుకున్నారు. ఇలా పటాస్ కార్యక్రమంలో హరికి ఎంతో మంచి ఆదరణ లభించడంతో కెరియర్ పరంగా ఈయన వెనక్కి తిరిగి చూసుకోలేదు.ఇక ఈ కార్యక్రమంలోని తనకు మరొక కమెడియన్ యాదమ్మ రాజు (Yadamma Raju)తో చాలా మంచి పరిచయం ఏర్పడింది.
అశు రెడ్డి ఫోటో టాటూ…
పటాస్ కార్యక్రమం తర్వాత అదిరింది షోలోకి ఎంట్రీ ఇచ్చిన హరి అక్కడ కూడా తన కామెడీతో అందరిని మెప్పించారు. ప్రస్తుతం ఈయన స్టార్ మా లో ప్రసారమవుతున్న బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇకపోతే ఒకానొక సమయంలో హరి ఆశు రెడ్డి(Ashu Reddy)తో ప్రేమలో ఉన్నారు అంటూ అప్పట్లో వార్తలు బాగా వినిపించాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ చాలా క్లోజ్ గా అవ్వడం అశు రెడ్డి తనకోసం ఒక బైక్ కొనివ్వడం హరి కూడా తన గుండెలపై అశు రెడ్డి ఫోటో టాటూ వేయించుకోవడంతో వీరి మధ్య ప్రేమాయనం కొనసాగుతుందని అందరూ భావించారు. కానీ అలాంటిదేమీ లేదని స్పష్టమవుతుంది.
రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ..
ఇకపోతే చాలా రోజుల తర్వాత ఎక్స్ ప్రెస్ హరి ,అశు రెడ్డి ఆహాలో ప్రసారమవుతున్న కాకమ్మ కథలు సీజన్ 2 (kakamma kathalu 2)కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. తేజస్వి మదివాడ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం 9వ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు ఈ ప్రోమోలో భాగంగా హరి అలాగే అశు రెడ్డి ఇద్దరు ఎన్నో విషయాల గురించి సరదాగా మాట్లాడుతూ సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తేజస్వి వీరిద్దరిని ఎన్నో రకాల ప్రశ్నలు వేస్తూ సమాధానాలను రాబట్టారు. గతంలో అశు రెడ్డి రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే .అయితే రామ్ గోపాల్ వర్మను ఇమిటేట్ చేస్తూ హరి చూపించారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా తేజస్వి హరిని ప్రశ్నిస్తూ రూపాయికి రూపాయి పావలా నటన చేసే వాళ్ళు ఎవరు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు హరి సమాధానం చెబుతూ పావులకు పది పైసలు నటన చేసేవారి గురించి చెప్పాలా అంటూ ఎదురు ప్రశ్న వేస్తూ.. అలా పావలకు పది పైసలు నటించేది యాదమ్మ రాజు అంటూస్ దారుణంగా తనని అవమానిస్తూ మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అతనితో ఉన్న మంచి స్నేహబంధం కారణంగానే హరి యాదమ్మ రాజు గురించి మాట్లాడారని తెలుస్తుంది. మరి పూర్తి ఎపిసోడ్ లో వీరిద్దరూ ఇంకెన్ని విషయాల గురించి ప్రస్తావించారనేది తెలియనుంది.
Also Read: భర్త చనిపోయిన మెడలో తాళితో నటి.. ఈమె ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే!