OTT Movies : ఓటీటీల్లో ఈ మధ్య కొత్త సినిమాలు బోలెడు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా హారర్, బోల్డ్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ బోల్డ్ మూవీ శారీ ఓటీటీలోకి వచ్చేసింది.. టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణ సంస్థ ఆర్జీవీ డెన్ ప్రోడక్ట్ గా వచ్చింది. టీజర్స్, పోస్టర్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత పెద్దగా రెస్పాన్స్ రాలేదు. మొత్తానికి సుమారు మూడు నెలల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.. ఈ మూవీ ఓటీటీ డీటెయిల్స్, మరియు స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
స్టోరీ విషయానికొస్తే..
రామ్ గోపాల్ వర్మ సమర్పించిన సినిమా శారీ ఒకటి..అతడే స్క్రిప్ట్ కూడా అందించాడు. ఈ శారీ మూవీ వచ్చే వారం అంటే శుక్రవారం 27 న ఈ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతుంది. యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. రామ్ గోపాల్ వర్మ కథను అందించగా.. గిరి కృష్ణ కమల్ డైరెక్ట్ చేశాడు. ఓ అమ్మాయి కోసం ఉన్మాదిగా మారే యువకుడి చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ కాలం యువత సోషల్ మీడియా పేరుతో ఎలా పక్కదారి పడుతోందో, అమ్మాయిలు ఎలా బలవుతున్నారో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. కిట్టు అనే అబ్బాయి ఒకసారి టూర్ కి వెళ్తాడు. ఆరాధ్య దేవి అనే ఒక అమ్మాయిని అక్కడ చూస్తాడు. ఆ అమ్మాయి అందానికి ఫిదా అయిపోయిన ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించడం మొదలుపెడతాడు..
అమ్మాయి చీర కట్టుకొని ఎంతో అందంగా ముస్తాబై అతనికి కనిపిస్తుంది. అప్పటి నుంచే ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని అనుకుంటాడు. ఆమెకు ప్రపోజ్ కూడా చేస్తాడు. కానీ ఆమె నిరాకరిస్తుంది. దీంతో కిట్టు ఉన్మాదిలా మారిపోతాడు. ఆమెను దక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. ఆ అమ్మాయిని ఎలాగైనా తన సొంతమా అయ్యేందుకు చుట్టుపక్కల వాళ్ళని కూడా ఇబ్బందులకు గురి చేస్తాడు. ఇందులో అత్యంత ఎక్కువగా హింస ఉండడం, అలాగే బోల్డ్ సీన్లు ఎక్కువగా ఉండడంతో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేస్తుంది..
Also Read: బన్నీ నుంచి ‘ఐకాన్ ‘ ఔట్.. రేసులోకి మరో హీరో..!
లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలో..
శారీ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడు శుక్రవారం 27 న ఓటీటీలోకి రాబోతుంది. లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఓటీటీప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్నా కూడా ఈ సినిమాను చూడొచ్చు. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుండటం విశేషం.. ఏప్రిల్ 4న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ దాదాపు మూడు నెలల తర్వాత ఓటిటిలోకి రాబోతుంది. కనీసం ఇక్కడైన మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటుందేమో చూడాలి.. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ రెండు మూడు సినిమాలను తెరకెక్కించేందుకు రెడీగా ఉన్నాడని సమాచారం. ఆ సినిమాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.