E-Paper
Advertisement

బేబీబంప్ తో రష్మిక మందన్న…రణబాలి నుంచి స్పెషల్ వీడియో!

బేబీబంప్ తో రష్మిక మందన్న…రణబాలి నుంచి స్పెషల్ వీడియో!
Advertisement

Rashmika Mandanna: రష్మిక మందన్న ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె మైసా సినిమాతో పాటు రణబాలి(Ranabaali) సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న రష్మిక మందన్న(Rashmika Mandanna)కు సంబంధించి రణబాలి టీం ఒక ప్రత్యేకమైన వీడియోని విడుదల చేశారు. రష్మిక ఈ సినిమాలో జయమ్మ(Jayamma) అనే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈమె పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కావడంతో ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియచేస్తూ ఒక స్పెషల్ వీడియోని విడుదల చేశారు.

సింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్…

ఈ వీడియోలో భాగంగా రష్మిక మందన్న బేబీ బంప్ తో కనిపిస్తున్నారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇందులో రష్మిక విజయ్ భార్య భర్తలుగా కనిపించబోతున్న విషయంలో తెలిసిందే. సింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తుండగా జయమ్మ పాత్రలో రష్మిక కనిపించనున్నారు. ఇక పెళ్లి తర్వాత రష్మిక విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా టీజర్ వీడియోకి చాలా మంచి ఆదరణ లభించింది.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రణబాలి…

Advertisement

రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 19వ శతాబ్దంలో బ్రిటీష్ పాలన కాలంలో దక్షిణ భారతదేశంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ వీడియో చూస్తుంటే రాయలసీమ ప్రాంతంలో ప్రజలు పండించిన పంటను బ్రిటిష్ వారు దోపిడీ చేస్తూ ఆకలి కేకలతో మరణించిన ప్రజల కోసం తిరుగుబాటు చేసే రణబాలిగా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికైతే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి.

Advertisement

ఇక ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మరి థియేటర్లలో ఈ సినిమా రష్మిక విజయ్ దేవరకొండకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందనేది తెలియాల్సి ఉంది. రష్మిక ఇది వరకు రెండు సినిమాలలో కలిసి నటించారు అయితే పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు మైసా అనే సినిమాలోకి నటిస్తున్నారు. అదే విధంగా ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమాలో కూడా రష్మిక మందన్న నటించబోతున్నారని అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.

Also Read: ఢీ 10 విన్నర్ రాజు సూసైడ్ అటెంప్ట్…వెలుగులోకి కీలక విషయాలు!

Related News

67 ఏళ్లకే ప్రెగ్నెన్సీ అంటూ ట్రోలింగ్.. నీనా గుప్తా దిమ్మతిరిగే కౌంటర్!

నా భార్య నన్ను నమ్మింది… సైమా అవార్డుతో మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

సెప్టెంబర్ 18న వచ్చేస్తున్న’పిఠాపురంలో అలా మొదలైంది’!

తారక్ నెక్ట్స్ సినిమాలు ఇవేనా.. ఒక్కొక్కటి మామూలు కాంబో కాదుగా !

సూరితో పోటీగా సుహాస్ క్రేజ్.. తమిళనాట మండాడి హంగామా!

‘టాక్సిక్’లో కియారా బోల్డ్ సీన్స్.. భర్త సిద్ధార్థ్ డైవోర్స్ ?

లండన్ వీధులలో జంటగా విజయ్ త్రిష…వీడియో వైరల్!

Big Stories

Advertisement
×