E-Paper
Advertisement

సెప్టెంబర్ 18న వచ్చేస్తున్న’పిఠాపురంలో అలా మొదలైంది’!

సెప్టెంబర్ 18న వచ్చేస్తున్న’పిఠాపురంలో అలా మొదలైంది’!
Advertisement

Pithapuramlo Ala Modalaindi:చిన్న సినిమాలు ఈ మధ్య మంచి విజయాలు సాధిస్తుండటంతో మేకర్స్ మరిన్ని చిన్న సినిమాలని తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇపుడు అదే బాటలో వస్తున్న మరో సినిమా ‘పిఠాపురంలో… అలా మొదలైంది’.

డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా తదితరులు నటించిన ఈ చిత్రానికి ‘ప్రేయసి రావే’ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వం వహించారు. దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళీ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Advertisement

ఇక హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు సుమన్ టీజర్‌ను విడుదల చేశారు. చంద్ర మహేష్‌తో తనకు 25 ఏళ్లకు పైగా అనుబంధం ఉందని, కొత్త కంటెంట్‌తో ఆయన ఈ సినిమాను తెరకెక్కించారని సుమన్ తెలిపారు.

డా. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 

Advertisement

ఈ సందర్భంగా డా. రాజేంద్రప్రసాద్ తన 49 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. లేడీస్ టైలర్’, ‘ఆ నలుగురు’ వంటి చిత్రాల్లోని పాత్రలు తనకు గుర్తింపు తీసుకొచ్చాయని చెప్పారు. నటుడి కంటే పాత్రకే ప్రేక్షకుల నుంచి ఎక్కువ గుర్తింపు దక్కుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ కథలో తన పాత్రకు మంచి ఇంపార్టెన్స్ దక్కిందని రాజేంద్రప్రసాద్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఈ కథ కనెక్ట్ అవుతుందని, ముఖ్యంగా క్లైమాక్స్‌లో బలమైన ఎమోషన్ ఉంటుందని తన అభిప్రాయాన్ని తెలిపారు.ప్రస్తుత తరానికి నచ్చే అంశాలు కూడా సినిమాలో ఉన్నాయని తెలిపారు.

ఇక నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చంద్ర మహేష్‌ను మంచి దర్శకుడిగా ఆకాశానికి ఎత్తేశారు.ఈ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు రావాలని కోరుకున్నారు. ప్రసన్న కుమార్ కూడా చిత్ర నిర్మాతలకు మంచి ఫలితం దక్కాలంటూ తన విషెస్ తెలిపారు.

మహేష్ చంద్ర మాట్లాడుతూ

ఇక దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేశానని చెప్పారు. తన కెరీర్‌లో ఇది ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని, నటీనటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారని తెలిపారు.సినిమా కథలో తండ్రి, కూతురు మధ్య సంఘర్షణతో పాటు ప్రేమ, పెళ్లి అంశాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని దర్శక రచయిత బీవీఎస్ రవి తెలిపారు. ఇలాంటి కథని మహేష్ చంద్ర ఆసక్తికరంగా తెరకెక్కించారని అన్నారు.

 సెప్టెంబర్ 18న థియేటర్లలోకి  సినిమా

ఇక నిర్మాత ఆకుల సురేష్ తన ఊరిలో చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ కథని డిజైన్ చేశామని తెలిపారు. ఫ్.ఎం. మురళీ తన ఊరు, ఇంట్లోనే షూటింగ్ జరగడం ప్రత్యేక అనుభూతిగా ఉందన్నారు.మణిచందన, కేదార్ శంకర్, శ్రీలు, విరాట్, సన్నీ అఖిల్, సాయి ప్రణీత్, ప్రత్యూష, రెహానా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్టోరీ డెవలప్మెంట్, డైలాగ్స్ శ్రీరామ్ ఏదోటి, ఎడిటింగ్ బి. సత్యనారాయణ, సంగీతం జి.సి. క్రిష్ అందిస్తున్నారు.

ALSO READ:తారక్ నెక్ట్స్ సినిమాలు ఇవేనా.. ఒక్కొక్కటి మామూలు కాంబో కాదుగా !

మొత్తానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగడంతో ‘పిఠాపురంలో… అలా మొదలైంది’పై మంచి అంచనాలే ఏర్పాడ్డాయి.మరి సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా వాటిని అందుకుంటుందో లేదో చూడాలి.

Tags

Related News

67 ఏళ్లకే ప్రెగ్నెన్సీ అంటూ ట్రోలింగ్.. నీనా గుప్తా దిమ్మతిరిగే కౌంటర్!

నా భార్య నన్ను నమ్మింది… సైమా అవార్డుతో మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

బేబీబంప్ తో రష్మిక మందన్న…రణబాలి నుంచి స్పెషల్ వీడియో!

తారక్ నెక్ట్స్ సినిమాలు ఇవేనా.. ఒక్కొక్కటి మామూలు కాంబో కాదుగా !

సూరితో పోటీగా సుహాస్ క్రేజ్.. తమిళనాట మండాడి హంగామా!

‘టాక్సిక్’లో కియారా బోల్డ్ సీన్స్.. భర్త సిద్ధార్థ్ డైవోర్స్ ?

లండన్ వీధులలో జంటగా విజయ్ త్రిష…వీడియో వైరల్!

Big Stories

Advertisement
×