E-Paper
Advertisement

సూరితో పోటీగా సుహాస్ క్రేజ్.. తమిళనాట మండాడి హంగామా!

సూరితో పోటీగా సుహాస్ క్రేజ్.. తమిళనాట మండాడి హంగామా!
Advertisement

Mandadi Box Office:సుహాస్..షార్ట్ ఫిలిమ్స్ లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఎదిగిన ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇపుడు సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా మాస్ యాక్షన్, వందల కోట్ల బడ్జెట్ అనే స్టార్ ఇమేజ్ లెక్కలు వేసుకోకుండా కథలనే నమ్ముకుంటూ మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నాడు.

ఆ క్రమంలోనే ఇప్పుడు ‘మండాడి’అనే సినిమాతో తమిళ ఆడియన్స్ ని పలకరించాడు. కోలీవుడ్ హీరో సూరితో కలిసి చేసిన ఈ సినిమా ఈ మధ్యే రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి వసూల్లని రాబడుతుండటం తో ఇపుడు సుహాస్ పేరు కూడా తమిళ నాట కూడా గట్టిగానే వినిపిస్తుంది.

Advertisement

ఆర్ఎస్ ఇన్‌ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్‌రెడ్ కుమార్, వెట్రిమారన్ కలిసి నిర్మించిన ఈ సినిమాకు మాథిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు. మహిమా నంబియార్, సత్యరాజ్, మిథున్, జై శంకర్, రవీంద్ర విజయ్, బాల శరవణన్, స్టన్ శివ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కథలో సూరి మెయిన్ లీడ్ గా కనిపించినప్పటికీ సుహాస్ చేసిన పాత్ర కూడా సినిమాకు మెయిన్ ఎసెట్ గా నిలిచింది.

ఇండియాలో దాదాపు రూ.4 కోట్ల పై చిలుకు

Advertisement

సూరి లాంటి తమిళ హీరో ఉండటం తమిళ మార్కెట్‌కు కలిసి వస్తే సుహాస్ ఉండటం తెలుగు ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని పెంచింది. ఒక రకంగా ఈ ఇద్దరి కాంబినేషన్‌ను తెరపై చూడటానికి రెండు రాష్ట్రాల జనాలు బాగా ఆసక్తి చూపించారనే చెప్పాలి.

ఇక బాక్సాఫీస్ వసూళ్ళ విషయానికి వస్తే ‘మండాడి’మొదటి రోజు ఇండియాలో దాదాపు రూ.4 కోట్ల పై చిలుకు నెట్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజు రూ.6 కోట్లకి పైగా రాబట్టగా మూడో రోజు ఏకంగా రూ.9 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తుంది. దీంతో మూడు రోజుల్లోనే ఇండియా వైడ్ గా నెట్ కలెక్షన్స్ రూ.19 కోట్లకు చేరినట్టు తెలుస్తుంది.ఇక వరల్డ్ వైడ్ గా చూస్తే మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ.27 కోట్లకు పైగా గ్రాస్ సాధించడం విశేషం.

సుహాస్ కెరీర్‌ను గమనిస్తే

సినిమా తమిళ నాట సాలిడ్ గా వసూల్లని సాలిడ్ గానే రాబట్టినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో కూడా దాదాపు రూ.4 కోట్లపైగానే గ్రాస్ సాధించడం చూస్తే సుహాస్ ని ఆడియన్స్ ఎంతలా ఓన్ చేసుకున్నారో అర్థం అవుతుంది.సుహాస్ కెరీర్‌ను గమనిస్తే ‘కలర్ ఫోటో’తో హీరోగా మారిన ఈ యంగ్ హీరో ఆ తర్వాత ‘రైటర్ పద్మభూషణ్’, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ వంటి సినిమాలతో మంచి విజయాలనే చూశాడు.అయితే ఆ తర్వాత ట్రాక్ తప్పి గొర్రె పురాణం, ఓ భామ అయ్యో రామ అంటూ తలా తోకా లేని సినిమాలు చేసి డిజాస్టర్లని మూట గట్టుకున్నాడు.మొత్తానికి మండాడి తో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కేశాడు.

రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 

అయితే ఈ సినిమా దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కడంతో లాభాల్లోకి రావడానికి భారీ వసూళ్లనే కొల్లగొట్టాలి.అయితే ప్రస్తుతం వస్తున్న వసూళ్ల జోరు చూస్తుంటే సినిమా వాటిని ఈజీగానే రికవర్ చేసేలానే కనిపిస్తుంది. ఏది ఏమైనా తెలుగు నాట చిన్న చిన్న రోల్స్ తో సినిమా జర్నీ మొదలెట్టిన సుహాస్ ఇపుడు తమిళ నాట సాలిడ్ సక్సెస్ చూడటం మెచ్చుకోతగ్గ విషయమే !

ALSO READ:‘టాక్సిక్’లో కియారా బోల్డ్ సీన్స్.. భర్త సిద్ధార్థ్ డైవోర్స్ ?

Tags

Related News

నా భార్య నన్ను నమ్మింది… సైమా అవార్డుతో మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

సెప్టెంబర్ 18న వచ్చేస్తున్న’పిఠాపురంలో అలా మొదలైంది’!

బేబీబంప్ తో రష్మిక మందన్న…రణబాలి నుంచి స్పెషల్ వీడియో!

తారక్ నెక్ట్స్ సినిమాలు ఇవేనా.. ఒక్కొక్కటి మామూలు కాంబో కాదుగా !

‘టాక్సిక్’లో కియారా బోల్డ్ సీన్స్.. భర్త సిద్ధార్థ్ డైవోర్స్ ?

లండన్ వీధులలో జంటగా విజయ్ త్రిష…వీడియో వైరల్!

జిమ్‌లో మాళవిక శర్మ హంగామా ..ఫొటో చూస్తే ఫ్యాన్స్ ఫిదా!

Big Stories

Advertisement
×