Neena Gupta:ఇప్పుడు ట్రోలింగ్ అనేది ఒక జన్మ హక్కు అన్నట్టుగా తయారైంది.ముఖ్యంగా ఏదైనా ఫొటో కనిపిస్తే చాలు, దాని వెనుక అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకోకుండానే కామెంట్లు చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. తాజాగా ఇలాంటి ట్రోలింగ్ బారిన పడింది నీనా గుప్తా.
అసలు విషయంలోకి వస్తే ఈ మధ్య ఓ కార్యక్రమానికి చీరలో వెళ్లిన నీనా గుప్తా ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. చీరను సర్దుకునే సమయంలో ఆమె పొట్ట భాగం కాస్త ముందుకు కనిపించింది. అంతే.. కొంతమంది నెటిజన్లు వెంటనే ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఏకంగా 67 ఏళ్ల వయసులో నీనా గుప్తా గర్భవతి అంటూ కామెంట్లు చేయడం మొదలైంది.
ట్రోలింగ్‌కు సాలిడ్ గా సెటైర్
సాధారణంగా ఇలాంటి కామెంట్లను చూసి చాలామంది సెలబ్రిటీలు బాధపడతారు. కానీ నీనా గుప్తా మాత్రం ఈ విషయాన్ని చాలా లైట్‌గా తీసుకున్నారు. ఓమీడియా తో మాట్లాడిన ఆమె.. తన టీమ్ ఈ కామెంట్లను తన దృష్టికి తీసుకొచ్చినప్పుడు నవ్వుకున్నానని చెప్పారు. అంతేకాదు, తనపై వచ్చిన ట్రోలింగ్‌కు సాలిడ్ గా సెటైర్ కూడా ఇచ్చారు.
లావుగా కనిపిస్తే దానికి కారణం ప్రెగ్నెన్సీ
“నేను నిజంగానే గర్భవతిని అని వాళ్లకు చెప్పండి” అంటూ కౌంటర్ ఇచ్చింది. ఎవరైనా లావుగా కనిపిస్తే దానికి కారణం ప్రెగ్నెన్సీ అని చెప్పాలని ఆమె సరదాగా అన్నారు.అంతేకాదు, పెళ్లి ఎప్పుడు? పిల్లలు ఎప్పుడు? లాంటి వ్యక్తిగత ప్రశ్నలు అడిగేవారిని కూడా తాను తిరిగి ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు.
‘బధాయి హో’ వంటి సినిమాలతో
నీనా గుప్తా విషయానికి వస్తే దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్ లో హీరోయిన్ గానే కాకుండా ఇపుడు వయసు పెరిగిన తర్వాత కూడా సరికొత్త పాత్రల్లో నటిస్తుండటం విశేషం. ముఖ్యంగా ‘బధాయి హో’ వంటి సినిమాలతో ఈ తరం ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఆ తర్వాత ‘పంచాయత్’, ‘మసాబా మసాబా’ వంటి వెబ్ కంటెంట్‌తో డిజిటల్ లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.
అయితే నీనా గుప్తా వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో ఆమెకు ఉన్న సంబంధం అప్పట్లో క్రికెట్, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరికీ పుట్టిన కుమార్తె మసాబా గుప్తా ప్రస్తుతం ఫ్యాషన్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
స్ట్రాంగ్ కౌంటర్‌తో హైలెట్
ఇక వివియన్ రిచర్డ్స్‌తో వివాహం లేకుండానే మసాబాకు జన్మనివ్వడం అప్పట్లో ఒక సెన్సేషన్.ఇక తర్వాత 2008లో వివేక్ మెహ్రాను వివాహం చేసుకున్నారు. తన వ్యక్తిగత నిర్ణయాల విషయంలో ఎప్పుడూ సమాజం ఏం అనుకుంటుందో అని ఎక్కడా వెనక్కి తగ్గకపోవడం నీనా గుప్తా స్పెషాలిటీ !మొత్తానికి ఒక సాధారణ ఫొటో నుంచి మొదలైన ట్రోలింగ్.. చివరికి ఆమె ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్‌తో హైలెట్ అయి కూర్చుంది !