E-Paper
Advertisement

తారక్ నెక్ట్స్ సినిమాలు ఇవేనా.. ఒక్కొక్కటి మామూలు కాంబో కాదుగా !

తారక్ నెక్ట్స్ సినిమాలు ఇవేనా.. ఒక్కొక్కటి మామూలు కాంబో కాదుగా !
Advertisement

NTR Upcoming Movies:డ్రాగన్..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతుంది.ఈ సినిమా ఇంటర్ వెల్ సీన్స్ కోసం స్పెషల్ గా ఒక భారీ సెట్ ని వేసి సినిమా షూటింగ్ జోరుగా చేసుకుపోతున్నారు.ఇక ఈ సినిమాని జూన్ 11,2027న విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా.అయితే తారక్ ఈ డ్రాగన్ ఏ సినిమాల్ని చేయనున్నాడా అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు నందమూరి ఫ్యాన్స్.

త్రివిక్రమ్‌తో గాడ్ ఆఫ్ ది వార్

Advertisement

ప్రస్తుతం తారక్ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే మాత్రం లైనప్ మాములుగా లేదు. ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ సినిమా పూర్తి అయిన తర్వాత త్రివిక్రమ్‌తో గాడ్ ఆఫ్ ది వార్(సోషల్ మీడియాలో వినిపిస్తున్న టైటిల్) ఉందన్న సంగతి తెల్సిందే.కుమార్ స్వామి దేవుడి నేపథ్యంలో రానున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు కూడా.

కొరటాల శివతో దేవర2 

Advertisement

ఇక ఈ సినిమా తర్వాత తారక్ కొరటాల శివతో దేవర2 సినిమాని పట్టాలెక్కించే అవకాశం ఉందని వినిపిస్తుంది.ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత దేవర తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు కొరటాల.సినిమా ఏకంగా 500 కోట్లు కొల్లగొట్టింది కూడా.పైగా సినిమా చివర్లో దేవర కథ ఇంకా మిగిలే ఉంది అంటూ దేవర 2 సీక్వెల్ ని గ్రాండ్ గా ఎండింగ్ లో రివీల్ చేశాడు.

దీంతో ఈ సినిమా పై కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.అయితే అటు బాలయ్యతో చేయాల్సిన సినిమా తర్వాత ఈ సినిమాకి షిఫ్ట్ కానున్నాడట కొరటాల .ఏది ఏమైనా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళాలంటే రెండేళ్ళు పట్టడం పక్కా.మరి ఈలోపు వేరెవరైనా ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.

నెల్సన్‌తో ఎన్టీఆర్ సినిమా

ఇక ఈ రెండు సినిమాలతో పాటు ‘డాక్టర్’, ‘బీస్ట్’, ‘జైలర్’ సినిమాలతో తనదైన కామెడీ, యాక్షన్ స్టైల్‌ను పరిచయం చేసిన నెల్సన్‌తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. తారక్ కోసం నెల్సన్ ఓ కథ రెడీ చేశాడని.. ఇద్దరి మధ్య సినిమా గురించి చర్చలు జరిగాయని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది కూడా .ఇక ఇదే విషయంపై నాగ వంశీ మాట్లాడుతూ సినిమా ఉంటుందనే హింట్ ఇచ్చాడు.మరి ఇంత బిజీ షెడ్యూల్ లో అదెక్కడ ప్లేస్ అవుతుందో చూడాలి !

రాబోయే రోజుల్లో క్లారిటీ రావాల్సిందే

ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే మాత్రం సినిమా చాలా డిఫరెంట్‌గా ఉండే అవకాశాలు పుష్కలం. ఎందుకంటే నెల్సన్ సినిమాల్లో సీరియస్ యాక్షన్‌తో పాటు కామెడీ, డార్క్ హ్యూమర్ మిక్స్ అయి ఉంటుంది. ఇక ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో దొరికితే ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ALSO READ:సూరితో పోటీగా సుహాస్ క్రేజ్.. తమిళనాట మండాడి హంగామా!

మొత్తానికి ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ చూస్తే ప్రశాంత్ నీల్.. త్రివిక్రమ్.. కొరటాల శివ.. నెల్సన్ అంటూ క్రేజీ పేర్లు వినిపిస్తున్నాయి.ఇందులో ఏ సినిమా ముందు వస్తుంది? నెల్సన్‌తో సినిమా నిజంగానే ఫిక్స్ అవుతుందా? ‘దేవర 2’ ఎప్పుడు మొదలవుతుంది? అన్నది మాత్రం రాబోయే రోజుల్లో క్లారిటీ రావాల్సిందే.

Tags

Related News

బేబీబంప్ తో రష్మిక మందన్న…రణబాలి నుంచి స్పెషల్ వీడియో!

సూరితో పోటీగా సుహాస్ క్రేజ్.. తమిళనాట మండాడి హంగామా!

‘టాక్సిక్’లో కియారా బోల్డ్ సీన్స్.. భర్త సిద్ధార్థ్ డైవోర్స్ ?

లండన్ వీధులలో జంటగా విజయ్ త్రిష…వీడియో వైరల్!

జిమ్‌లో మాళవిక శర్మ హంగామా ..ఫొటో చూస్తే ఫ్యాన్స్ ఫిదా!

తాప్సీ ఎందుకింత కష్టం.. నీ వల్ల కాదులే – నెటిజన్స్ ట్రోల్స్!

ఈ సక్సెస్ ఒక్క రాత్రిలో వచ్చింది కాదు… నెగిటివిటీ పై కన్నీళ్లు పెట్టుకున్న వైష్ణవి!

Big Stories

Advertisement
×