Manchu Manoj: మంచు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మనోజ్(Manoj) గత కొంతకాలంగా ఇండస్ట్రీకి చిన్న గ్యాప్ ఇచ్చినప్పటికీ ఇటీవల వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటిస్తూ మనోజ్ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది సెప్టెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిరాయ్ (Mirai)సినిమా ఎలాంటి సక్సెస్ అందుకున్న ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా విడుదలైన ఏడాదికి సైమా(SIIMA) వేదికపై మంచు మనోజ్ ఉత్తమ విలన్ గా అవార్డు (Best Villain award) అందుకోవడం పట్ల ఎమోషనల్ పోస్ట్ చేశారు.
సైమా 2026 అవార్డు వేడుకలు బెంగళూరు వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ నటించిన ది బ్లాక్ స్వోర్డ్ పాత్రకు బెస్ట్ విలన్ గా అవార్డు అందుకున్నారు. ఇలా ఈ అవార్డు తీసుకున్న అనంతరం ఈయన తన భార్య భూమా మౌనిక(Bhuma Mounika)తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ వేశారు. ఇలా సుదీర్ఘమైన పోస్ట్ చేసిన మనోజ్ తన భార్య అలాగే తన తల్లిదండ్రుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
నేను నా భవిష్యత్తును సరిగా ఊహించుకోలేక ఇబ్బంది పడుతున్న సమయంలోనే నా భార్య మౌనిక నా జీవితంలోకి వచ్చింది. తను నన్ను నమ్మింది. మిరాయ్ సినిమా షూటింగ్ సమయంలోనే నా చిట్టి దేవసేన కడుపులో ఉంది. నేడు ఈ ఈవెంట్లో నా భార్య పిల్లలు కూర్చుని నేను ఈ అవార్డు తీసుకోవడం చూసిన ఈ క్షణాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. అమ్మానాన్నల నుంచి నాకు సినిమా పట్ల ప్రేమ విలువలు పెరిగాయి. ప్రతిదీ అమ్మ నాన్నల నుంచే మొదలైందని మనోజ్ తెలిపారు. మంచు లక్ష్మి గురించి కూడా మనోజ్ ప్రస్తావిస్తూ.. నా కెరియర్ రూపుదిద్దుకోక ముందే నన్ను నా అక్క మంచు లక్ష్మి ఒక తల్లిలాగా నమ్మింది. నాకోసం ప్రార్ధించిన ప్రతి ఒక్క అభిమానికి కూడా ఈ అవార్డును అంకితం చేస్తున్నాను అంటూ మనోజ్ తెలిపారు.
ఈ విధంగా మంచు మనోజ్ ఈ అవార్డును అందుకోవడం పట్ల తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉందని చెబుతూ కాస్త ఎమోషనల్ అవుతూ ఈ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మనోజ్ అభిమానులు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో మనోజ్ విలన్ గా కనిపించారు. ఇక ప్రస్తుతం మనోజ్ వడ్డీ కాసులవాడు, బాలకృష్ణ దాదా, డేవిడ్ రెడ్డి వంటి తదితర సినిమాలలో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
Also Read: బేబీబంప్ తో రష్మిక మందన్న…రణబాలి నుంచి స్పెషల్ వీడియో!