E-Paper
Advertisement

జీ5 నుంచి ‘సత్లుజ్’ అవుట్..ది కాశ్మీర్ ఫైల్స్’లా ఎందుకు చూడరంటూ పంజాబ్ ఫైర్ !

జీ5 నుంచి ‘సత్లుజ్’ అవుట్..ది కాశ్మీర్ ఫైల్స్’లా ఎందుకు చూడరంటూ పంజాబ్ ఫైర్ !
Advertisement

Satluj Controversy: ‘సత్లుజ్’..జీ5 ottలో  రెండు రోజుల క్రితమే ఆడియన్స్ ముందుకొచ్చి బ్యాన్ భారిన పడిన ఈ సినిమా ఇపుడు మరో మలుపు తీసుకుంది. పంజాబ్ లో  ఒకప్పుడు సాగిన ఉగ్రవాదంపై జరిగిన  పోరు, అప్పటి కాలంలో  అక్కడి స్థానిక అమాయక యువత ఎదుర్కొన్న ఇబ్బందులు, సామాజిక పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాలో పంజాబీ సింగర్ నటుడు దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చిన కొన్ని గంటల్లోనే మంచి అప్లాజ్ ని మూట గట్టుకుంది.అయితే ఈ కంటెంట్ ఐటీ రూల్స్ 2021 క్రాస్ చేసేలా ఉందంటూ  కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.అలా ఐటీ యాక్ట్ ని ఉపయోగించి ఈ సినిమాని zee5 తక్షణమే తొలగించాలంటూ ఆదేశించింది.

Advertisement

ఇండియాలో సినిమాని నిలిపేస్తూ సంచల నిర్ణయం

దాంతో  zee5మూవీస్ ఇండియాలో సినిమాని నిలిపేస్తూ సంచల నిర్ణయం తీసుకుంది.అయితే కేంద్రం తీసుకున్న డిసిషన్ పై ఇప్పుడు నేషనల్ వైడ్ గా  ముఖ్యంగా పంజాబ్ పాలిటిక్స్ లో మంటలు రేపుతున్నాయి.మనుషుల  ప్రాథమిక మానవ హక్కులను కాల రాసేలా కేంద్రం చర్య ఉందంటూ  విమర్శలు వినిపిస్తున్నాయి .

Advertisement

also read:16 ఏళ్ళ వయసులో ఎన్‌సీసీ క్యాంప్‌లో ప్రేమ.. అనసూయ రియల్ లైఫ్ బయోపిక్!

సిక్కుల అత్యున్నత ధార్మిక సంస్థ అకాల్ తఖ్త్  ఈ వ్యవహారంపై ఓ రేంజ్ లో రియాక్ట్ అయింది .అకాల్ తఖ్త్ జతేదార్ గియాని కుల్దీప్ సింగ్ గర్గాజ్ ఈ సినిమాపై నిషేదాన్ని తీవ్రంగా ఖండిస్తూ గతంలో పంజాబ్ యువత అనుభవించిన బాధలను, చారిత్రక సత్యాలను దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని  చెప్పుకొచ్చాడు.ఇక ఈ సినిమాని కేవలం పంజాబ్ లోనే కాకుండా భారతదేశం అంతట థియేటర్లలో ప్రదర్శించేలా కేంద్రం పర్మిషన్స్ ఇవ్వాలంటే గట్టిగా డిమాండ్ చేశాడు.

వివక్షకు ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్

అయితే ఈ కాంట్రవర్సీ కేవలం ధార్మిక సంస్థలకే పరిమితం కాకుండా ,పొలిటికల్ రంగులని పులుముకోవడం ఇక్కడ విశేషం .ఇక పంజాబ్‌లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ  కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.కేంద్ర ప్రభుత్వం పంజాబ్ రాష్ట్రంపై, అక్కడ సంస్కృతిపై చూపుతున్న వివక్షకు ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని  విమర్శించింది.

గతంలో కాశ్మీరీ పండిట్ ల ఆధారంగా తీసిన  కాశ్మీరీ ఫైల్స్ సినిమాని సపోర్ట్ చేసే సెంట్రల్ ప్రభుత్వం ఇప్పుడు పంజాబ్ప్రజల భావోద్వేగాలతో కూడిన ‘సత్లుజ్’ సినిమా  విషయంలో మాత్రం ఎందుకు ఇలా యూటర్న్ తీసుకుంది మండిపడింది.గతంలో దిల్జిత్ దోసాంజ్ నటించిన జోగి వంటి సినిమాలు కూడా ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్  చుట్టూ తిరిగినప్పటికీ, ప్రస్తుత పరిస్థితిలో సత్లుజ్ సినిమాపై బ్యాన్ విధించడం వెనుక  పొలిటికల్ బెనిఫిట్స్ ఉన్నాయని డౌట్స్ రైజ్ అవుతున్నాయి.

ఈ స్ట్రీమింగ్ డ్రామాకి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో

పంజాబ్ బీజేపీ వర్గాలు కూడా ఈ వ్యవహారంలో స్థానిక ప్రజల సెంటిమెంట్ల వైపే నిలబడటం విశేషం.పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు కేవల్ సింగ్ ధిల్లాన్ ఈ సెన్సిటివ్ ఇష్యూ పై ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో స్వయంగా మాట్లాడినట్లు  తెలిపాడు.ప్రజల ఎమోషన్స్ కి మనం వాల్యూ ఇవ్వాలని , ఇక ఈ సినిమా వేసిన బ్యాన్ ని , అందులో ఉన్న కంటెంట్ ని మళ్ళీ రీచెక్ చేయాలని ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపాడు.శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) సైతం ఈ చిత్రానికి మద్దతుగా నిలుస్తూ సినిమాను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తేవాలని పట్టుబడుతోంది. చూడాలి మరి ‘సత్లుజ్’ సినిమా చుట్టూ నడుస్తున్న ఈ స్ట్రీమింగ్ డ్రామాకి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో !

Related News

20 ఏళ్ల తర్వాత కెమెరా ముందుకు తమన్.. ‘బాయ్స్’ డ్రమ్మర్ రీఎంట్రీ ఫిక్స్!

30 ఏళ్ల పాటు ప్రపంచానికి కనిపించకుండా బతికిన మహానటి మిస్టరీ !

ఒడిషా సూపర్ స్టార్ టాలీవుడ్ ఎంట్రీ.. మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘అంతర్యామి’!

16 ఏళ్ళ వయసులో ఎన్‌సీసీ క్యాంప్‌లో ప్రేమ.. అనసూయ రియల్ లైఫ్ బయోపిక్!

నన్ను క్షమించండి’ అంటూ జయం రవి ఎమోషనల్…మైనస్‌ అయిన కెరీర్ ప్లస్ అయ్యేనా?

‘జన నాయగన్’ సెన్సార్ అప్‌డేట్‌.. ఆ రూమర్స్ నమ్మొద్దన్న నిర్మాతలు!

800 సినిమాలు.. కోట్ల ఆస్తి.. కానీ చివరికి ఆ నటి జీవితం ఎందుకలా ?

Big Stories

Advertisement
×