E-Paper
Advertisement

టీమిండియా కోచ్ గా ల‌క్ష్మ‌ణ్‌..తెలివిగా త‌ప్పించుకుంటున్నాడ‌ని గంభీర్ పై ట్రోల్స్‌

టీమిండియా కోచ్ గా ల‌క్ష్మ‌ణ్‌..తెలివిగా త‌ప్పించుకుంటున్నాడ‌ని గంభీర్ పై ట్రోల్స్‌
Advertisement

VVS Laxman to coach India on Zim, Asian Games:  బిసిసిఐ (BCCI) మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత హెడ్ కోచ్ గా ఉన్న గౌతమ్ గంభీర్ కు ( Gautam Gambhir ) కొన్ని రోజుల పాటు రెస్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. గంభీర్ తో పాటు అజిత్ అగార్కర్ కూడా రెస్ట్ తీసుకోనున్నారట. ఈ క్రమంలో జింబాబ్వే, ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్ గా, హైదరాబాద్ స్టైలిష్ ప్లేయర్ వివిఎస్ లక్ష్మణ్ ( VVS Laxman) కొనసాగనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా గంభీర్ కు రెస్ట్ ఇచ్చి.. ప్రాధాన్యత లేని సిరీస్ ల కోసం వివిఎస్ లక్ష్మణ్ సేవలను వాడుకుంది బీసీసీఐ. ఇక ఇప్పుడు జింబాబ్వే, ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ సందర్భంగా కూడా అదే తరహాలో ముందుకు వెళ్లనుంది.

Also Read: Joshua Tromp names Haris Rauf as the toughest bowler: హారిస్ రవూఫ్ ఒక్క‌డే ప్ర‌పంచంలోనే భ‌యంక‌ర‌మైన బౌల‌ర్

సైడ్ అయిపోయి… వివిఎస్ లక్ష్మణ్ ను ఇరికిస్తున్నట్లు గంభీర్ పై ట్రోలింగ్స్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ముగిసిన తర్వాత టీమిండియా పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ మినహా అన్ని మ్యాచ్ లలో చెత్తగా ఆడుతోంది. ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ కూడా అయింది. ఇంగ్లాండ్ పైన గెలిచే అవకాశాలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. దీంతో గౌతమ్ గంభీర్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే గంభీర్ ను పదవి నుంచి తొలగించాల్సిన పరిస్థితి కూడా నెలకొంటుంది. అయితే ఈ క్రమంలో రెస్ట్ పేరుతో గౌతమ్ గంభీర్ తప్పించుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తనకు కొన్ని రోజులపాటు రెస్ట్ ఇస్తే… బాగుంటుందని బిసిసిఐకి కావాలనే లేఖ రాశారట గంభీర్.

ఈ లేక నేపథ్యంలో గంభీర్ కు సెలవులు ఇచ్చి… జింబాబ్వే అలాగే ఏషియన్ గేమ్స్ కోసం వీవీఎస్ లక్ష్మణ్ సేవలను వాడుకునేందుకు బీసీసీఐ కూడా రంగం సిద్ధం చేసిందట. ఈ క్రమంలోనే గౌతమ్ గంభీర్ కుట్ర కోణం బయటపడుతోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. జింబాబ్వే అలాగే ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంటులో టీమిండియా ప్రదర్శన సరిగ్గా ఉండకపోతే… వివిఎస్ లక్ష్మణ్ పై వేటుపడేలా గంభీర్ స్కెచ్ వేసినట్లు చెబుతున్నారు. ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన చెత్త రికార్డు కూడా వీవిఎస్ లక్ష్మణ్ ఖాతాలోకి వెళుతుందని… అప్పుడు తాను రోలింగ్ నుంచి బయటపడవచ్చు అని గంభీర్ ఇరికిస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వరకు సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి.

Advertisement

Also Read: Shahid Afridi Reaction On England vs India, 2nd T20I : ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓట‌మి.. టీమిండియా ప‌త‌నం మొద‌లైందంటూ అఫ్రిది సంచ‌ల‌నం !

Related News

ఓరి మీ దుంపలు తెగ..టీమిండియాలో పంజాబ్, గుజ‌రాత్ ప్లేయ‌ర్లే ఉన్నారు క‌ద‌రా ?

ఇంగ్లండ్ లేడీ క్రికెట‌ర్ హ‌గ్ ఇవ్వ‌లేద‌ని అలిగిన జై షా ?

మ‌హిళ‌ల క్రికెట‌ర్ల‌పై డ‌బ్బులు పెట్ట‌డం దండ‌గ‌..ఆ జ‌ట్టును ర‌ద్దు చేయండి ?

Babar Azam: కోహ్లీ పెద్ద సెల్ఫీష్ ప్లేయ‌ర్‌, సొంత‌ రికార్డుల కోసమే సెంచ‌రీలు చేస్తాడు

ధోని రియ‌ల్ హీరో…నువ్వు హెయిర్ కట్ చేయించుకోవ‌ద్దు!

విదేశీ గ‌డ్డ‌ల‌పై ఇండియ‌న్స్ జీరోలు, 200 కూడా కొట్ట‌లేక‌పోతున్నారు

5 ఓవ‌ర్లలోపే వైభ‌వ్ ను ఔట్ చేయండి..లేక‌పోతే ఇంగ్లాండ్ కు న‌ర‌కం చూపిస్తాడు

Big Stories

Advertisement
×