Jayam Ravi: జయం రవి ..ఈ మధ్య సినిమాల కన్నా తన పర్సనల్ లైఫ్ లోని వివాదాలతోనే తెగ హైలెట్ అవుతున్నాడు.మొన్నటి దాకా తన భార్య ఆర్తితో విడాకుల నేపధ్యంలో సైలెంట్ గా ఉన్న ఈ తమిళ తంబి ఇపుడు ఒక్కసారి గా రూటు మార్చాడు. సడెన్ గా మైకు పట్టుకుని ఎమోషనల్ గా పొలిటికల్ స్పీచ్ ఇవ్వడం మొదలెట్టాడు.దీంతో ముక్కున వేలేసుకుంటున్నారు అంతా.
విషయంలోకి వెళ్తే గత కొంతకాలంగా వార్తల్లో నిలిచిన విడాకుల వివాదం పై చాలా రోజులకి నోరు విప్పాడు జయం రవి.ముఖ్యంగా ఫ్యాన్స్ ముందు మోకాళ్లపై కూర్చుని మరీ క్షమాపణలు అడగడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఇక సగం జీవితం కెమెరా ముందే గడిపేశానని చెప్పుకొచ్చిన ఈ స్టార్ హీరో.. భార్య ఆర్తితో విడిపోతూ తను తీసుకున్న నిర్ణయం అభిమానుల గుండెల్ని పిండేసిందని తెగ ఫీలయిపోయాడు.అయితే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఈ కోలీవుడ్ హీరో ఇపుడు ఇలా సెంటిమెంట్ కార్డ్ ప్లే చేయడం వెనక ఎదో సాలిడ్ స్కెచ్చే వేసుంటాడు అంటున్నారు నెటిజన్లు.
నా వల్ల మీ మనసు నొచ్చుకుంటే మన్నించండి
వాస్తవానికి గత కొంతకాలంగా జయం రవి చుట్టూ ఎన్నో రూమర్స్,అంతకు మించిన ట్రోల్స్ నడిచిన సంగతి తెల్సిందే. ఇక తన భార్య ఆర్తికి తెలీకుండానే డైవోర్స్ నోటీస్ ఇచ్చాడని కోలీవుడ్ కోడై కూసింది.దాంతో వాటన్నింటికి ఎండ్ కార్డ్ వేసేందుకే ఇప్పుడిలా పబ్లిక్ గా సారీ చెప్పుకొచ్చాడు ఈ తమిళ హీరో.అయితే “నా వల్ల మీ మనసు నొచ్చుకుంటే పెద్ద మనసుతో మన్నించండి, ఇకపై మిమ్మల్ని బాధించను, నమ్మకద్రోహం చేయను” అంటూ చెప్పడం చూస్తుంటే ఇదంతా తను చేస్తున్న సినిమాల పట్ల ఆడియన్స్ పాజిటివ్ గా ఉండాలని, కెరీర్ పరంగా ఎలాంటి అడ్డంకులు రావొద్దనే ఇలా ప్రీ ప్లాన్డ్ గా గ్రౌండ్ వర్క్ మొదలెట్టేశాడని సెటైర్ వేస్తున్నారు యాంటి ఫ్యాన్స్. అయితే ఇక్కడ పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా సినిమాలో కంటెంట్ ఉంటె చాలు ఆటోమేటిక్ గా సూపర్ హిట్ అవుతుందన్న మిమిమం లాజిక్ ఈయన గారు ఎలా మిస్ అయ్యారో అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
సరికొత్తగా ‘సెకండ్ ఇన్నింగ్స్’ స్టార్ట్
ఇక జరిగిందంతా గతం అని, దాన్ని భూస్థాపితం చేసి సరికొత్తగా ‘సెకండ్ ఇన్నింగ్స్’ స్టార్ట్ చేస్తున్నట్లు రవి ప్రకటించారు. మీ అందరి గుండెల్లో నిలిచిపోయిన ‘సంతోష్ సుబ్రమణ్యం’ (2008) లోని క్లాస్ సంతోష్ లా, ‘ఎమ్.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి’ (2004) లోని మాస్ కుమరన్ లా, ‘పేరన్మై’ (2009) లోని అడవి బిడ్డ ధ్రువన్ లా, అలాగే మన గూస్ బంప్స్ విలన్ అరవింద్ స్వామిని ఢీకొట్టిన ‘తని ఒరువన్’ (2015) మిథ్రన్ లా మళ్లీ పవర్‌ఫుల్‌గా వస్తానంటూ చెప్పడంతో భార్యతో బంధం తెగిపోయినా.. తన పాత హిట్ క్యారెక్టర్లతో ఉన్న బంధాన్ని మాత్రం ఈయన గారు అస్సలు వదులుకోవట్లేదన్న మీమ్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
‘కరాటే బాబు’ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో
ఇక సినిమాల విషయానికి వస్తే 2003లో ‘జయం’ తో కెరీర్ స్టార్ట్ చేసి, 2015లో ‘తని ఒరువన్’తో బాక్సాఫీస్ షేక్ చేసిన రవికి ఈ మధ్య కాలంలో మణిరత్నం విజువల్ వండర్ ‘పొన్నియిన్ సెల్వన్’ (2022, 2023) సిరీస్ మినహా సోలోగా సరైన సక్సెస్ లేదన్నది వాస్తవం .దాంతో ఇక ఎలాగైనా తన కెరీర్ ని గాడిలో పెట్టాలంటే ఈ మాత్రం చేయక తప్పదంటూ ఇలా ముందుకు వచ్చాడంటూ కొంతమంది ట్రోల్ చేస్తే పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా స్క్రీన్ మీద మాత్రం పాత జయం రవిని చూపించు చాలు” అంటూ ట్వీట్లతో సపోర్ట్ చేస్తున్నారు మరికొందరు.చూడాలి మరి డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్న రవికి కొత్త సినిమా ‘కరాటే బాబు’ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో !