BigTV English

SSMB 29: మహేష్ బాబు మూవీ సెట్ నుండి సీన్ లీక్ .. గూస్ బంప్స్ గ్యారెంటీ!

SSMB 29: మహేష్ బాబు మూవీ సెట్ నుండి సీన్ లీక్ .. గూస్ బంప్స్ గ్యారెంటీ!

SSMB 29: సాధారణంగా దర్శక నిర్మాతలు ఒక సినిమా ప్రారంభించిన తర్వాత లీక్ జరగకుండా ఎంతో పగడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ ఎంత కష్టపడ్డా సరే ఏదో ఒక సందర్భంలో ఆ షూటింగ్ సెట్ నుండి ఫోటో లేదా యాక్షన్ సీన్ ఇలా ఏదో ఒకటి లీకై అటు నిర్మాతలకు తలనొప్పిగా మారుతూ ఉంటాయి. కానీ ఇలాంటి లీకైన సీన్స్ లేదా ఫోటోలు అభిమానులకు మాత్రం పండగ అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్న ఎస్ఎస్ఎంబి 29 మూవీ నుంచి ఇప్పుడు ఒక సీన్ లీక్ అవడంతో సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారుతోంది . ఈ లీక్ అయిన వీడియో అభిమానులలో గూస్ బంప్స్ తెప్పిస్తోంది అని చెప్పవచ్చు.


ఎస్ ఎస్ ఎం బి 29 మూవీ నుండి ఫోటో లీక్..

అసలు విషయంలోకి వెళ్తే.. మహేష్ బాబు(Maheshbabu ) హీరోగా, రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో కేఎల్ నారాయణ(KL Narayana) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబీ 29. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఆఫ్రికన్ అడవులలో ప్రత్యేకంగా రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఈస్ట్ ఆఫ్రికా కెన్యాలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుండి ఒక సీన్ లీక్ అయింది. అంతేకాదు ఒక ఫోటో కూడా లీక్ అయ్యింది. కెన్యాలోని నైరోబిలో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇటీవల రాజమౌళి ఈస్ట్ ఆఫ్రికాలోని కెన్యాలో కీలక సన్నివేశాలకు సంబంధించిన షెడ్యూల్ ని పూర్తి చేశారు. ఇందులో భాగంగానే ఈ ఫోటో , సీన్ లీక్ అయినట్లు తెలుస్తోంది.

ఆకట్టుకుంటున్న ఫోటో.. సీన్ డిలీట్..


ఇకపోతే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫోటో విషయానికి వస్తే.. ప్రకాశిస్తున్న సూర్యుడు వెలుగులో సింహం పక్కనే మహేష్ బాబు నడుస్తున్నట్టు ఆ ఫోటో లీక్ అయింది. ఇది చూసిన అభిమానులు పూర్తి ఎక్సైజ్ మెంట్ గా సినిమా కి9స. ఎదురు చూస్తున్నారు. ” సింహం పక్కన.. మరో సింహం నడుస్తోంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఇక లీకైన వీడియో విషయానికి వస్తే.. ప్రస్తుతం దానిని డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.. ఇకపోతే భద్రత కారణాలవల్లే దానిని డిలీట్ చేసినట్లు సమాచారం. మొత్తానికి అయితే సీన్ డిలీట్ అయినా ఫోటో మాత్రం అంచనాలు పెంచేసిందని చెప్పవచ్చు.

కెన్యా మంత్రిని కలిసిన రాజమౌళి టీం..

ఈ సినిమా షెడ్యూల్ కెన్యాలో జరుగుతున్న నేపథ్యంలో షెడ్యూల్ పూర్తయిన వెంటనే డైరెక్టర్ రాజమౌళి కెన్యా విదేశాంగ మంత్రి ముసాలియా ముదావాడి(Musalia W Mudavadi) ని మర్యాదపూర్వకంగా కలిశారు. షూటింగ్ కి కావలసిన అనుమతులు ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కాసేపు ముచ్చటించిన రాజమౌళి సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను విదేశాంగ మంత్రితో చర్చించినట్లు ఈ విషయాన్ని మంత్రి తన ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేశారు. కెన్యాలో సుందరమైన ప్రదేశాలను ఈ చిత్రం ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు.. ఈ మేరకు రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు.

 

ALSO READ:Bigg Boss AgniPariksha: సందడి చేసిన సత్యదేవ్.. ఇది మైండ్ గేమ్ కాదు.. అంతకుమించి!

 

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×