BigTV English

Bigg Boss AgniPariksha: సందడి చేసిన సత్యదేవ్.. ఇది మైండ్ గేమ్ కాదు.. అంతకుమించి!

Bigg Boss AgniPariksha: సందడి చేసిన సత్యదేవ్.. ఇది మైండ్ గేమ్ కాదు.. అంతకుమించి!

Bigg Boss AgniPariksha:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు స్టార్ మా వేదికగా ఈ కొత్త సీజన్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగే నాగార్జున (Nagarjuna ) హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే యూట్యూబ్, సోషల్ మీడియా, సినిమా, టీవీ ఇలా పలు రంగాలలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సెలబ్రిటీలను ఇప్పుడు రంగంలోకి దింపబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ షోలో ఎన్నడూ జరగని విధంగా ఏకంగా 5 మంది సామాన్యులను కామన్ క్యాటగిరిలో హౌస్ లోకి పంపించబోతున్న విషయం తెలిసిందే.


అగ్నిపరీక్షా స్టేజ్ పై సందడి చేసిన హీరో సత్యదేవ్..

ఈ సీజన్ అనౌన్స్మెంట్ జరిగినప్పుడే సామాన్యుల నుంచి 20 వేలకు పైగా అప్లికేషన్లు రాగా.. అందులో ఫిల్టర్ చేసి 45 మందిని ఎంపిక చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష పేరిట వీరందరికీ టాస్కులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో 13 మంది ఇప్పుడు ఫైనలైజ్ అయ్యారు. ఇక ఈరోజుతో ఈ మినీ షో కాస్త పూర్తికానుంది. ఈ నేపథ్యంలోనే కంటెస్టెంట్స్ లో మరింత జోష్ నింపడానికి హీరో సత్యదేవ్ (Sathyadev) స్టేజ్ పైకి అడుగు పెట్టాడు. అందులో భాగంగానే 15వ ఎపిసోడ్ కి సంబంధించి మూడవ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో సత్యదేవ్ మిగిలిన 13 మంది కంటెస్టెంట్స్ ను మోటివేట్ చేస్తూ అసలు ఈ స్టేజ్ పైకి రావడమే ఒక అదృష్టం.. అలాంటిది మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని, టాస్కులను నెగ్గి ఈ స్టేజికి రావడం అంటే నిజంగా హాట్సాఫ్.. ఇక మీరంతా గెలిచినట్టే అంటూ వారిలో మరింత జోష్ నింపారు.

ఆకట్టుకున్న ప్రోమో..


ఇకపోతే ప్రోమో విషయానికి వస్తే.. ఆల్ఫాబెట్స్ తో వర్డ్ ఐడెంటిఫై బోర్డును అక్కడ ఉంచారు. అందులో లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ కాకుండా మధ్యలో వచ్చే పదాన్ని ఐడెంటిఫై చేసి ఆల్ఫాబెట్స్ బోర్డులో అది ఎక్కడ ఉందో రౌండప్ చేయాలని ఇద్దరికి టాస్క్ నిర్వహించింది శ్రీముఖి. ఆ ఇద్దరు కూడా ఆ పదాన్ని ఐడెంటిఫై చేసి రౌండ్ ఆఫ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇద్దరు కంటెస్టెంట్స్ ముందు రెండు బల్బులు ఉంచి.. గట్టిగా అరిచి ఎదురుగా ఉన్న బల్బులను పగలగొట్టాలి అని యాంకర్ శ్రీముఖి చెబుతుంది.ఇక ఇద్దరు కూడా పోటీపడీ మరీ అరవడంతో మిగిలిన కంటెస్టెంట్సే కాదు జడ్జెస్ తో పాటు గెస్ట్ సత్యదేవ్ కూడా భయపడిపోయారు . మొత్తానికైతే ఇది మైండ్ గేమ్ కాదు అంతకుమించి అంటూ కామెంట్ చేయడం గమనార్హం. ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సీజన్ పై అంచనాలు పెంచేసింది. ఇకపోతే మరో రెండు రోజుల్లో బిగ్బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతోంది ఇందులో వెళ్లడానికి పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా ఇప్పటికే వైరల్ గా మారుతున్నాయి

Related News

Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్‌ భారీ ప్లాన్‌.. మొదటి రోజే కంటెస్టెంట్స్‌కి దిమ్మతిరిగే ట్విస్ట్‌, అదేంటంటే!

Bigg Boss 9: అగ్నిపరీక్ష నుండి 5గురు కాదు 6గురు.. లిస్ట్ వైరల్!

Divvela Madhuri: బిగ్‌బాస్ ఆఫర్‌పై స్పందించిన దువ్వాడ కపుల్స్.. మాధురీని అలా అనేశాడేంటి?

Bigg Boss AgniPariksha: ఆదిరెడ్డి రివ్యూపై శ్రీజ దమ్ము రియాక్షన్.. ఇకనైనా మారండయ్యా!

Bigg Boss AgniPariksha: అగ్ని పరీక్ష అంటూ అవమానిస్తున్నారు.. బిగ్ బాస్‌పై సిద్దిపేట్ మోడల్ ఫైర్

Big Stories

×