BigTV English

Shekhar Kammula: వరస్ట్ ఫిలిమ్ తీసిన 11 ఏళ్లకు బ్లాక్ బస్టర్ కొట్టాడు

Shekhar Kammula: వరస్ట్ ఫిలిమ్ తీసిన 11 ఏళ్లకు బ్లాక్ బస్టర్ కొట్టాడు

Shekhar Kammula: సక్సెస్ మరియు ఫెయిల్యూర్ ని బట్టి ఒక మనిషిని చూసే విధానం మారిపోతుంది అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. డాలర్ డ్రీమ్స్ అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆనంద్ సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నారు. శేఖర్ చేసిన హ్యాపీడేస్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ మీద ఆ సినిమా విపరీతమైన ప్రభావం చూపించింది. ఆ సినిమా చూసి ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయిన స్టూడెంట్లు ఉన్నారు. శేఖర్ కమ్ముల తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా, ఒక సినిమా గురించి మాత్రం ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తాయి. నయనతార హీరోయిన్ గా చేసిన అనామిక.


అప్పుడే శేఖర్ కమ్ముల తమిళ్ ఎంట్రీ

తెలుగు ప్రేక్షకులకు శేఖర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే నయనతారకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. శేఖర్ కమల దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో నటించిన సినిమా అనామిక. ఇదే సినిమా నయనతార నటించిన తమిళ్లో కూడా విడుదలైంది. ఈ సినిమాతోనే శేఖర్ కమ్ముల తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. అప్పుడు ఈ సినిమా గురించి చాలామంది విపరీతమైన కామెంట్ చేశారు. అలానే ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల సినిమాను అనౌన్స్ చేసినప్పుడు కూడా, ఆ దర్శకుడితో ఎందుకు డిజాస్టర్ సినిమా చేశాడు కదా అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి కారణం శేఖర్ తెలుగులో చేసిన హిట్ సినిమాలు తమిళ్ వాళ్లకి తెలియకపోవడం.


బ్లాక్ బస్టర్ కుబేర

ధనుష్ హీరోగా శేఖర్ కుబేర అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి షో పడిన వెంటనే పాజిటివ్ రివ్యూస్ రావడం మొదలయ్యాయి. ఇప్పటికీ కంప్లీట్ గా ఇది ఒక హిట్ టాక్ తెచ్చుకుంది. ధనుష్ పర్ఫామెన్స్ ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. ముఖ్యంగా ధనుష్ లో ఉన్న పొటెన్షియల్ ను శేఖర్ కంప్లీట్ గా వాడుకున్నారు. ఈ సినిమా గురించి ప్రస్తావన వస్తే మొదటి మాట్లాడేది ధనుష్ గురించి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో చాలామంది తమిళ్ ఆడియన్స్ కు శేఖర్ కమ్ముల ఒక ఆన్సర్ ఇచ్చేశాడు. అప్పుడు అనామిక రూపంలో డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు 11 ఏళ్ల తర్వాత తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి ఒక బ్లాక్ బస్టర్ సినిమాను అందించాడు.

Also Read : పెళ్లి చేసుకోను.. పిల్లలను మాత్రం కంటా.. తేజస్వీ బోల్డ్ కామెంట్స్

Related News

Coolie Vs War 2: రాజకీయ చిచ్చు లేపిన లోకేష్.. ఎన్టీఆర్ ను దెబ్బతీయడానికేనా?

War 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం.. కానీ ఆంక్షలు తప్పనిసరి!

Mahavatar Narasimha Collections : నరసింహుడి ఉగ్రతాండవం ఇప్పటిల్లో తగ్గేట్టులేదే.. 200 కోట్ల రాబడుతుందా..?

Filmfare Awards 2025: ఫిల్మ్ ఫేర్ గ్లామర్ & స్టైల్ సౌత్ విన్నర్స్ ఫుల్ లిస్ట్ ఇదే..!

Coole Vs War 2: కూలీ, వార్ 2 ప్లస్.. మైనస్ లు.. బాక్సాఫీసు క్లాష్ లో బాలీవుడ్ కి తడబాటు తప్పదా?

Tollywood workers Strike: చర్చలు ఫెయిల్… సమ్మెపై నిర్ణయం ఇదే

Big Stories

×