Tejaswi Madivada: తేజస్వి మదివాడ(Tejaswi Madivada) పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలు అలాగే పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు. మహేష్ బాబు ,వెంకటేష్ హీరోలుగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన తేజస్వి మొదటి సినిమాతోనే తన నటన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా ద్వారా సక్సెస్ అందుకోవడంతో ఈమెకు హార్ట్ ఎటాక్, ఐస్ క్రీమ్, మనం, ప్రేమికులు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న తేజస్వి తనకు ఉనటువంటి పాపులారిటీతో ఏకంగా బిగ్ బాస్ (Bigg Boss)అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈమె ఇటీవల కాలంలో సినిమాల కంటే కూడా బుల్లితెర కార్యక్రమాలు ఇతర షోల పైన ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇక తేజస్వి వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో రకాల వార్తలు కూడా బయటకు వచ్చాయి.
పిల్లలు మాత్రమే కావాలి..
ముఖ్యంగా తేజస్వి లవ్, రిలేషన్ గురించి ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలను ఈమె ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు.. ఇక ప్రస్తుతం పెళ్లి వయసులో ఉన్న ఈమె పెళ్లి(Marriage) గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రస్తావన రావడంతో ఈమె మాత్రం పెళ్లి గురించి బోల్డ్ కామెంట్స్ చేశారు. తన జీవితంలో పెళ్లి అనే ప్రస్తావన లేదని తెలిపారు. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తొందరగా వయసు అయిపోతే బాగుంటుంది అంటూ మాట్లాడారు.
లివింగ్ రిలేషన్ కావాలి…
ఇలా పెళ్లి చేసుకోను అని చెప్పిన ఈమె పిల్లలు(Kids) మాత్రం కావాలంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు. పెళ్లి కాకుండా పిల్లలు ఎలా టెస్టు బేబీ ద్వారా ప్లాన్ చేస్తావా? అంటే అదేం లేదు సుస్మితసేన్ పిల్లల్ని కని ఇప్పుడు పెళ్లి చేసుకోలేదా అంటూ ఆమెను ఆదర్శంగా తీసుకున్నారు. తాను పెళ్లి మాత్రమే చేసుకోనని లివింగ్ రిలేషన్ లో ఉంటానని ఈ సందర్భంగా తేజస్వి చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్స్ తన లైఫ్ గురించి తనకు ఫుల్ క్లారిటీ ఉంది అంటూ కామెంట్లు చేయగా, మరి కొందరు మాత్రం ఇలా రిలేషన్ లో ఉండి పిల్లల్ని కనడం కంటే కూడా అనాధలను దత్తత తీసుకొని పెంచితే ఒకరికి జీవితాన్ని ఇచ్చినట్టు అవుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పెళ్లి వద్దు.. పిల్లలు ముద్దు అంటూ తేజస్వి చేసిన ఈ కామెంట్స్ మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారాయి.
Also Read: బెగ్గర్ పాత్ర అని ఈ తెలుగు హీరో రిజెక్ట్ చేశాడు.. ధనుష్ వచ్చి హిట్ కొట్టాడు!