E-Paper
Advertisement

నోరు జారడం గురించి మళ్లీ మాట్లాడుకుందాం… త్రిగుణ్ కు క్లాస్ పీకిన నాగార్జున!

నోరు జారడం గురించి మళ్లీ మాట్లాడుకుందాం… త్రిగుణ్ కు క్లాస్ పీకిన నాగార్జున!
Advertisement

Bigg Boss 10 Telugu Day 76 Promo 1: తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 కార్యక్రమం చివరి దశకు చేరుకుంది మరొక నాలుగు వారాలలో ఈ కార్యక్రమం ఫినాలే జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్ టు ఫినాలే కంటెండర్స్ అవకాశం కోసం త్రిగుణ్, ముకేశ్ లను డిక్టేటర్స్ గా ఎంపిక చేసి ఈ వారం డిక్టేటర్ ఛాలెంజ్ నిర్వహించారు. ఇక ఈ గేమ్ లో విజయం సాధించిన వారికి టికెట్ టు ఫినాలే కంటెండర్ అవకాశం ఉంటుందని తెలిపారు. ఇక ఈ గేమ్ లో భాగంగా ఇరువురి మధ్య భారీగా పోటీ జరిగింది . ఈ నేపథ్యంలోనే వీకెండ్ ఎపిసోడ్స్ కోసం ఫాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

త్రిగుణ్ నీకు రాడ్ అంటే భయమా..

తాజాగా వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన మొదటి ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా నాగార్జున(Nagarjuna) డిక్టేటర్ స్టైల్ లో ఎంట్రీ ఇవ్వడం అదిరిపోయింది. ఈయన చేతిలో స్టిక్ పట్టుకొని రావడంతో అది చూసిన త్రిగుణ్(trigun) స్టిక్ చూస్తుంటే భయం వేస్తుంది సర్ అని మాట్లాడగా..త్రిగుణ్ నీకు ఈ రాడ్ అంటే భయమా.. డిక్టేటర్ హౌస్ లో మాత్రమేనా.. ఇవాళ ఇక్కడ చూపిద్దాం డిక్టేటర్ అంటే ఏంటో అంటూ అని నాగార్జున మాట్లాడారు.

త్రిగుణ్ నోరు జారడం..

Advertisement

ఇక డిక్టేటర్ గా ముఖేష్ కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు అంటూ నాగార్జున ప్రశ్నించారు. ఇక రాంప్రసాద్ మాట్లాడుతూ 100కు నా ప్రకారం 50 మార్కులు ఇస్తానని చెప్పారు. ఇక డిక్టేటర్ గా ముఖేష్ కు ఎన్ని మార్కులు ఇస్తారు అంటూ అక్కడే ఉన్న ఆడియన్స్ ని అడగడంతో వారు 50 కూడా ఎక్కువ అతనికి 30 మార్కులే ఇవ్వాలి అంటూ ముఖేష్ ఫ్యాన్స్ చెప్పడంతో ఇది రియాలిటీ అని నాగార్జున తెలిపారు. ఇక త్రిగుణ్ కి డిక్టేటర్ గా 90 మార్కులు ఇద్దామని అనుకుంటున్నాను అని శివ తెలిపారు. ఇక ఆయనకు పది మార్కులు కూడా ఎందుకు కట్ చేసాను అంటే ఆయన నోరు జారడం గురించి మార్కులు కట్ చేశామని ఆయనలో అదే మైనస్ అంటూ శివ తెలిపారు.

Advertisement

ఈ విధంగా శివ 90 మార్కులు ఇవ్వడంతో వెంటనే త్రిగుణ్ మాట్లాడుతూ.. నాకు నేను చెప్పుకున్నాను మిగతా వారి గురించి మాట్లాడలేదని సమాధానం చెప్పుకోగా వెంటనే నాగార్జున మాట్లాడుతూ.. నువ్వు నోరు జారడం గురించి తర్వాత మాట్లాడుకుందాం… డిక్టేటర్ ముఖేష్ డిక్టేటర్ త్రిగుణ్ కి 90 మార్కులు ఇవ్వడం న్యాయమేనా అంటూ అడగడంతో నా ప్రకారం 90 మార్కులు ఇవ్వటం కరెక్ట్ కాదని ముఖేష్ తెలిపారు. డిక్టేటర్ గా నువ్వు ఎంత మంచిగా చేసినా నీకు 90 మార్కులు ఇవ్వడానికి కారణం నీ టంగ్ అంటూ నాగార్జున త్రిగుణ్ కి క్లాస్ పీకారు. నోరు జారడం.. ఫ్యామిలీస్ వచ్చి నిన్ను ఎక్కడో పెట్టారు. అక్కడ పెట్టిన వాళ్ళు తీసుకొచ్చి కిందికి పడేస్తారు చాలా సింపుల్ .. ఒక్క మాట టోటల్ అంతటినీ మార్చేస్తుందని నాగార్జున త్రిగుణ్ నోరు జారడం గురించి ఈ ప్రోమో వీడియోలో క్లాస్ పీకారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Also Read: ఆకాశంలో ఒక తార.. సాత్విక వీరవల్లి రెమ్యూనరేషన్ ఎంతంటే?

Related News

జాను లిరి ఏడాది సంపాదన ఎంతో తెలుసా?

కులకడం అంటే మా ఇంట్లో చీపురు తిరిగేస్తారు.. రోహిత్ నాయుడు షాకింగ్ కామెంట్స్!

మౌనీరాయ్ సర్జరీ చేయించుకుందా.. విడాకుల తర్వాత నిజాలు బయటపెట్టిన భర్త!

స్టైలిష్ లుక్ లో పిచ్చెక్కిస్తున్న పెద్దోడు.. అమ్మాయిలు ఫిదా అవ్వాల్సిందే..!

Vindhya Vishaka : వింధ్య ఒక్క షోకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను ఆడుకున్న ధీరజ్..పులిరాజాలా మారిన తిరుపతి.. శ్రీవల్లి కాపురంలో చిచ్చు..

Nindu Noorella Saavasam Serial Today Episode November 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి పెళ్లి ఫోటోల్లో మంగళ, పార్థును చూస్తుందా..? 

Big Stories

Advertisement
×