2027 Sankranti:తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ ఎంత పెద్ద పండుగో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుమారుగా 6 నెలల పాటు కష్టపడిన తర్వాత పంట చేతికి వస్తుంది. ఆ సమయంలో ఇంటి నిండా ధాన్యంతో.. నూతన వస్త్రాలతో.. బంధుమిత్రులతో.. పిండి వంటలతో జరుపుకునే ఈ పండుగ కోసం ప్రజలు ఎంతగా అయితే ఎదురు చూస్తారో.. ఈ సంక్రాంతి సెలవులలో సినిమాలను విడుదల చేసి ,క్యాష్ చేసుకోవాలి అని సెలబ్రిటీలు కూడా అంతే ఆరాటపడుతూ ఉంటారు. అందులో భాగంగానే సంక్రాంతిని టార్గెట్ గా చేసుకొని ముందుగానే స్లాట్ బుక్ చేసుకుంటూ సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే 2027 సంక్రాంతిని టార్గెట్ గా చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి కొన్ని చిత్రాలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఈ చిత్రాలు పక్కాగా సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. మరి ఆ చిత్రాలేంటి? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో థియేటర్లలోకి రాబోతున్న చిత్రం మహాకాళి . భూమి శెట్టి, అక్షయ్ ఖన్నా, శ్రియా రెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ నిర్మించారు. ఇక ఈ సినిమా 2027 జనవరి 8న థియేటర్లలో విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ ,మలయాళం భాషల్లో సంక్రాంతి బరిలో దిగబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన చిత్రం జనవరి 12న విడుదల. కళ్యాణ్ రామ్, వెంకటేష్ హీరోలుగా.. కృతి శెట్టి, కీర్తి సురేష్ హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ఎప్పుడో నాలుగేళ్ల క్రితమే ప్రకటించిన ఈ సినిమా.. పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది . ఇక ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడనుంది. ఇందులో చిరంజీవి – త్రిష జంటగా నటిస్తున్నారు.
శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ఫ్యామిలీ ప్యాక్. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్నారు. శ్రీ విష్ణు సరసన సాక్షి మడోల్కర్ హీరోయిన్గా నటిస్తుండగా.. వీకే నరేష్, అభిరామి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మించారు.
ALSO READ:జాను లిరి ఏడాది సంపాదన ఎంతో తెలుసా?
శర్వానంద్, ప్రీతి ముకుందన్ , మానస వారణాసి తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం జార్జ్ క్రిష్. ఈ సినిమా వచ్చే యేడాది జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు.