E-Paper
Advertisement

ఆకాశంలో ఒక తార.. సాత్విక వీరవల్లి రెమ్యూనరేషన్ ఎంతంటే?

ఆకాశంలో ఒక తార.. సాత్విక వీరవల్లి రెమ్యూనరేషన్ ఎంతంటే?
Advertisement

SatvikaVeeravalli : సాత్విక వీరవల్లి ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈమె పేరు మారుమోగుతుంది. ఈమె ఇటీవల దుల్కర్ సల్మాన్(Dulquer Salman)  హీరోగా నటించిన ఆకాశంలో ఒక తార(aakasamlo oka tara ) అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన సాత్విక ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయారు. ఈమె ఒక సినిమా విడుదల కాకుండానే ఇప్పటికే రెండు మూడు సినిమాలకు కమిట్ అయినట్టు తెలుస్తోంది.

మొదటి సినిమాకే కోట్లలో రెమ్యూనరేషన్..

సాత్విక వీరవల్లి ఆకాశంలో ఒక తార సినిమాలో కల్పన అనే పాత్రలో నటించారు. ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించారని ఈమె నటన పట్ల ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సాత్విక ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ కి సంబంధించిన వివరాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం సాత్విక ఆకాశంలో ఒక తార సినిమా కోసం సుమారు 2 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. అయితే ఈమె రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయిన ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈమె రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది.

నాగచైతన్యకు జోడిగా సాత్విక…

Advertisement

సాత్విక ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమె తెలుగులో నాగచైతన్యకు జోడిగా నటించే అవకాశాన్ని కూడా అందుకున్నారు. నాగచైతన్య తన 25వ సినిమా హీరోయిన్ గా సాత్విక వీరవల్లి ఎంపిక అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాతో పాటు ఈమె సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా భాగం కాబోతున్నట్టు సమాచారం. ఈ విధంగా మొదటి సినిమా విడుదల కాకుండానే సినిమా అవకాశాలు అందుకోవడంతో ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో సాత్విక పేరు మారుమోగిపోతుంది.

పుట్టి పెరిగింది అమెరికాలోనే..

ఇక సాత్విక తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి. ఈమె పుట్టి పెరిగింది అంత అమెరికాలోనే. సినిమాల్లోకి రాకముందు అమెరికాలో సాఫ్ట్‌వేర్ మరియు హెల్త్‌కేర్ టెక్నాలజీ రంగంలో ఇంజనీర్‌గా పనిచేశారు.ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్లో సీనియర్ కన్సల్టెంట్ గా పనిచేశారు.చదువు, ఉద్యోగంతో పాటు చిన్నప్పటి నుంచే కర్ణాటక సంగీతం ,భరతనాట్యంలో శిక్షణ తీసుకున్న సాత్విక నటనపై ఆసక్తితో ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. ఆకాశంలో ఒక తార అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నారు.

Advertisement

Also Read: కులకడం అంటే మా ఇంట్లో చీపురు తిరిగేస్తారు.. రోహిత్ నాయుడు షాకింగ్ కామెంట్స్!

Related News

2027సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్న చిత్రాలివే!

ఎల్లో డ్రెస్సులో సందీపా ధర్ గ్లామర్ ట్రీట్..ఆ ఒక్క లైన్‌తో నెట్టింట ట్రెండింగ్!

కృష్ణతో సినిమా మధ్యలోనే ఆగిపోయింది.. అసలు కారణం చెప్పిన డైరెక్టర్!

సమంతకు పుట్టేది కొడుకే 12 ఏళ్ల క్రితమే చెప్పిన జ్యోతిష్యుడు.. వీడియో వైరల్ !

“దివికి దివికి”.. వదినా మరదళ్లుగా దుమ్ములేపేసిన కీర్తి – కృతి!

అద్దెల రూపంలో అమీర్ ఖాన్ కి నెలకు ఎంత ఆదాయం వస్తోందంటే?

కావ్య-అనిరుధ్ పెళ్లి.. ఉద్యోగులకు స్పెషల్ సర్ప్రైజ్?వీడియో వైరల్!

Big Stories

Advertisement
×