Sandeepa Dhar:నెట్టింట సినీ స్టార్స్ పెట్టే పోస్ట్ లకి ఎంత డిమాండ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా వాళ్లు షేర్ చేసే గ్లామరస్ ఫొటోలతో పాటు ఏదైనా ట్రెండింగ్ టాపిక్‌పై ఫన్నీగా క్యాప్షన్ పెడితే చాలు నెటిజన్లు దాన్నితెగ షేర్ చేస్తూ కామెంట్లు పెడుతుంటారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ సందీపా ధర్ చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కూడా ఇపుడు ఇలాగే నెట్టింట్లో హట్ టాపిక్ గా మారింది.
పసుపు రంగు స్లీవ్‌లెస్ డ్రెస్సులో, సింపుల్ మేకప్‌తో చాలా స్టైలిష్‌గా ఉన్న ఒక ఫొటోను ఆమె షేర్ చేసి యూత్ ని ఫిదా చేసింది.అయితే ఆమె ఫొటోకి క్యాప్షన్ మాత్రం గేమింగ్ లవర్స్‌ను కట్టిపడేసిందనే చెప్పాలి;
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గేమ్స్ ఆడే వాళ్లందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘GTA VI’ (గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6) గేమ్ నవంబర్ 19న విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రాక్‌స్టార్ గేమ్స్ వాళ్లు తయారు చేసిన ఈ గేమ్ గ్రాఫిక్స్, యాక్షన్ సీన్లు గురించి ఇపుడు ఎక్కడ చూసిన తెగ డిబేట్ జరుగుతుంది..
సరిగ్గా ఇదే టైమ్‌లో సందీపా ధర్ తన ఫొటో కింద “GTA VI has a new problem and it’s not the police” అంటూ ఒక క్రేజీ క్యాప్షన్ పెట్టేసింది.అంటే అంటే GTA VI గేమ్‌కు ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడిందని, అది పోలీసుల వల్ల కాదని ఆమె సరదాగా కామెంట్ చేసుకోచ్చింది ఈ బీటౌన్ బ్యూటీ.
మామూలుగా GTA గేమ్ లో కార్లు కొట్టేయడం, రోడ్లపై రూల్స్ బ్రేక్ చేయడం, వెనుక పోలీసులు ఛేజ్ చేయడం మెయిన్ హైలెట్ అన్న సంగతి తెల్సిందే.ఇక ఈ గేమ్ రిలీజ్ అయిన సందర్భంగా అమెరికాలోని కొన్ని పోలీస్ డిపార్ట్‌మెంట్లు కూడా సోషల్ మీడియాలో ఫన్నీ పోస్టులు పెడుతున్నాయి.
గేమ్‌లో చేసినట్టు రియల్ లైఫ్ లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయొద్దని, చట్టాలను గౌరవించాలని సరదాగా వార్నింగ్ ఇస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే సందీపా తన గ్లామర్ ఫోటోలని పెడుతూ ఇచ్చిన క్యాప్షన్ ఇపుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది.
ఇక సందీపా ధర్ సినీ జర్నీ విషయానికి వస్తే, 2010లో వచ్చిన ‘ఇసి లైఫ్ మేన్’ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ బెస్ట్ డెబ్యూ అవార్డుకు నామినేట్ అవడం విశేషం,ఇక ఆ తర్వాత సల్లూ భాయ్ దబాంగ్ 2 సినిమాలో చిన్న రోల్ చేసినా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు 2014 టైగర్ ష్రాఫ్ ఫస్ట్ ‘హీరోపంతి’లో కూడా కీ రోల్ పోషించి సత్తా చాటింది.
ఆ తర్వాత ‘గొల్లూ ఔర్ పప్పూ’, ‘గ్లోబల్ బాబా’, ‘7 అవర్స్ టు గో’ లాంటి సినిమాల్లో వెరైటీ రోల్స్ చేసిన సందీపా ‘7 అవర్స్ టు గో’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకోవడం విశేషం.
ALSO READ:వైష్ణవి సోనీ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. మల్లె చెట్టు రచ్చ మామూలుగా లేదుగా!
ఇక ‘బారాత్ కంపెనీ’, ‘కాగజ్’ ‘దో దీవానే షెహర్ మే’ సినిమాలతో అలరించిన సందీపా అభయ్’, ‘ముంబై భాయ్’, ‘బిసాత్’, ‘ఛత్తీస్ ఔర్ మైనా’, ‘మై’, ‘డాక్టర్ అరోరా’ లాంటి వెబ్ సిరీస్‌లతో కూడా డిజిటల్ ఆడియన్స్ కి దగ్గరైపోయింది.మొత్తంగా ఒకవైపు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంటూనే, మరోవైపు సోషల్ మీడియాలో ఇలాంటి పోస్ట్ లతో రచ్చ చేస్తుందన్న మాట !