E-Paper
Advertisement

Actress Kanchana: రూ. 100 కోట్ల ఆస్తీ తిరుమలకు ఇచ్చేసిన నటి.. ఇప్పుడు ఒంటరిగా..

Actress Kanchana: రూ. 100 కోట్ల ఆస్తీ తిరుమలకు ఇచ్చేసిన నటి.. ఇప్పుడు ఒంటరిగా..

Actress Kanchana: అలనాటి హీరోయిన్ నటి కాంచన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 60’s, 70’s లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు ఆమె. మొదట ఎయిర్‌ హోస్టెస్‌గా ఉద్యోగం చేసిన ఆమె హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందారు. తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ మలయాళ, హిందీ భాషల్లో నటించి ఎన్నో హిట్స్ అందుకున్నారు.

అర్జున్ రెడ్డితో రీఎంట్రీ

హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె 40 ఏళ్ల తర్వాత అర్జున్ రెడ్డి చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో విజయ్ దేవరకొండకు నానమ్మగా నటించిన సంగతి తెలిసిందే. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా రాణించిన ఆమె వందల కోట్లు ఆస్తులు సంపాదించారు. చెన్నైలో ఎంతో హుందాగా బతికారు. ఖరీదైన బంగ్లా నివసిస్తూ బ్రాండ్ న్యూ కార్లలో ప్రయాణించేవారు. అలాంటి కాంచన ఇప్పుడు అదే చెన్నై రోడ్లపై సాధాసిదా మహిళగా జీవిస్తున్నారు. ప్రస్తుతం బెంగుళూరు శివారు ప్రాంతంలో నివసిస్తూ చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. తన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక గుడిలో ఆధ్యాత్మిక సేవలో పాల్గొంటూ అత్యంత సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నారు. తన ఆస్తీనంత దేవుడికి దారపోసి.. ఆమె సామాన్య జనాల్లో కలిసిపోయి జీవిస్తున్నారు.

Also Read: Jr NTR: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూ. ఎన్టీఆర్.. కారణమేంటంటే..

200 పైగా సినిమాలు

కాంచాన అసలు పేరు వసుంధర. తెలుగు కుటుంబమే. కానీ, పుట్టింది చెన్నైలో. 60,70లో హీరోయిన్ వెలుగు వెలిగిన ఆమె అర్జున్ రెడ్డి తర్వాత మళ్లీ కనుమరుగైంది. లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె బయట కనిపించారు. ఏవీఎం స్టూడియో అధినేత శరవణన్ మరణించడంతో నివాళి అర్పించేందుకు వచ్చిన ఆమె చాలా సాధారణంగా కనిపించారు. ఆటోలో వచ్చి తిరిగి ఆటోలోనే వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అంత పెద్ద నటి సాధారణ వ్యక్తిలా ఆటోలో దిగడంతో అంత ఆమె గురించే చర్చించుకుంటున్నాు. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆస్తి బాగానే సంపాదించారు. ప్రేమనగర్‌, శ్రీకృష్ణావతార , ఆనంద భైరవి, వంటి సినిమాల్లో నటించారు. వెండితెరపై తన అందం, అభినయంతో ఆకట్టుకున్న కాంచన నిజ జీవితంలో పెళ్లి చేసుకోకుం సింగిల్ గానే ఉండిపోయారు.

రూ. 100 కోట్ల ఆస్తీ

ఒంటరిగి నివసిస్తున్న ఆమె తన ఆస్తులను పేదలకు దానం చేశారు. కలియుగ దైవం వేంకటేశ్వరుడికి కోట్ల విలువ చేసే స్థలం ఇచ్చారు. 2010లో టీటీడీకి మరో రూ. 15 కోట్లు విరాళం ఇచ్చారు. ఇప్పుడు వాటి విలువ రూ. 100 కోట్ల పైమాటేనని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. తన మదిలో ఎప్పుడూ వేంకటేశ్వరున్ని ధ్యానిస్తూనే ఉంటానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ప్రస్తుతం తన చెల్లెలు దగ్గర ఉంటుంది. తన చెల్లెలు, మరిది వాళ్లంతా అండగా ఉన్నారని, చాలామంది ఊహించుకుంటున్నట్లు దయనీయ స్థితిలో లేనని, దేవుడి దయ వల్ల చాలా బాగున్నానని ఆమె పంచుకున్నానని ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పారు.

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×