BigTV English

Sandra Suhasini: నటుడు మహేష్ బాబుతో సీరియల్ నటి రెండో పెళ్లి

Sandra Suhasini: నటుడు మహేష్ బాబుతో సీరియల్ నటి రెండో పెళ్లి

Sandra Suhasini: ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ప్రేమించుకుంటున్నారు.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు.. ఎందుకు విడిపోతున్నారు అనేది ఎవరికీ తెలియదు. అది కేవలం సినిమావారికి మాత్రమే కాదు సీరియల్ లో నటించేవారికి కూడా వర్తిస్తుంది. సినిమా స్టార్స్  వి అయితే ఎక్కువ బయటపడతాయి. బుల్లితెర నటీమణులవి అంతగా బయటపడవు. పైకి తెల్సినవి కొన్నే.. తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఒక సీరియల్ నటి.. మరో సీరియల్ నటుడును రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యింది. అది కూడా ఒక ప్రోగ్రామ్ గా చేసి మరీ చెప్పడం విశేషంగా మారింది. మరి ఆ ప్రేమ జంట ఎవరు.. ? అనేది తెలుసుకుందాం.


 

బుల్లితెరపై సీరియల్స్ చూసేవారికి సాండ్రా సుహాసిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  కలవారి కోడళ్లు , ముద్ద మందారం సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాండ్రా.. ఆ తరువాత పలు సినిమాల్లో కూడా కనిపించింది. ప్రస్థితం రెండు సీరియల్స్ తో బిజీగా మారింది. ఇక  మనసిచ్చి చూడు సీరియల్ తో మహేష్ బాబు కాళిదాసు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భట్ హీరోయిన్ గా నటించిన ఈ సీరియల్ చాలా ఏళ్లు సక్సెస్ గా కొనసాగింది. ఆ సమయంలో వీరిద్దరి ప్రేమ చిగురించిందని, ఈ జంట పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు.


 

అయితే చిత్రంగా కీర్తి భట్.. మరొక నటుడును ప్రేమించి పెళ్లి చేసుకుంది. మనసిచ్చి చూడు సీరియల్ తరువాత మహేష్.. శుభస్య శీఘ్రం సీరియల్ చేస్తున్నాడు. ఈ సీరియల్ లోనే సాండ్రా కూడా నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారింది. కొన్నేళ్లు వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో కలిసి సహజీవనం చేశారు. ఒక యూట్యూబ్ ఛానెల్ ను ఓపెన్ చేసి.. ఇద్దరు తమ జీవితాల్లో జరిగే విషయాలను ఎంచుకుంటూ వచ్చారు కానీ, ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ను బయటకు చెప్పలేదు.

 

ఇక చాలా కాలం  రిలేషన్ లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు ఈమధ్యనే తాము వివాహ బంధం లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. దీంతో వెంటనే ఒక ఛానెల్.. ఈ జంట నిశ్చితార్దాన్ని థీమ్ గా పెట్టి ఒక ప్రోగ్రామ్ కూడా నిర్వహించింది. ఇందుకు సంబంధించినప్రోమో రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సాండ్రాను పల్లకిలో తీసుకురాగా..  రెండు కుటుంబాల పెద్దల మధ్య మహేష్ సిగ్గుపడుతూ ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. ఇక ఇందులో  సాండ్రా మొదటిసారి ఐ లవ్ యూ చెప్పినట్లు తెలిపాడు.

 

ఒక ఇంటర్వ్యూలో సాండ్రా.. తనకు ఇప్పటికే విడాకులు అయ్యాయని, భర్తకు వేరే అమ్మాయితో సంబంధం అని తెలిసి అతనికి విడాకులు ఇచ్చేసిన్నట్లు తెలిపింది. అప్పటినుంచి సింగిల్ గా ఉన్న సాండ్రా.. ఇన్నాళ్లకు మహేష్ ను రెండో పెళ్లికి రెడీ అయ్యింది. ఈ విషయం తెలియడంతో వీరి అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది.

Related News

Cm Revanth Reddy: చలనచిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి వెళ్లాలి

Anaganaga Oka Raju : వంశీ మామూలు ప్లానింగ్ కాదు, ఏకంగా పవన్ కళ్యాణ్ టార్గెట్

OG Ticket: ఏపీలో ‘ఓజి’ స్పెషల్ షోకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధర తెలిస్తే షాకే!

Disha patani: దిశా పటాని ఇంటి ముందు కాల్పులు, నిందితులు ఎన్కౌంటర్

OG Censor : ఓజి సినిమా సెన్సార్ పూర్తి, కొత్త రికార్డులు ఖాయం

TG Viswa Prasad: విశ్వప్రసాద్ సరికొత్త రూటు… ఇక ఇండస్ట్రీకి మంచి రోజులే

Manchu Lakshmi: ఆమె నా రోల్ మోడల్.. ట్విస్ట్ ఇచ్చిన మంచు లక్ష్మీ!

Manchu Lakshmi: మనోజ్ రీ ఎంట్రీ వెనుక ఇంత కథ ఉందా.. మంచు లక్ష్మీ ఏమన్నారంటే?

Big Stories

×