Bollywood:సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటికి నిన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravindh) తల్లి అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma) కన్నుమూశారు. ఈ విషయం ఇంకా మరువకముందే.. ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంది. మరాఠీ సీరియల్స్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ నటి ప్రియ (Priya )ఇప్పుడు క్యాన్సర్ తో కన్నుమూశారు. గత 2 సంవత్సరాలుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఈమె.. ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.ప్రియా తన భర్త , ప్రముఖ నటుడు అయిన శాంతనుమోగే తో కలిసి నివసిస్తున్నారు. వీరికి 2012 లో పెళ్లి జరిగింది. ఇప్పటి వరకు తన కెరియర్ లో ఈమె 20కి పైగా సీరియల్స్ లో నటించింది.
నటి ప్రియా మరాఠే మోఘే కెరియర్..
ప్రియా విషయానికి వస్తే టెలివిజన్ సిరీస్ ‘పవిత్ర రిష్ట’ లో వర్ష పాత్రతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత సాత్ నిభాన సాథియా లో భవానీ రాథోడ్ పాత్ర, స్టార్ ప్రవాహ వంటి మరాఠీ టీవీ సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీరియల్ ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె లీడ్ రోల్ పోషించడమే కాకుండా ప్రతినాయకి పాత్ర కూడా పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. తన దీర్ఘకాల స్నేహితుడు, నటుడు అయిన శంతను మోఘేను 2012 ఏప్రిల్ 24వ తేదీన వివాహం చేసుకున్నారు. శంతను మోఘే తండ్రి ఎవరో కాదు ప్రముఖ నటుడు శ్రీకాంత్ మోఘే.
సీరియల్స్ మాత్రమే కాదు సినిమాలలో కూడా..
ఇకపోతే ఈమె సీరియల్స్ లోనే కాకుండా సినిమాలలో కూడా నటించింది. 2017 లో వచ్చిన తీ అని ఇటార్ అనే చిత్రంలో నటించిన ఈమె.. ఈ సినిమా తర్వాత మళ్లీ మరో సినిమాలో నటించలేదు. కానీ సీరియల్స్ లో మాత్రం నటిస్తూ భారీ పాపులారిటీ అందుకుంది. 2006లో మొదలైన ఈమె సీరియల్ ప్రయాణం 2022 వరకు సాగింది. ఇక 2022లో క్యాన్సర్ బారిన పడిన ఈమె దాదాపు రెండు సంవత్సరాల పాటు క్యాన్సర్ తో పోరాడి ఈరోజు తుది శ్వాస విడిచింది.ఈమె మరణం సీరియల్ అభిమానులను మరింత దుఃఖానికి గురి చేసిందని చెప్పవచ్చు. క్యాన్సర్ తో రెండు ఏళ్లపాటు పోరాడి జయించలేక ఆమె ప్రాణాలు కోల్పోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
also read:Mirai Heroine: ఎవరీ రితిక నాయక్.. అందంతో కట్టిపడేస్తున్న ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?