Mirai Heroine: ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీపై చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు చాలామంది ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ఒకటి రెండు చిత్రాలతోనే తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు కూడా.. అలాంటి వారిలో రితిక నాయక్ (Rithika Naik)కూడా ఒకరు. తాజాగా ఈమె యంగ్ హీరో తేజ సజ్జ (Teja sajja) నటిస్తున్న మిరాయ్ (Mirai) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ లో ఈమె పాత్ర హైలెట్గా నిలవడమే కాకుండా ఈమె లుక్స్ అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. దీంతో ఎవరీ రితిక నాయక్ ? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ? అంటూ తెలుసుకోవడానికి నెటిజన్స్ సైతం తెగ ఆరా తీస్తున్నారు. మరి ఈమె ఎవరు? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
విశ్వక్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ…
రితిక నాయక్.. ఇదివరకే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak sen) హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాతోనే ఇండస్ట్రీకి కూడా పరిచయమైంది కూడా.. ఆ తర్వాత నాని (Nani ) హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమాలో చివర్లో నాని కూతురుగా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మాత్రం ఈమెకు ఊహించని క్రేజ్ లభించింది అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు వైరల్ అవ్వడంతో ప్రతి ఒక్కరూ ఈమె ఫోటోలు చూసి మైమరచిపోవడమే కాకుండా ఈమె అందానికి ఫిదా అవుతున్నారు
రితిక బ్యాక్ గ్రౌండ్..
రితిక బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. 1997 అక్టోబర్ 27న భారతదేశంలోని న్యూఢిల్లీలో ఒడియా కుటుంబంలో జన్మించింది. 2019లో ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ 12వ సీజన్ టైటిల్ ను గెలుచుకుంది. ఇక నగరంలోని వివిధ ఆడిషన్లలో పాల్గొన్న ఈమె.. 2022లో అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాతో ఉత్తమ మహిళా అరంగేట్రం విభాగంలో తెలుగు సైమా అవార్డుకు నామినేట్ అయింది. ప్రస్తుతం డ్యూయేట్ అనే సినిమాతో పాటు వరుణ్ తేజ్ 15వ సినిమాలో కూడా అవకాశం అందుకుంది.
మిరాయ్ సినిమా విశేషాలు..
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత సమంత (Samantha ) హీరోగా నటించిన ‘ఓ బేబీ’ చిత్రం ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు తేజ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘జాంబిరెడ్డి’ సినిమాతో హీరోగా పరిచయమైన ఈయన.. హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై.. టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండీ విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు ట్రైలర్ కి కూడా సోషల్ మీడియాలో విశేష స్పందన లభించడంతో అందరి దృష్టి ఈ సినిమా పైన పడిందని చెప్పవచ్చు. సెప్టెంబర్ 12వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది ఈ సినిమా. ఈ సినిమా ద్వారానే తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధం అయ్యింది రితిక నాయక్.
also read:Mahesh Babu -Gautam: ఎంత పని చేశావు జక్కన్న.. నీ స్వార్థానికి వారి మధ్య దూరం పెంచావా?