BigTV English

Smartphone Comparison: పిక్సెల్ 10 vs నథింగ్ ఫోన్ 3 vs వన్ ప్లస్ 13.. ఏ ఫోన్ బెటర్?

Smartphone Comparison: పిక్సెల్ 10 vs నథింగ్ ఫోన్ 3 vs వన్ ప్లస్ 13.. ఏ ఫోన్ బెటర్?

Google Pixel 10 vs Nothing Phone 3 vs OnePlus 13 | ప్రీమియం ఫ్లాగ్ షిప్ ఫోన్ల సెగ్మెంట్ లో గూగుల్ తాజాగా పిక్సెల్ 10 (Pixel 10) లాంచ్ చేయడంతో ఈ టాప్ రేంజ్ లో నథింగ్ ఫోన్ 3 (Nothing Phone 3), వన్ ప్లస్ 13 (OnePlus 13) స్మార్ట్‌ఫోన్‌లు ధర, ఫీచర్లు, పనితీరు ఆధారంగా పిక్సెల్ 10 తో పోటీపడుతున్నాయి. ఈ మూడు ఫోన్‌లను పోల్చి, ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం.


ధర
Google Pixel 10 (12GB RAM, 256GB స్టోరేజ్) ధర ₹79,999. Nothing Phone 3 కూడా అదే ధరలో (12GB RAM, 256GB స్టోరేజ్) అందుబాటులో ఉంది, కానీ 16GB RAM, 512GB స్టోరేజ్ తో మరో వేరియంట్ ₹86,999 కూడా ఉంది.. OnePlus 13 మాత్రం ధర విషయంలో ముందంజలో ఉంది, 12GB RAM, 256GB స్టోరేజ్ మోడల్ ₹64,999, 16GB RAM, 512GB స్టోరేజ్ ₹71,999 వద్ద లభిస్తుంది. ధర పరంగా OnePlus 13 బెస్ట్ ఆప్షన్.

డిస్‌ప్లే, రిజల్యూషన్
Google Pixel 10లో 6.3 ఇంచ్ Actua OLED డిస్‌ప్లే ఉంది, ఇది 1080×2424 రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. Nothing Phone 3లో 6.67 ఇంచ్ AMOLED డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్ (1260×2800 పిక్సెల్స్), 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉంది. OnePlus 13 మాత్రం 6.82 ఇంచ్ Quad HD+ LTPO 4.1 ProXDR డిస్‌ప్లేతో (1440×3168 రిజల్యూషన్) 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో అత్యుత్తమ డిస్‌ప్లేను అందిస్తుంది.


ప్రాసెసర్
Pixel 10లో Google Tensor G5 ప్రాసెసర్ ఉంది. ఇది రోజువారీ వినియోగానికి సరిపోతుంది కానీ భారీ టాస్క్‌లకు అంతగా ఉపయోగపడకపోవచ్చు. Nothing Phone 3లో Qualcomm Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ ఉంది, ఇది ఫ్లాగ్‌షిప్ స్థాయి వేగం, శక్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. OnePlus 13లో Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంది, ఇది గేమింగ్ మల్టీటాస్కింగ్‌లో అత్యుత్తమ పనితీరును చూపిస్తుంది. అంటే పిక్సెల్ 10 కంటే ప్రాసెసర్ విషయంలో మిగతా రెండు ఫోన్లు బెటర్.

ఆపరేటింగ్ సిస్టమ్
Pixel 10 Android 16తో వస్తుంది, Google తన Pixel వినియోగదారులకు మొదటి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందిస్తుంది. Nothing Phone 3 Android 15తో Nothing OS 3.5ని ఉపయోగిస్తుంది, ఇది ఈజీ, క్లీన్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. OnePlus 13 కూడా Android 15తో OxygenOS ఆప్టిమైజేషన్‌లతో మెరుగైన ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

బ్యాటరీ, ఛార్జింగ్
Pixel 10లో 4970mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. Nothing Phone 3లో 5500mAh బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. OnePlus 13 అత్యధిక 6000mAh బ్యాటరీతో 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను అందిస్తుంది, ఈ విభాగంలో వన్ ప్లస్ అత్యుత్తమం.

కెమెరా సెటప్

Pixel 10లో 48MP వైడ్, 13MP అల్ట్రా-వైడ్, 10.8MP టెలిఫోటో కెమెరాలతో పాటు 10.5MP ఫ్రంట్ కెమెరా ఉంది. Nothing Phone 3లో 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ (ప్రైమరీ, పెరిస్కోప్ టెలి, అల్ట్రా-వైడ్) మరియు 50MP సెల్ఫీ కెమెరా ఉంది. OnePlus 13లో కూడా 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ (ప్రైమరీ, అల్ట్రా-వైడ్, పెరిస్కోప్ టెలిఫోటో) మరియు 32MP సెల్ఫీ కెమెరా ఉంది.

సైజు, బరువు

Pixel 10: 152.8 x 72 x 8.6mm, 204 గ్రాములు Nothing Phone 3: 160.60 x 75.59 x 8.99mm, 218 గ్రాములు OnePlus 13: 162.9 x 76.5 x 8.9mm, 213 గ్రాములు

Google Pixel 10 సాఫ్ట్‌వేర్ మరియు AI ఫీచర్లపై దృష్టి సారిస్తుంది, Nothing Phone 3లో పవర్ ఫుల్ పర్‌ఫామెన్స్, అద్భుతమైన కెమెరాలు ఉన్నాయి. అయితే OnePlus 13 ధర, డిస్‌ప్లే, బ్యాటరీ, పనితీరు పరంగా అత్యుత్తమ విలువను ఇస్తుంది. మీ బడ్జెట్, అవసరాల ఆధారంగా, OnePlus 13 ధర, ఫీచర్ల పరంగా బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది.

Related News

iPhone 17 Series: ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది.. ఇక ఈ 6 ఆపిల్ ప్రొడక్స్ కనిపించవా?

iphone 17 Price: ఐఫోన్ 17 సిరీస్ త్వరలోనే లాంచ్.. ఇండియాలో ధరలు ఇవే

Flipkart Big Billion Days: సెప్టెంబర్‌లో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. కొత్తగా మైక్రోసైట్ లాంచ్

Eye Strain Night Phone: రాత్రివేళ స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా?.. కంటి ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు

TikTok India: టిక్‌టాక్ మళ్లీ వస్తుందా? ఆ జాబ్స్ వెనుక మిస్టరీ ఏమిటి? సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్!

Big Stories

×