Mirai: చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. 20కి పైగా చిత్రాలలో నటించి తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్నారు తేజ సజ్జ (Teja Sajja). మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) చిన్నప్పటి పాత్రలలో నటించి మరింత పాపులారిటీ అందుకున్న ఈయన నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వంలో సమంత (Samantha) లీడ్ రోల్ పోషిస్తూ వచ్చిన ‘ఓ బేబీ’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యారు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన ‘జాంబిరెడ్డి’ సినిమాతో పూర్తిస్థాయి హీరోగా మారిన ఈయన పలు సినిమాలలో హీరోగా నటించి, మళ్లీ అదే డైరెక్టర్ దర్శకత్వంలో ‘హనుమాన్’ సినిమా చేసి పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్నారు.
అంతేకాదు ఇందులో మొదటి సూపర్ హీరో కాన్సెప్ట్ తో ప్రేక్షకులను మెప్పించి భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni)దర్శకత్వంలో మిరాయ్ (Mirai)సినిమా చేసి మరో సూపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. హనుమాన్ తోనే వందకోట్ల క్లబ్లో చేరిన ఈయన.. ఈ సినిమాతో మరోసారి 100 కోట్ల క్లబ్లో చేరి ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఈ రికార్డు సాధించిన హీరోగా పేరు దక్కించుకున్నారు. తేజ సజ్జ హీరోగా.. రితిక నాయక్ (Rithika Naik)హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాలో తేజ సూపర్ యోధ పాత్రలో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు.
also read:HBD Shahrukh Khan: 50 రూపాయలతో మొదలైన జీవితం.. వేలకోట్లకు అధిపతి.. మొత్తం ఆస్తి విలువ ఎంతంటే?
ఇక ఇందులో శ్రియ శరన్ తేజ తల్లి పాత్రలో నటించగా.. జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. అలాగే జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను కూడా పలు కీలక పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇటీవల జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే హిందీ వెర్షన్ మాత్రం అందుబాటులోకి రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ హిందీ వర్షన్ స్ట్రీమింగ్ కి కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అసలు విషయంలోకి వెళ్తే.. థియేటర్లో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఈ సినిమాను స్ట్రీమింగ్ కి తీసుకురావాలన్న ఒప్పందంతోనే హిందీ వర్షన్ నిలిపివేశారు. అయితే నవంబర్ ఏడవ తేదీ నుండి జియో హాట్స్టార్ వేదికగానే హిందీ వర్షన్ లో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ త్వరలోనే ఈ విషయాన్ని జియో హాట్ స్టార్ అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం. మొత్తానికైతే మిగతా భాషలలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ మిరాయ్ చిత్రం అటు ఓటీటీ హిందీ వెర్షన్ లో ఏ విధంగా అలరిస్తుందో చూడాలి. ఇక తేజ విషయానికి వస్తే ఇప్పుడు మరో సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.