E-Paper
Advertisement

సినిమాలు తక్కువే.. సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలే అంటున్న శాలిని!

సినిమాలు తక్కువే.. సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలే అంటున్న శాలిని!
Advertisement

Shalini Pandey:శాలిని పాండే ..ప్రీతి గా అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ ముద్దు గుమ్మ మరోసారి తన అందంతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకునే ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఫాలోవర్స్ ని ఫిదా చేస్తున్నాయి.

ముఖ్యంగా క్రీమ్ కలర్ డిజైనర్ అవుట్‌ఫిట్‌లో అందంగా కనిపిస్తూ తన స్టైలిష్ లుక్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది .ఈ ఫోటోల్లో శాలిని లుక్‌లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే.. డ్రెస్‌కు సంబంధించిన వర్క్, దానికి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ, హెయిర్ స్టైల్, మేకప్ ఇలా ప్రతిదీ కుదరడం విశేషం .

Advertisement

ముఖ్యంగా ఆమె ధరించిన డిజైనర్ బ్లౌజ్‌పై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్, స్కర్ట్‌పై కనిపిస్తున్న డీటైలింగ్ ఫోటోలకు మరింత రిచ్ లుక్ తీసుకొచ్చాయనే చెప్పాలి .. ఎలాంటి హడావుడి లేకుండా చాలా క్లాసీగా కనిపిస్తూ శాలిని తన ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకోవడం తో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్.

శాలిని పాండే విషయానికి వస్తే ఈ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ‘అర్జున్ రెడ్డి’ సినిమానే . విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ ని షేక్ చేసేసింది. ఇక ఇందులో ప్రీతి పాత్రలో శాలిని తనదైన ఫెర్ఫామెన్స్ తో ఫిదా చేసింది.ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఈ అమ్మడి యాక్టింగ్ టాప్ నాచ్ .

Advertisement

అలా మొదటి సినిమాతోనే సాలిడ్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత ‘మహానటి’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి అలరించింది.అలా ‘118’, ‘ఇద్దరి లోకం ఒకటే’, ‘నిశ్శబ్దం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ . ఒక్క తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా తమిళం, హిందీ చిత్రాల్లోనూ తన లక్ ని టెస్ట్ చేసుకుంది.

అలా ‘100% కాదల్’, ‘గొరిల్లా’, ‘బామ్‌ఫాడ్’, ‘జయేష్‌భాయ్ జోర్దార్’, ‘మహారాజ్’ వంటి సినిమాల్లోనూ నటించిన ఈ అమ్మడు 2025లో ధనుష్ నటించిన ‘ఇడ్లీ కడై’ సినిమాలోనూ మెరవడం విశేషం. ఇక 2026లో విడుదలైన ‘రాహు కేతు’ సినిమాతో బాలీవుడ్ ని పలకరించింది కూడా.ఇలా ఒకవైపు సినిమాలు, మరోవైపు ఫోటోషూట్లు, బ్రాండ్ ప్రమోషన్లతో శాలిని తన కెరీర్‌ను బిజీగా కంటిన్యుడూ చేస్తూ సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ కొట్టేసింది ఈ భామ.

ఇక ఎప్పటికప్పుడు తన పర్సనల్ లైఫ్ తో పాటు ఫ్యాషన్ ఫోటోలు, సినిమా అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటూ సందడి చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అభిమానులని ఫిదా చేసింది.చూడాలి మరి సినిమాలతో పాటు క్రేజీ ఫోటోషూట్లతో అభిమానులను పలకరిస్తున్న శాలిని పాండే నుంచి రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాలు పలకరిస్తాయో !

Tags

Related News

లిటిల్ హార్ట్స్‌కు భారీ లాభాలు.. కానీ నాకు మాత్రం.. మౌళి షాకింగ్ కామెంట్స్ !

ధనుష్ పొలిటికల్ ఎంట్రీ.. సాయి పల్లవి స్పెషల్ రిక్వెస్ట్.. ఆ పని చేయొద్దంటూ!

నటి అతుల్య చంద్ర ఫిర్యాదులో బయటపడ్డ సంచలన నిజాలు!

బాలయ్య రోజూ తెల్లవారుజామున 3 గంటలకే లేస్తారు.. కారణం ఇదే!

500 సినిమాలు చేశా.. కానీ నా పేరు చాలామందికి తెలియదు..ల్యాబ్ శరత్!

‘వృషకర్మ’ నుండి ఫస్ట్ సింగిల్.. ఎక్స్‌క్లూజివ్ గా ఆమె కోసమే!

అందరి కోసం సినిమా తీయలేను.. మౌళి బోల్డ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×