Athulya Chandra:మత్తు వదలరా చిత్ర హీరోయిన్ అతుల్య చంద్ర ఒక యువ వైద్యుడిపై దాడి చేసి, ఆపై దోపిడీ చేసిన కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ యువ వైద్యుడిపై జరిగిన ఈ భౌతిక దాడి ఘటన కేరళ రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ కేసులో నటి అతుల్య చంద్ర (Athulya chandra), నటుడు బిబిన్ పెరుంబిల్లి (Bibin perumbilli) తో పాటు ముగ్గురు అరెస్టు కాగా మరో 9 మంది కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ఎవరైతే బాధితుడిగా పోలీసులను ఆశ్రయించారో.. ఆ డాక్టర్ పైనే పోలీసులు తాజాగా అత్యాచారం కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. ఇక ఈ సంఘటనకు సంబంధించి నటి అతుల్య చంద్ర తరఫున బంధువు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు వైద్యుడిపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు సమాచారం.
అతుల్య చంద్ర బంధువు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. వైద్యం పేరుతో సదరు డాక్టర్ తరచూ తన ఫ్లాట్ కి వచ్చే వాడట. అయితే అతడి ప్రవర్తన సరిగా లేదని, తనకు మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించాడు అని ఆమె ఆరోపించింది. అక్రమ ప్రవర్తనకు తగిన బుద్ధి చెప్పాలనే ముందస్తు ప్రణాళికతో ఈనెల రెండవ తేదీన ఫోన్ చేసి అత్యవసర వైద్యం కావాలని ఫ్లాట్ కి రప్పించినట్లు అతుల్య చంద్ర బంధువు కీర్తన ఫిర్యాదులో తెలిపింది. మొత్తానికి అయితే ఆ డాక్టరు అతుల్య చంద్ర బంధువు అయిన కీర్తన పై లైంగికంగా ఇబ్బందులు పెట్టడంతోనే అతుల్య చంద్ర అతనికి బుద్ధి చెప్పాలని ఈ విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
also read:‘వృషకర్మ’ నుండి ఫస్ట్ సింగిల్.. ఎక్స్‌క్లూజివ్ గా ఆమె కోసమే!
అత్యవసర చికిత్స కోసం అని ఫ్లాట్ కి పిలిపించి, ఆయనపై భౌతిక దాడికి పాల్పడ్డారు నటుడు కం నిర్మాత బిబిన్ , ఆయన సహచరుగు.. ఒక కుర్చీలో ఆయనను కట్టేసిన తర్వాత ఆయన ముఖం , శరీరంపై దాడి చేసి.. దాడి అనంతరం ఆయన వద్ద ఉన్న ఐఫోను, స్మార్ట్ వాచ్, వైర్లెస్ ఇయర్ ఫోన్ వంటి సుమారు రూ.3.5 లక్షలు విలువైన వస్తువులను బలవంతంగా లాక్కున్నారట. అయితే అతడిని ఒక గదిలో బంధించగా అతడు చాకచక్యంగా అక్కడి నుండి బయటపడి పోలీసులను ఆశ్రయించారు. ఇక వైద్యుడి సమాచారం ప్రకారం ఫిర్యాదు నమోదు చేసిన వైద్యులు వీరిని అరెస్టు చేయగా.. ఇప్పుడు అతుల్య చంద్ర బంధువు రంగంలోకి దిగి అసలు విషయం బయటపెట్టింది.మరి ఈ కేసు ఎంతవరకు వెళ్తుందో చూడాలి.