Mouli:మౌళి…మౌళి టాక్స్ అనే యూట్యూబ్ ఛానెల్ తో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించిన ఈ కుర్రాడు ఇపుడు వెండితెరపై తన సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో వచ్చిన బ్లాక్‌బస్టర్ విజయం మౌళికి ఎక్కడ లేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ‘దొంగ నా కొడుకు’ (DNK) అంటూ మరో సాలిడ్ ఎంటర్ టైనర్ తో ఆడియన్స్ ని పలకరించేందుకు రెడీ అయిపోయాడు.
ఇక ఈ సినిమా నవంబర్ 12న థియేటర్ లో రిలీజ్ కానున్న సందర్బంగా ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీమ్ .అందులో భాగంగా ఒక ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మౌళి తన సినీ జర్నీ గురించి కెరీర్, హిట్లు-ఫ్లాప్‌ల గురించి ఇలా బోల్డ్ గా చెప్పుకొచ్చాడు.
పనిని ఆస్వాదించడంలోనే నిజమైన ఆనందం
తనకి ఫేమ్, డబ్బు కంటే తాను చేసే పనికే ఎక్కువ గుర్తింపు లేదా పేరు కోసమో, గుర్తింపు కోసమో కాకుండా తనకు మనస్ఫూర్తిగా నచ్చిన పని చేయాలనే పట్టుదలతోనే ఆయన ఈ రంగంలోకి వచ్చానని తెలిపాడు. ఇక సినిమా హిట్ అయిందా లేదా అనే దాని కంటే అందులోని ప్రతి సీన్ అనుకున్నట్టుగా వచ్చిందా లేదా అన్నదే తనకు అసలైన సంతోషాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చాడు.. పనిని ఆస్వాదించడంలోనే నిజమైన ఆనందం ఉంటుందని నమ్ముతానని చెప్పడం విశేషం .
ధైర్యంతో సినిమాల వైపు
సాధారణంగా యూట్యూబ్‌లో మంచి సక్సెస్ వస్తే చాలామంది అక్కడే ఉండిపోవడానికి ఇష్టపడతారన్న సంగతి తెల్సిందే . . కానీ తాను మాత్రం సేఫ్ జోన్లో ఉండిపోవడానికి ఇష్టపడలేదని, చిన్న చెరువులో పెద్ద చేపలా బతకడం కంటే, కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టి తనను తాను నిరూపించుకోవాలనే ధైర్యంతో సినిమాల వైపు వచ్చానంటూ మనసులోని మాటల్ని బయట పెట్టాడు.
ఇక ప్రస్తుతం లిటిల్ హార్ట్స్ వంటి సాలిడ్ హిట్ తర్వాత తనపై బాధ్యతలు పెరగడంతో పాటు ఫెయిల్యూర్ భయం కూడా పెరిగిందని ఓపెన్‌గా ఒప్పుకున్నాడు మౌళి. యూట్యూబర్‌గా ఉన్నప్పుడు ఏైనా తప్పు జరిగితే దాని ప్రభావం తన ఒక్కడిపైనే ఉండేదని, కానీ ఇప్పుడు సినిమా తీస్తున్నప్పుడు తనతో పాటు వందలాది మంది టెక్నీషియన్లు, ఆర్టిస్ట్ లు పనిచేస్తున్నారని తన నిర్ణయాలపైనే వాళ్ల అందరి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సినిమా సక్సెస్ అయితే తన టీమ్‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్, ఇతరులు కూడా పైకి వస్తారు. అందుకే ఇప్పుడు ప్రతి అడుగు చాలా ఆలోచించి వేయాల్సి వస్తోందని తెలిపాడు.
నమ్మిన కంటెంట్‌తోనే ముందుకు
అలాగే క్రియేటివ్ ఫీల్డ్‌లో అందరినీ మెప్పించాలనే ఆలోచనతో పనిచేస్తే అసలు కంటెంట్ దెబ్బతింటుందని ,వందమందికి నచ్చేలా మార్పులు చేసుకుంటూ పోతే కథలోని సోల్ పోతుందని తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు . అందుకే తాను నమ్మిన కంటెంట్‌తోనే ముందుకు వెళ్లి, దాని ఫలితాన్ని కూడా తీసుకునే ధైర్యం ఉండాలని చెప్పాడు . ‘లిటిల్ హార్ట్స్’ అంత పెద్ద హిట్ అయినా కూడా ‘దొంగ నా కొడుకు’ సినిమా కోసం అనవసరంగా బడ్జెట్ పెంచలేదని, కంటెంట్‌ను మాత్రమే నమ్ముకుని సినిమా తీశామని చెప్పాడు ఈ కుర్ర హీరో . చూడాలి మరి ..ఈసారి కూడా పక్కా హిట్ కొడతామంటున్న మౌళి ఇప్పుడు ‘దొంగ నా కొడుకు’ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో !
ALSO READ:బ్లూ శారీలో నిహారిక.. అదిరిపోయే అందంతో కట్టిపడేసిందిగా!