E-Paper
Advertisement

‘వృషకర్మ’ నుండి ఫస్ట్ సింగిల్.. ఎక్స్‌క్లూజివ్ గా ఆమె కోసమే!

‘వృషకర్మ’ నుండి ఫస్ట్ సింగిల్.. ఎక్స్‌క్లూజివ్ గా ఆమె కోసమే!
Advertisement

VrushaKarma:పండుగలు వచ్చాయంటే చాలు ఆ పండుగలను పురస్కరించుకొని సెలబ్రిటీలు తమ సినిమాలను విడుదల చేయడం లేదా? తమ సినిమాలను ప్రమోట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నవంబర్ 8న దీపావళిని పురస్కరించుకొని దంతేరాస్ సందర్భంగా వృషకర్మ (Vrushakarma) టీమ్ తో స్పెషల్ ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసింది సుమ కనకాల (Suma Kanakala). ఈ సందర్భంగా వృషకర్మ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చిన అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) ఎక్స్‌క్లూజివ్ గా ఆమెకు చూపించి, ఆమె ఒపీనియన్ తీసుకొని, ఆ తర్వాతే పాటను విడుదల చేస్తామని చెప్పడం వైరల్ గా మారింది.అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టిన వృషకర్మ..

నాగచైతన్య , మీనాక్షి చౌదరి, స్పర్ష్ శ్రీవాస్తవ ప్రధాన పాత్రల్లో డిసెంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తెలుగు పౌరాణిక అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వృషకర్మ. ‘విరూపాక్షా’ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న కార్తీక్ వర్మ దండు (Karthik Varma dandu)ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ సహకారంతో రచించబడిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుకుమార్ రైటింగ్స్ సహకారంతో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. అజనీష్ లోకనాథ్ సంగీత సారథ్యంలో డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అప్పుడే చిత్ర బృందం ప్రమోషన్ మొదలుపెట్టింది. దీపావళి సందర్భంగా సుమా కనకాలతో నాగచైతన్య, మీనాక్షి చౌదరితో పాటు చిత్ర బృందం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చింది.

సుమకి ఎక్స్ క్లూజివ్ గా ఫస్ట్ సింగిల్..

Advertisement

నాగచైతన్య మాట్లాడుతూ.. “వృషకర్మ నుండి ఇంకా ఫస్ట్ సింగిల్ విడుదల చేయలేదు. పాట పేరు స్వాగో అర్జున్. కానీ ఎక్స్‌క్లూజివ్ గా మీకోసమే ఇప్పుడు చూపించబోతున్నాము. మీకు చూపించి, మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలని ఉంది. మీరు ఏ ఫిల్టర్ లేకుండా నిజాయితీగా మీ అభిప్రాయం చెబుతారు కాబట్టి.. అంటూ మొబైల్లో ఫస్ట్ సింగిల్ ఆమెకు చూపించారు. సుమ చూసిన ఈ వీడియోలో నాగచైతన్య వెల్డింగ్ చేస్తున్నట్లు కనిపించారు. ఇందులో తన హ్యాండ్సమ్ లుక్ తో ఆకట్టుకున్నారు. ఇకపోతే చిన్న క్లిప్ చూసిన సుమ నైస్..చాలా బాగుంది ముఖ్యంగా మా జెన్ జీకి బాగా నచ్చింది అంటూ కామెంట్ చేసింది.

also read:బిగ్ బాస్ లో ఊహించని ఎలిమినేషన్.. పీఆర్ టీమ్ గట్టిగా కష్టపడ్డా నో యూజ్!

ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఫస్ట్ సింగిల్ అవుట్..

Advertisement

ఇకపోతే “స్వాగో అర్జున” అనే పాటను నవంబర్ 7న అనగా నేడు సాయంత్రం 5:00గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి సుమా పై నమ్మకంతో నాగచైతన్య తన మూవీ ఫస్ట్ సింగిల్ ను ఆమెకే చూపించారు. మరి ఆమెపై ఉన్న నమ్మకం.. ఆమె ఇచ్చిన రివ్యూ ఏ మేరకు నిలబడుతుందో తెలియాలి అంటే సాయంత్రం ఐదు గంటలకు ఫస్ట్ సింగిల్ విడుదలై ఆడియన్స్ రెస్పాన్స్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ , మలయాళం భాషలో డిసెంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.

Related News

అందరి కోసం సినిమా తీయలేను.. మౌళి బోల్డ్ కామెంట్స్!

నిశ్చితార్థం తర్వాత సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ పోస్ట్..ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

బ్లూ శారీలో నిహారిక.. అదిరిపోయే అందంతో కట్టిపడేసిందిగా!

‘బెవర్లీ హిల్స్’ నటి మృతి.. అసలేం జరిగిందంటే?

ఒకేరోజు ముగ్గురు స్టార్ హీరోలు.. క్రిస్మస్‌కు బాక్సాఫీస్ వార్!

సురేఖ వాణి పర్సనల్ వీడియోలపై వివాదం.. స్పందించిన నటి!

‘ రామాయణ’ సినిమా బిగ్ షాక్.. అక్కడ సినిమా బ్యాన్..

Big Stories

Advertisement
×