E-Paper
Advertisement

జీహెచ్‌ఎంసీ అడ్వర్టైజ్‌మెంట్‌లో కోట్ల కుంభకోణం.. పట్టించుకోని అధికారులు!

జీహెచ్‌ఎంసీ అడ్వర్టైజ్‌మెంట్‌లో కోట్ల కుంభకోణం.. పట్టించుకోని అధికారులు!
Advertisement

GHMC Advertisement: స్వేచ్చ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిదిలోని ప్రజల అవసరాలకు తగిన విధంగా అభివృద్ది పనులు, మౌలిక వసతుల నిర్వహణతో పాటు అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ ఆర్థిక వనరుల్లో ఒకటైన అడ్వర్ టైజ్ మెంట్ వింగ్ లో అసలేం జరుగుతుందో అంతుచిక్కటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ మూడు ముక్కలుగా పునర్విభజన జరిగిన తర్వాత అడ్వర్ టైజ్ మెంట్ వింగ్ లోని అధికారులు, యాడ్ ఏజెన్సీల నిర్వాహకులతో కుమ్మక్కు కావటంతో జీహెచ్ఎంసీ ఖజానాకు చేరాల్సిన కోట్లాది రూపాయలు యాడ్ ఏజెన్సీల నిర్వాహకులు, అధికారుల జేబుల్లోకి వెళ్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్ని కేటాయించారు?

ముఖ్యంగా జీహెచ్ఎంసీ మూడు ముక్కలు అయిన తర్వాత సిబ్బంది కొరత కారణంగా అడ్వర్ టైజ్ మెంట్ విభాగానికి అదనపు బాధ్యతలతో అధికారులను నియమించటం వల్లే వారు పూర్తి స్థాయిలో పర్యవేక్షించకపోవటంతో పాటు తరుచూ అక్రమాలు బయట పడుతున్నా, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటం అక్రమార్కులైన అధికారులు, యాడ్ ఏజెన్సీల నిర్వాహకులకు వరంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అడ్వర్ టైజ్ మెంట్ కోసం ఎన్ని హోర్డింగ్ లున్నాయి? ఎన్ని యూనిపోల్స్ ఉన్నాయి? ఏ సంస్థకు ఎన్ని కేటాయించారు? వాటి గడువు ఎపుడు ముగుస్తుంది? అన్న విషయాలకు సంబంధించి కూడా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమాచారం అందుబాటులో లేదంటే ఆర్ధిక వనరైన అడ్వర్ టైజ్ మెంట్ వింగ్ ను ఎంత గొప్పగా నిర్వహిస్తున్నారో అంచనా వేయవచ్చు.

ఇష్టారాజ్యంగా హోర్డింగ్‌లు

Advertisement

ప్రస్తుతమున్న జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలోని 30 సర్కిళ్లలో ఎవరైనా ఎక్కడైనా యాడ్ లు పెట్టుకోవచ్చు, తీసేసుకోవచ్చు. ముఖ్యంగా ఖైరతాబాద్ జోన్ లో ఎవరికి వారే ఇష్టారాజ్యంగా హోర్డింగ్ లు పెట్టేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బస్ షెట్టర్లను అద్దెకు ఇస్తున్నట్లు పలు చోట్ల బోర్డులు వెలిశాయి. ఈ రకంగా కేటాయించిన బస్ షెల్టర్లు క్రమంగా టీ షాపులుగా కాఫీ సెంటర్లు, ఇతర వ్యాపార సంస్థలుగా మారుతున్నాయి. గతంలో మెట్రోరైలు ప్రాజెక్టు రాకముందు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 3 వేల పై చిలుకు బస్ షెల్డర్లు ఉండేవి.

బస్టాపు ఫర్ రెంట్..

మెట్రో రైలు ప్రాజెక్టు కారణంగా సుమారు 300 లకు పైగా బస్టాపులు కనుమరుగయ్యాయి. ఆ తర్వాత ఆర్టీసి అధికారులు కోరిన చోట బస్టాపు లను ఏర్పాటు చేసి, వాటి నిర్వహణ బాధ్యతలను యాడ్ ఏజెన్సీలకు అప్పగిస్తూ వస్తుంది. బస్ షెల్టర్లపై వ్యాపార ప్రకటనలు వేసుకుని, అందులోని స్పేస్ ను మెయింటైన్ చేయాలని అగ్రిమెంట్ చేసుకున్న యాడ్ సంస్థలు ప్రస్తుతం అగ్రిమెంట్ కు విరుద్దంగా బస్ షెల్టర్లలోని స్పేస్ ను అద్దెకు ఇస్తూ బస్టాపు ఫర్ రెంట్ అనే బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రయాణికులేమో బస్సుల కోసం రోడ్లపై వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సికిందరాబాద్ ఆనంద్ ధియేటర్ సమీపంలోని యాత్రినివాస్ కు సమీపంలోని ఓ బస్టాపులో బస్టాపు ఫర్ రెంట్ అనే బోర్డు దర్శనమివ్వటం యాడ్ ఏజెన్సీల దందాకు అద్దం పడుతుంది.

Advertisement

Also Read: దీపావళికి కారు కొంటున్నారా? ఈ 5 కార్లపై రూ.2.75 లక్షల డిస్కౌంట్లు!

జీహెచ్ఎంసీ పక్కనే బస్సులు రాని స్టాపు..

ట్యాంక్ బండ్ లో ఉన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పక్కనే హాస్పిటల్ ను ఆనుకుని ఉన్న ఓ బస్టాపు నేటికీ దర్శనమిస్తున్నా, అక్కడ ఒక్క బస్ కూడా ఆగదు. గతంలో ఈ బస్టాపుకు రూట్ నెంబర్ 6, 113, 87 బస్సులు నిలిచేవి. కాని ప్రస్తుతం ఈ బస్సులన్ని జీహెచ్ఎంసీ ఆఫీసు ముందున్న అన్నపూర్ణ రూ. 5 లకే భోజనం స్టాల్ వద్దనున్న బస్టాపు వద్ద ఆగుతుండటంతో హాస్పిటల్ ను ఆనుకుని ఉన్న బస్టాపుకు ఒక్క బస్సు కూడా రాకపోయినా, స్టాపును కొనసాగిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ స్టాపులో అడ్వర్ టైజ్ మెంట్లు దర్శనమిచ్చాయి. జీహెచ్ఎంసీ అడ్వర్ టైజ్ మెంట్ వింగ్ లోని కొందరు అధికారులు కుమ్మక్కై, కొందరు యాడ్ ఏజెన్సీలతో కలిసి ఈ బస్టాపుపై అక్రమంగా అడ్వర్ టైజ్ మెంట్ల దందా కొనసాగించారు. ఈ విషయం బయట పడే సరికి ఇటీవలే ఈ స్టాపుపై ఉన్న అడ్వర్ టైజ్ మెంట్లను తొలగించినట్లు సమాచారం.

కొత్తగా మరో 1300 బస్టాపులు

హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్టీసి ప్రయాణికుల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ పరిధిలో మరో 1300 బస్టాపులకు స్థలాలను కేటాయించాలని ఆర్టీసి అధికారులు ఇటీవలే జీహెచ్ఎంసీకి లేఖ రాసినట్లు తెలిసింది. ప్రస్తుతం స్థలాల అన్వేషణలో ఉన్న జీహెచ్ఎంసీ అధికారులు స్థలాల సేకరణ పూర్తయిన తర్వాత అక్కడ షెల్టర్లను ఏర్పాటు చేసి, వాటి నిర్వహణ కోసం యాడ్ ఏజెన్సీలకు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. మరో ఆరు నెలల్లో షెల్టర్లను ఏర్పాటు చేసి, టెండర్ల ద్వారా వీటిని యాడ్ ఏజెన్సీలకు కేటాయించాలని బల్దియా అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

అస్తవ్యస్తంగా మారిన ఏసీ బస్ షెల్టర్లు

ఆర్టీసి బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు పక్కనే జీహెచ్ఎంసీ ఏసీ బస్ షెల్టర్లను ఏర్పాటు చేసింది. తొలుత వీటి వినియోగం సక్రమంగానే జరిగినా, రాత్రి పూట ఈ షెల్టర్లు అసాంఘిక శక్తులకు అడ్డాగ మారటంతో పాటు కాలక్రమేనా నిర్వహణ లేకపోవటంతో ప్రస్తుతం మూతపడ్డాయి. వీటిపై వ్యాపార ప్రకటనలు వేసుకుని వీటిని నిర్వహించాల్సిన యాడ్ ఏజెన్సీ నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం ఏసీ బస్ షెల్టర్లు అస్తవ్యస్తంగా మారటంతో ప్రయాణికులు రోడ్డుపైనే బస్సు కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ షెల్టర్ లోని ఏసీలు, కుర్చీలు కూడా అగంతకులు అపహరించుకుపోయినా పట్టించుకునే వారే కరవయ్యారు. జీహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రయాణికుల సౌకర్యాలను పక్కన బెట్టి, యాడ్ ఏజెన్సీల నుంచి డబ్బులు వస్తే చాలని భావిస్తున్నారన్న విమర్శలున్నాయి.

Also read: హైదరాబాద్‌కు జలగండం.. ఈ వాటర్ ఎమర్జెన్సీకి కారణమేంటి?

Tags

Related News

ఎవరీ వైఎస్ అనిల్ రెడ్డి? దేశవ్యాప్తంగా ఆయన పేరే ఎందుకు మారుమోగుతోంది?

హైదరాబాద్‌కు జలగండం.. ఈ వాటర్ ఎమర్జెన్సీకి కారణమేంటి?

‘సర్’ పై వ్యూహాత్మక మౌనం ! బీఆర్‌ఎస్ సైలెంట్ మోడ్‌..! ఆ మౌనం వెనుక మతలబేమిటీ…? పైగా ప్రతిపక్షంపైనే విమర్శల దాడి!

బియ్యం వ్యాపారులకు ప్రభుత్వం బిగ్ షాక్.. ఇకపై అలా చేస్తే జైలుకే..?

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పథకం ఫెయిలైందిక్కడే! ఇందిరమ్మ ఇండ్లు ఓకే.. ‘టవర్స్‌’ పై జిల్లాల్లో అనాసక్తి! లబ్దిదారుడి వాటే అసలు సమస్య?

మీ ఫ్యాషన్.. హైదరాబాద్ భవిష్యత్తును బూడిద చేస్తోందా?

ఎంపీ, ఎమ్మెల్యే సీట్లపై బిగ్ డిబేట్.. 70 ఏళ్లుగా ఒకే వర్గానికి రిజర్వేషన్.. రొటేషన్ ఎందుకు లేదు?

Big Stories

Advertisement
×