E-Paper
Advertisement

500 సినిమాలు చేశా.. కానీ నా పేరు చాలామందికి తెలియదు..ల్యాబ్ శరత్!

500 సినిమాలు చేశా.. కానీ నా పేరు చాలామందికి తెలియదు..ల్యాబ్ శరత్!
Advertisement

Lab Sharath:ల్యాబ్ శరత్…పేరు చెబితే టక్కున గుర్తుపట్టకపోవచ్చు కానీ అయనని చూడగానే ఓహో ఈయనా అని ఈజీగా గుర్తుపట్టేస్తాం . దాదాపు 500 సినిమాల్లో నటించాడు మరి.. ఎంతోమంది స్టార్ హీరోలు, హీరోయిన్లకు తండ్రి పాత్రల్లో కనిపించి అలరించిన ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలని ఇలా చెప్పుకొచ్చారు.

టెక్నీషియన్‌గా కెరీర్ ప్రారంభం.. అనుకోకుండా నటుడిగా!

Advertisement

తాను 1977లోనే ప్రసాద్ ల్యాబ్స్‌లో చేరానని . అక్కడ చీఫ్ టెక్నీషియన్‌గా పనిచేస్తూ సినిమా గ్రేడింగ్, నెగిటివ్ ప్రాసెసింగ్ వంటి పనుల్లో అనుభవం సంపాదించానని తెలిపారు . అప్పట్లో సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత రషెస్ చూడటం నుంచి ఫస్ట్ కాపీ వరకు ల్యాబ్ లో తానే కీరోల్ పోషించేవాడినని తెలిపారు.

అలా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల అనుభవం సంపాదించిన తనకి నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ సినిమాల్లోకి రావడం మాత్రం కాస్త ఆలస్యమైందనని చెప్పుకొచ్చారు. మొదట శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ‘ఆగ్రహం’ సినిమాలో రాజశేఖర్‌తో కలిసి నటించే అవకాశం వచ్చిందని, ఆ సినిమా విడుదలైన తర్వాతే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఆయనకు నటుడిగా గుర్తింపు వచ్చిందని తెలిపారు .

Advertisement

‘7జీ బృందావన్ కాలనీ’తో తండ్రి పాత్రల్లో గుర్తింపు!

ఇక తనకి మంచి గుర్తింపు తెచ్చిన సినిమాల్లో ‘7జీ బృందావన్ కాలనీ’ స్పెషల్ అని తెలిపారు.. ఈ సినిమాలో సోనియా అగర్వాల్ తండ్రిగా మొదట్లో తండ్రి పాత్ర చేయాలా అని ఆలోచించినప్పటికీ, నిర్మాతలు ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ పాత్రకు ఓకే చెప్పానని ఆరోజుల్ని గుర్తు చేసుకున్నారు . ఇక ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో మంచి పేరు వచ్చిందని .అలా తమిళంలోనూ ఈ సినిమాతో . నయనతార, కీర్తి సురేష్ వంటి స్టార్ హీరోయిన్లకు తండ్రి పాత్రల్లో కనిపించే అవకాశం వచ్చిందని తెలిపారు .

పవన్, బాలయ్య, మహేష్ సినిమాల్లోనూ నటన!

ఇక దాదాపు 500 సినిమాల్లో నటించిన తాను .. టాలీవుడ్‌లోని చాలామంది స్టార్ హీరోలతో కలిసి పనిచేశానని . పవన్ కళ్యాణ్ సినిమాల్లో సుమారు ఆరు సినిమాలు, బాలకృష్ణతో దాదాపు ఎనిమిది సినిమాల్లో నటించినట్లు గుర్తుచేసుకున్నారు.

మహేష్ బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘సర్కారు వారి పాట’ కళ్యాణ్ రామ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘పటాస్’ తనకు మంచి పేరు తెచ్చాయని తెలిపారు .ఇక ఇప్పటివరకు సుమారు 150 యాడ్స్‌లోనూ నటించినట్లు చెప్పారు.

క్యారెక్టర్ ఆర్టిస్టుల రెమ్యునరేషన్ ఎంతంటే?

ఇక ఈ ఇంటర్వ్యూలో క్యారెక్టర్ ఆర్టిస్టుల పారితోషికం గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించారు శరత్ . ఒక్కో ఆర్టిస్ట్‌కు రోజుకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తారనే దానికి ప్రత్యేకమైన రూల్ ఏమీ లేదని కొందరు నాలుగు లక్షల రూపాయల వరకు తీసుకుంటే, మరికొందరు రూ.10 వేలకే నటించే వాళ్లు ఉన్నారని తెలిపారు.

ఇక సుమారు 500 సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించిన తనకు పేరు కంటే ముఖంతోనే ఎక్కువ గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చారు. తనను చూసిన వెంటనే ప్రేక్షకులు గుర్తుపడుతున్నా, పేరు గుర్తుకు రాకపోవడం కొన్నిసార్లు బాధ కలిగిస్తుందని తెలిపారు. అయినప్పటికీ తన నటనను గుర్తుపెట్టుకుని సినిమాల్లోని డైలాగ్స్‌ను సైతం చెప్పే అభిమానులను చూసి ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చారు శరత్ !

ALSO READ:వైష్ణవి సోనీ హవా మామూలుగా లేదుగా..ఈ సాంగ్స్‌తోనే సెన్సేషన్!

Tags

Related News

‘వృషకర్మ’ నుండి ఫస్ట్ సింగిల్.. ఎక్స్‌క్లూజివ్ గా ఆమె కోసమే!

అందరి కోసం సినిమా తీయలేను.. మౌళి బోల్డ్ కామెంట్స్!

నిశ్చితార్థం తర్వాత సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ పోస్ట్..ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

బ్లూ శారీలో నిహారిక.. అదిరిపోయే అందంతో కట్టిపడేసిందిగా!

‘బెవర్లీ హిల్స్’ నటి మృతి.. అసలేం జరిగిందంటే?

ఒకేరోజు ముగ్గురు స్టార్ హీరోలు.. క్రిస్మస్‌కు బాక్సాఫీస్ వార్!

సురేఖ వాణి పర్సనల్ వీడియోలపై వివాదం.. స్పందించిన నటి!

Big Stories

Advertisement
×