Mega Family: ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్లు కూడా పెద్ద పెద్ద కలలను సాధించగలరు అని చాలామందికి ఉదాహరణగా మారారు. మెగాస్టార్ చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలామంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇండస్ట్రీలో సగం మంది ఆయన అభిమానులే.
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలి అని చాలామంది కలలు కంటూ ఉంటారు. కొందరికి మాత్రమే ఆ కల నిజం అవుతుంది. కొన్నిసార్లు ఆ కల నిజమైన కూడా పీడకలగా మారుతుంది. కొరటాల శివకు దాదాపుగా ఇదే జరిగింది. త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ వంటి దర్శకులకు రాని అవకాశం ప్రస్తుతం చాలా మంది యంగ్ దర్శకులకు చిరంజీవితో పనిచేసే అవకాశం కలుగుతుంది.
బ్లాక్ బస్టర్ వీరయ్య
మెగాస్టార్ చిరంజీవిని ఎలా చూడటానికి ఇష్టపడతారు దర్శకుడు బాబికి బాగా తెలుసు. స్వతహాగా మెగాస్టార్ అభిమాని కావడంతో ఆ క్యారెక్టర్ ను అద్భుతంగా డిజైన్ చేశాడు. సంక్రాంతి కానుక విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. కానీ ఈ సక్సెస్ మొత్తం మెగాస్టార్ చిరంజీవి క్రెడిట్ లో వేయలేం. ఎందుకంటే దానిలో రవితేజకు కూడా కొంత పాత్ర ఉంది. రవితేజ మీదే కథ నిలబడి ఉంటుంది కాబట్టి కొంత క్రెడిట్ ఇవ్వకు తప్పదు.
అంచనాలన్నీ వీరమల్లు పైన
ప్రస్తుతం మెగా ఫ్యామిలీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. సరైన హిట్ సినిమా లేక మెగా ఫ్యామిలీ ప్రస్తుతం సతమతం అవుతుంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన మట్కా సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు. ఇక ప్రస్తుతం మెగా అభిమానుల ఆశలన్నీ కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా మీద ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా జూన్ 12న ప్రేక్షకులు ముందుకు వస్తుంది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్థాయిలో ఎంట్రీ ఇవ్వనున్నారు.
మెగా ఫ్యామిలీకి శంకర్ శాపం
మెగా ఫ్యామిలీకి ‘శంకర్’ రిఫరెన్సులు కలిసి లేదు. చిరు అసలు పేరు శివ శంకర్ వరప్రసాద్ అయినప్పటికీ అతనికి ‘భోళా శంకర్’ పెద్ద డిజాస్టర్ ఇచ్చింది. ఇక శంకర్ దర్శకత్వంలో చరణ్ చేసిన ‘గేమ్ ఛేంజర్’ భారీ నష్టాలు మిగిల్చింది. వైష్ణవ్ తేజ్ ‘ఆది కేశవ’ కూడా ఎపిక్ డిజాస్టర్స్ లో ఒకటిగా మిగిలిపోయింది. ‘బ్రో’ సినిమాలో కూడా సాయి ధరమ్ తేజ్ పేరులో మార్కండేయ అని ఉంటుంది. అది కూడా ఆడలేదు. అందుకే మెగా హీరోలకి శంకర్ రిఫరెన్సులు కలిసిరావడం లేదు అని స్పష్టమవుతుంది. దీనితో శంకర్ రిలేటెడ్ గా ఉన్న పేర్లు మెగా ఫ్యామిలీకి శాపంగా మారాయా అని కొంతమంది సందేహాలు.
Also Read : SSMB29 : బిగ్ బ్రేకింగ్, మహేష్ బాబు, రాజమౌళి సినిమా షూటింగ్ క్యాన్సిల్