Actress Jahnavi: తెలుగు సినిమా పరిశ్రమలో కొద్ది సినిమాలో చేసినా, మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీనటులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు యాంకర్ కం నటి జాహ్నవి. సొంత టీవీ షోలతో పాపులర్ అయిన జాహ్నవి, ఆ తర్వాత సహాయక నటిగా పాపులర్ అయ్యింది. పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ‘యజ్ఞం’ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా, ముస్లీం యువతిగా ఓ రేంజ్ లో రచ్చ చేసింది. అందరినీ ఆకట్టుకుంది. ‘హ్యాపీ’ సినిమాలో కూడా బన్నీ ఫ్రెండ్ గా నటించి మెప్పించింది. ‘ఒకరికొకరు’ సహా పలు సినిమాల్లో నటించింది.
సినిమాటోగ్రాఫర్ రసూల్ తో ప్రేమ వివాహం
నటిగా రాణిస్తున్న సమయంలోనే సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ‘ఒకరికొకరు’ సినిమా సెట్స్ లో ఇద్దరు తొలిసారి పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొంత కాలం తర్వాత తన కంటే 16 ఏళ్లు పెద్దవాడైన రసూల్ తో మూడు ముళ్లు వేయించుకుంది జాహ్నవి. వీరి పెళ్లి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నారు. వార్తల్లోకి ఎక్కారు. పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరం అయ్యారు. ఇద్దరూ కలిసే సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె భర్త రసూల్ వెల్లడించాడు.
ఫ్యాషన్ డిజైనర్ గా రాణింపు
పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయిన జాహ్నవి.. ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రయత్నం చేసినా అవకాశాలు రాలేదట. ఈ నేపథ్యంలో ఫ్యాషన్ డిజైనర్ గా మారింది. అడవి శేష్ హీరోగా నటించిన ‘ఎవరు’ సినిమా కు ఆమె ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసింది. సినిమాల్లోకి రావాలనే ఆశతో మరింత స్లిమ్ గా మారినట్లు తెలుస్తోంది. అప్పట్లో కాస్త బొద్దుగా ఉన్నా, ఇప్పుడు సన్నజాజి తీగలా మారిపోయిందట.
Read Also: కారు అంత బరువున్న రాకాసి పాము.. ఇంకా పెరుగుతూనే ఉందట!
నటిగా కాదు, దర్శకురాలిగా పరిచయం?
జాహ్నవి ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి ఆమె భర్త రసూల్ తాజాగా కీలక విషయాలు చెప్పుకొచ్చారు. ఆమెలో నటి కంటే మంచి డైరెక్టర్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. త్వరలోనే ఆమె డైరెక్టర్ గా పరిచయం అయ్యే అవకాశం ఉన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. నటిగా తిరిగి వస్తే బాగుటుందని ఆమె అభిమానులు, భావించినా, ఎలాగోలా వస్తే చాలా అని ఫీలవుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, త్వరలో జాహ్నవి మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అటు తమకు ఒక బాబు ఉన్నట్లు చెప్పారు. అతడి పేరు రెహాన్ అన్నారు. 12వ తరగతి చదువుతున్న రెహాన్.. ప్రస్తుతం తెలంగాణ తరఫున బాస్కెట్ బాల్ ఆడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్నట్లు వివరించారు.
Read Also: తిరుమల లైన్ లో ఉన్నప్పుడు అలా చేస్తారా? అమ్మవారికి అవే నైవేద్యం.. వేణుస్వామి అనుచిత వ్యాఖ్యలు!