Bhogi Release Date: శర్వానంద్ హీరోగా ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న శర్వానంద్ (Sharwanand)త్వరలోనే భోగి(Bhogi) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమైన నేపథ్యంలో విడుదల కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఇక నవంబర్ 12వ తేదీ విడుదల పక్కా అంటూ చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు. అయితే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కానీ నేపథ్యంలో ఈ సినిమా మరోసారి వాయిదా పడింది.
ఈ సినిమా నవంబర్ 12 నుంచి వాయిదా పడిన నేపథ్యంలో తదుపరి ఎప్పుడు విడుదలవుతుంది అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేశారు. ఇక డిసెంబర్ నెలలో పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఇప్పటికే భారీగా సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శర్వానంద్ భోగి ఎప్పుడు ఉంటుంది అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిందని తెలుస్తోంది.
ఈ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ (A Certificate)జారీచేసారని తెలుస్తోంది. ఇలా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన విడుదల తేదీని చిత్ర నిర్మాతలు అధికారకంగా ప్రకటించబోతున్నారు. ఇక ఈ సినిమా నవంబర్ 27న విడుదల కాబోతున్న నేపథ్యంలో నటి రష్మిక మందన్న మైసా సినిమాకు పోటీగా విడుదల కాబోతుందని చెప్పాలి. అదే రోజు మైసా సినిమా కూడా విడుదల కాబోతున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా ప్రమోషన్లను మాత్రం అనుకున్న స్థాయిలో నిర్వహించకపోవడంతో రష్మిక సినిమా మరోసారి వాయిదా పడుతుందంటూ వార్తలు వస్తున్నాయి.
ఇక శర్వానంద్ భోగి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా 1960 లలో ఉత్తర తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులలో ఉండే ఒక గ్రామం నేపథ్యంలో కొనసాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో శర్వానంద్ గంగ అనే పాత్రలో కనబడుతున్నారు. ఇదివరకు ఫ్యామిలీ కథ, ప్రేమ కథ సినిమాలతో మెప్పించిన ఈయన మొదటిసారి యాక్షన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ జారీ చేయడంతో ఈ సారి శర్వా రక్తపాతం చూపించబోతున్నారని తెలుస్తుంది. మరి నవంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భోగి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.
Also Read: సూర్య విలన్ గా టాలీవుడ్ స్టార్..డైరెక్టర్ వేరే లెవెల్ ప్లానింగ్!